ఈ రోజు రాశి ఫలాలు పంచాంగకర్త ఫణికుమార్ అందిస్తున్నారు. నేడు ఏ రాశి వారికి ఎలా ఉందో ఇక్కడ వివరంగా తెలుసుకుందాం.
213
మేష రాశి ఫలాలు
ఉద్యోగాలలో అధికారులతో జాగ్రత్త అవసరం. దూర ప్రయాణాలు వాయిదా పడతాయి. చేపట్టిన పనులలో జాప్యం కలుగుతుంది. వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. సోదరులతో స్థిరాస్తి వివాదాలు కలుగుతాయి. ఆర్థిక విషయాలు నిరాశ కలిగిస్తాయి.
313
వృషభ రాశి ఫలాలు
సమాజంలో ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. సన్నిహితుల నుంచి ధన లాభ సూచనలు ఉన్నాయి. చేపట్టిన పనుల్లో విజయం సాధిస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలు సజావుగా సాగుతాయి. ఆప్తుల నుంచి శుభవార్తలు అందుతాయి. వాహన కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి.
బంధువుల నుంచి ఒక వ్యవహారంలో ఒత్తిడి తప్పదు. మిత్రులతో చిన్నపాటి విభేదాలు ఉంటాయి. ఆర్థిక విషయాలు నిరాశ పరుస్తాయి. ఉద్యోగాలలో నిరుత్సాహం తప్పదు. ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నాయి. వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి.
513
కర్కాటక రాశి ఫలాలు
ఇంట్లో శుభకార్యాలు నిర్వహిస్తారు. ఇంటా బయటా అనుకూల పరిస్థితులు ఉంటాయి. నిరుద్యోగుల శ్రమ ఫలిస్తుంది. కొత్త వ్యక్తుల పరిచయాలు ఆనందాన్నిస్తాయి. వ్యాపార, ఉద్యోగాలలో మరింత ఉత్సాహకర వాతావరణం ఉంటుంది. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు.
613
సింహ రాశి ఫలాలు
ఇంట్లో ఆశ్చర్యకరమైన సంఘటనలు చోటుచేసుకుంటాయి. చేపట్టిన పనులు విజయవంతమవుతాయి. వ్యాపారాలు అభివృద్ధి చెందుతాయి. వృత్తి, ఉద్యోగాలలో పైచేయి సాధిస్తారు. గృహ నిర్మాణ ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. ఉద్యోగాలలో మీ ప్రతిభ వెలుగులోకి వస్తుంది.
713
కన్య రాశి ఫలాలు
వ్యాపార, ఉద్యోగాలలో మరింత అనుకూల వాతావరణం ఉంటుంది. చేపట్టిన పనులు నిదానంగా సాగుతాయి. ఆప్తుల సలహాలు కలసివస్తాయి. నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉంటుంది. సన్నిహితులతో వివాదాలు పరిష్కారమవుతాయి.
813
తుల రాశి ఫలాలు
సోదరులతో మాటపట్టింపులుంటాయి. ముఖ్యమైన పనులు వాయిదా పడతాయి. స్వల్ప ఆరోగ్య సమస్యలు భాధిస్తాయి. వ్యాపారాలు నిదానంగా సాగుతాయి. ఉద్యోగాలలో కాస్త నిరుత్సాహం తప్పదు. కుటుంబ విషయంలో ఆలోచనలు స్థిరంగా ఉండవు.
913
వృశ్చిక రాశి ఫలాలు
కొన్ని సంఘటనలు ఆశ్చర్యం కలిగిస్తాయి. నూతన వ్యక్తుల పరిచయాలు ఉత్సాహాన్నిస్తాయి. వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. ఉద్యోగాలలో అధికారుల ఆదరణ పెరుగుతుంది. ఇంట్లో శుభకార్యాలు నిర్వహిస్తారు. పాత బాకీలు వసూలవుతాయి.
1013
ధనుస్సు రాశి ఫలాలు
నూతన వాహన యోగం ఉంది. సన్నిహితులతో విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. చిన్ననాటి మిత్రులతో సఖ్యతగా వ్యవహరిస్తారు. వ్యాపార, ఉద్యోగాలు సాఫీగా సాగుతాయి. చేపట్టిన వ్యవహారాల్లో విజయం సాధిస్తారు. ఆప్తుల నుంచి ఆహ్వానాలు అందుతాయి.
1113
మకర రాశి ఫలాలు
వ్యాపార విస్తరణకు అవరోధాలు కలుగుతాయి. మీ ఆలోచనలు ఇతరులకు నచ్చవు. ముఖ్యమైన వ్యవహారాలలో ఆటంకాలు ఉంటాయి. ఉద్యోగాలలో సహోద్యోగులతో సమస్యలు తప్పవు. ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నాయి. బంధువులతో మాటపట్టింపులుంటాయి.
1213
కుంభ రాశి ఫలాలు
వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. ఉద్యోగాలలో రావాల్సిన పదవులు చేజారుతాయి. చేపట్టిన పనులు మధ్యలో వాయిదా వేస్తారు. ఆలోచనలు నిలకడగా ఉండవు. దైవ కార్యక్రమాలలో పాల్గొంటారు. కుటుంబ సభ్యులతో ఆలోచించి మాట్లాడాలి.
1313
మీన రాశి ఫలాలు
స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. సమాజంలో ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. వ్యాపారాలలో ముఖ్యమైన నిర్ణయాలు అమలు చేస్తారు. ఉద్యోగాలలో సమస్యలు పరిష్కారమవుతాయి. ఆత్మీయుల నుంచి శుభవార్తలు అందుతాయి.