Today Rasi Phalalu: నేడు ఓ రాశివారికి అదృష్టయోగం, పట్టిందల్లా బంగారమే!

Published : Jun 08, 2026, 05:00 AM IST

Today Rasi Phalalu: ఈ రాశి ఫలాలు 08.06.2026 సోమవారానికి సంబంధించినవి. మేష, వృషభ, మిథున, కర్కాటక, సింహ, కన్య, తుల, వృశ్ఛిక, ధనుస్సు, మకర, కుంభ, మీన రాశుల దిన ఫలాలు ఇక్కడ తెలుసుకోండి.

PREV
113
నేటి రాశి ఫలాలు

ఈ రోజు రాశి ఫలాలు పంచాంగకర్త ఫణికుమార్ అందిస్తున్నారు. నేడు ఏ రాశి వారికి ఎలా ఉందో ఇక్కడ వివరంగా తెలుసుకుందాం.

213
మేష రాశి ఫలాలు

గృహ నిర్మాణ ప్రయత్నాలు వాయిదా వేస్తారు. కొన్ని సంఘటనలు మానసిక అశాంతి కలిగిస్తాయి. చేపట్టిన పనులలో ఆటంకాలు కలుగుతాయి. బంధువులతో విభేదాలు తప్పవు. వ్యాపార, ఉద్యోగాలలో నిరుత్సాహ వాతావరణం ఉంటుంది.

313
వృషభ రాశి ఫలాలు

ఆర్థిక ఇబ్బందులు చికాకు పరుస్తాయి. నూతన రుణ యత్నాలు చేస్తారు. ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నాయి. వ్యాపారాలు స్వల్పంగా లాభిస్తాయి. కొన్ని ముఖ్యమైన పనులు శ్రమతో కానీ పూర్తికావు. ఉద్యోగ వాతావరణం గందరగోళంగా ఉంటుంది.

413
మిథున రాశి ఫలాలు

సంఘంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. సన్నిహితుల నుంచి ధన లాభ సూచనలు ఉన్నాయి. మిత్రులతో వివాదాల నుంచి బయటపడతారు. ఆప్తుల నుంచి విలువైన సమాచారం సేకరిస్తారు. వ్యాపార వ్యవహారాల్లో పురోగతి సాధిస్తారు. ఉద్యోగాలలో నూతన ప్రయత్నాలు ఫలిస్తాయి.

513
కర్కాటక రాశి ఫలాలు

కుటుంబానికి సంబంధించిన కొన్ని విషయాలు ఆశ్చర్యపరుస్తాయి. దీర్ఘకాలిక సమస్యలు తీరి ఊరట చెందుతారు. వ్యాపార విస్తరణకు సన్నిహితుల సహాయ సహకారాలు అందుతాయి. సమాజంలో పరిచయాలు పెరుగుతాయి. ఉద్యోగులకు అదనపు బాధ్యతల నుంచి ఉపశమనం లభిస్తుంది.

613
సింహ రాశి ఫలాలు

ఇంటా బయటా ఒత్తిడులు పెరుగుతాయి. ఆధ్యాత్మిక విషయాలపై దృష్టి సారిస్తారు. వృత్తి, వ్యాపారాలు నిరాశ కలిగిస్తాయి. ఆర్థిక ఇబ్బందుల వల్ల కొత్త అప్పులు చేస్తారు. ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నాయి. ఉద్యోగాలలో మార్పులుంటాయి.

713
కన్య రాశి ఫలాలు

బంధు మిత్రులతో ఊహించని మాట పట్టింపులుంటాయి. కుటుంబ వ్యవహారాలలో ఆలోచనలు స్థిరంగా ఉండవు. ప్రయాణాల్లో అవరోధాలు కలుగుతాయి. వ్యాపార విషయంలో తొందరపాటు నిర్ణయాలు నిరాశ పరుస్తాయి. ఉద్యోగులకు పని ఒత్తిడి పెరుగుతుంది.

813
తుల రాశి ఫలాలు

విద్యార్థులు పోటీ పరీక్షలలో విజయం సాధిస్తారు. సంఘంలో గౌరవ మర్యాదలకు లోటు ఉండదు. విలువైన వస్తు లాభాలు పొందుతారు. దూరపు బంధువుల నుంచి శుభవార్తలు అందుకుంటారు. ఉద్యోగాలలో నూతన ప్రోత్సాహకాలు అందుతాయి.

913
వృశ్చిక రాశి ఫలాలు

బంధువులతో వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. వృత్తి, వ్యాపారాలలో కష్టానికి తగిన ఫలితం దక్కదు. వ్యాపారాలు నిదానంగా సాగుతాయి. చేపట్టిన పనుల్లో జాప్యం తప్పదు. ఆర్థిక విషయాలు నిరుత్సాహపరుస్తాయి. నిరుద్యోగ ప్రయత్నలలో అవరోధాలు కలుగుతాయి.

1013
ధనుస్సు రాశి ఫలాలు

చేపట్టిన వ్యవహారాలలో విజయం సాధిస్తారు. నూతన గృహ వాహనాలు కొనుగోలు చేస్తారు. కుటుంబ వ్యవహారాలలో కీలక నిర్ణయాలు అమలు చేస్తారు. దూరపు బంధువుల రాకతో ఇంట్లో సందడి వాతావరణం ఉంటుంది. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగాలలో ఇబ్బందులు తొలగుతాయి.

1113
మకర రాశి ఫలాలు

కుటుంబ సభ్యులతో దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలు సాదాసీదాగా సాగుతాయి. ఆర్థిక ఇబ్బందులు చికాకు పరుస్తాయి. స్వల్ప అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. ఉద్యోగులకు పనిభారం పెరుగుతుంది.

1213
కుంభ రాశి ఫలాలు

స్థిరాస్తి కొనుగోలు చేస్తారు. సోదరుల కలయిక ఆనందం కలిగిస్తుంది. ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. సన్నిహితులతో వివాదాలు పరిష్కారమవుతాయి. వ్యాపారాలలో అనుకూల వాతావరణం ఉంటుంది. ఉద్యోగులకు హోదాలు పెరుగుతాయి.

1313
మీన రాశి ఫలాలు

ఇతరులకు సహాయ సహకారాలు అందిస్తారు. వృత్తి, వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. చేపట్టిన పనుల్లో విజయం సాధిస్తారు. ఆప్తుల సలహాలు కలిసివస్తాయి. ఉద్యోగులకు పదోన్నతులు పెరుగుతాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ఆర్థికంగా అనుకూలం.

Read more Photos on
click me!

Recommended Stories