కలలో ఒంటెలు, ఏనుగులు లేదా పాములు కనిపించాయా.. దీని అర్థమేంటో తెలుసా?

Published : Sep 04, 2023, 12:14 PM IST

కలలు పడటం చాలా సాధారణం. అయితే కలలు కూడా మనకు జరగబోయే మంచి చెడుల గురించి చెప్తాయని జ్యోతిష్యులు చెబుతుంటారు. కలలో ఒంటెలు, ఏనుగులు లేదా ఇతర జంతువులను చూడటం డ్రీమ్ సైన్స్ ప్రకారం ఏం అర్థం వస్తుందో తెలుసా? 

PREV
15
కలలో ఒంటెలు, ఏనుగులు లేదా పాములు కనిపించాయా.. దీని అర్థమేంటో తెలుసా?

రాత్రిళ్లు నిద్రలో కలలు పడటం చాలా సహజం. మనలో చాలా మంది ఎన్నో విధాలా కలలుగంటుంటారు. అయితే డ్రీమ్ సైన్స్ ప్రకారం.. కలలో కనిపించే వస్తువులు లేదా సంఘటనలు మన భవిష్యత్తు గురించి కొన్ని ఆధారాలను ఇస్తాయి. అవి మంచి కావొచ్చు. చెడు కావొచ్చు. అయితే చాలా మందికి కలలో పాములు, ఒంటెలు, ఏనుగులు వంటి జంతువులు కనిపిస్తాయి. డ్రీమ్ సైన్స్ ప్రకారం.. వీటి అర్థం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

25

కలలో ఏనుగు కనిపిస్తే..

కలలో ఏనుగు కనిపించడం ఎంతో పవిత్రంగా భావిస్తారు. కలలో ఏనుగు కనిపిస్తే మీ ఇంటికి లక్ష్మీదేవి వచ్చే అవకాశం ఉన్నట్టు. ఎందుకంటే ఏనుగులను లక్ష్మీదేవికి చిహ్నంగా భావిస్తారు. అలాగే కలలో ఏనుగుల గుంపు మీకు కనిపిస్తే మీ సంపద పెరుగుతుందని అర్థం వస్తుంది. 

35

కలలో గుర్రాలు కనిపిస్తే.. 

డ్రీమ్ సైన్స్ ప్రకారం.. కలలో గుర్రం కనిపించడం కూడా చాలా చాలా మంచిది. శుభప్రదం కూడా. ఎందుకంటే ఇది మీ అదృష్టాన్ని సూచిస్తుంది. మీ కలలో గుర్రాలు పరిగెత్తితే అది మీ పురోగతికి సంకేతం. అలాగే మీ కలలో గుర్రపు పాదం కనిపిస్తే అది కూడా మంచిదని భావిస్తారు. మీరు కలలో గుర్రపు స్వారీ చేస్తుంటే ఎంతో పవిత్రమైనదిగా భావిస్తారు. ఈ కల మీకు త్వరలోనే మీకు సంపద పెరుగుతుందని సూచిస్తుంది. 
 

45

కలలో ఒంటెలు కనిపిస్తే.. 

డ్రీమ్ సైన్స్ ప్రకారం.. మీరు కలలో ఒంటెను చూస్తే భవిష్యత్తులో మీరు మీ కెరీర్లో మంచి పురోగతి సాధించే అవకాశాలు ఉన్నాయని అర్థం. దీనితో పాటుగా మీరు డబ్బును కూడా పొందే అవకాశం ఉంది. 
 

55

కలలో పాములు కనిపిస్తే ..

మీరు కలలో పాములను చూసినా.. వాటిని పట్టుకున్నా.. డ్రీమ్ సైన్స్  ప్రకారం.. దీన్ని ఎంతో పవిత్రంగా భావిస్తారు. ఈ కల రాబోయే కాలంలో మీరు డబ్బును బాగా పొందుతారని అర్థమిస్తుంది. అలాగే ఈ కల త్వరలోనే మీ సమస్యలన్నీ పోతాయని సూచిస్తుంది కూడా.

Read more Photos on
click me!

Recommended Stories