ఈ రోజు రాశి ఫలాలు పంచాంగకర్త ఫణికుమార్ అందిస్తున్నారు. నేడు ఏ రాశి వారికి ఎలా ఉందో ఇక్కడ వివరంగా తెలుసుకుందాం.
213
మేష రాశి ఫలాలు
చిన్ననాటి మిత్రులతో విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆలయ దర్శనాలు చేసుకుంటారు. ముఖ్యమైన వ్యవహారాలలో పురోగతి కలుగుతుంది. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. వ్యాపార విస్తరణ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఉద్యోగాలలో ఒడిదుడుకులు తొలగుతాయి.
313
వృషభ రాశి ఫలాలు
ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. చిన్ననాటి విషయాలు గుర్తు చేసుకుంటారు. ఇంట్లో కొన్ని సంఘటనలు ఆశ్చర్యం కలిగిస్తాయి. సమాజంలో ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. వ్యాపారాలలో అవరోధాలు అధిగమించి ముందుకు సాగుతారు. ఉద్యోగాలు అనుకూలం.
ముఖ్యమైన పనులలో శ్రమకు తగిన ఫలితం ఉండదు. ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. సన్నిహితులతో కలహా సూచనలు ఉన్నాయి. నూతన రుణ యత్నాలు వేగవంతం చేస్తారు. ఉద్యోగాలలో ఊహించని సమస్యలు వస్తాయి.
513
కర్కాటక రాశి ఫలాలు
కొన్ని వ్యవహారాలు శ్రమతో కానీ పూర్తికావు. బంధు మిత్రులతో విభేదాలు కలుగుతాయి. అనారోగ్య సమస్యలు చికాకు పరుస్తాయి. చేపట్టిన పనులు మధ్యలో వాయిదా పడతాయి. కుటుంబంలో ఊహించని వివాదాలు కలుగుతాయి. వ్యాపారాలు నిరాశ పరుస్తాయి. ఉద్యోగాలలో పని ఒత్తిడి అధికమవుతుంది.
613
సింహ రాశి ఫలాలు
విద్యార్థులకు ఉన్నత విద్యా ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆకస్మిక ధన లాభ సూచనలు ఉన్నాయి. చేపట్టిన పనులలో ఆకస్మిక విజయం సాధిస్తారు. ప్రతికూల పరిస్థితుల నుంచి తెలివిగా బయటపడతారు. వ్యాపారాలు పుంజుకుంటాయి. ఉద్యోగ వాతావరణం సంతృప్తికరంగా ఉంటుంది.
713
కన్య రాశి ఫలాలు
చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తు చేసుకుంటారు. గృహ నిర్మాణ ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. ఆలయ దర్శనాలు చేసుకుంటారు. సమాజంలో పేరు కలిగిన వ్యక్తుల నుంచి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. వ్యాపారాలు అనుకూలిస్తాయి. ఉద్యోగాలలో నూతన ప్రోత్సాహకాలు అందుతాయి.
813
తుల రాశి ఫలాలు
ఆరోగ్యం విషయంలో అశ్రద్ధ పనికి రాదు. దూర ప్రయాణాలు వాయిదా పడతాయి. కొన్ని పనులు శ్రమతో కానీ పూర్తికావు. బంధువులతో మాటపట్టింపులు ఉంటాయి. వ్యాపారాలలో గందరగోళ పరిస్థితులు ఉంటాయి. ఉద్యోగ వాతావరణం నిరాశ కలిగిస్తుంది.
913
వృశ్చిక రాశి ఫలాలు
దూర ప్రయాణాలలో శ్రమ మరింత అధికమవుతుంది. దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. నిరుద్యోగులకు కష్టానికి తగిన ఫలితం ఉండదు. వృత్తి, వ్యాపారాలలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం మంచిది కాదు. చేపట్టిన వ్యవహారాలలో అవాంతరాలు తప్పవు.
1013
ధనుస్సు రాశి ఫలాలు
ఆర్థికంగా అభివృద్ధి కలుగుతుంది. దూరపు బంధువుల నుంచి కీలక విషయాలు సేకరిస్తారు. కొన్ని వ్యవహారాలలో ప్రముఖుల సలహాలు కలిసివస్తాయి. మంచి మాట తీరుతో ఇంటా బయటా అందరినీ ఆకట్టుకుంటారు. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగాలలో హోదాలు పెరుగుతాయి.
1113
మకర రాశి ఫలాలు
అనుకోని ప్రయాణాలు చేస్తారు. రుణ దాతల నుంచి ఒత్తిడులు పెరుగుతాయి. దైవ సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. వ్యాపారాలలో పెట్టుబడులు పెట్టకపోవటం మంచిది. కొన్ని వ్యవహారాలు ముందుకు సాగక నిరాశ పెరుగుతుంది. ఆలోచనలు స్థిరంగా ఉండవు. ఉద్యోగ ప్రయత్నాలు మందకొడిగా సాగుతాయి.
1213
కుంభ రాశి ఫలాలు
నిరుద్యోగులకు ఉద్యోగ ప్రయత్నాలు కలిసివస్తాయి. ఉద్యోగాలలో అధికారుల సహాయ సహకారాలు పొందుతారు. వ్యాపారులకు అవసరానికి డబ్బు సహాయం లభిస్తుంది. బంధు మిత్రుల నుంచి శుభవార్తలు అందుతాయి. మిత్రుల నుంచి ఆకస్మిక ధన లబ్ది పొందుతారు. దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు.
1313
మీన రాశి ఫలాలు
ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నాయి. నూతన రుణ ప్రయత్నాలు చేయాల్సి వస్తుంది. ముఖ్యమైన పనులు వాయిదా వేస్తారు. చేపట్టిన పనులలో శ్రమ మరింత అధికమవుతుంది. అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. వ్యాపార, ఉద్యోగాలలో మరింత ఒత్తిడులు పెరుగుతాయి.