Today Rasi Phalalu: నేడు ఓ రాశివారు ఇతరుల వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడం మంచిదికాదు!

Published : Oct 26, 2026, 05:00 AM IST

Today Rasi Phalalu: ఈ రాశి ఫలాలు 26.10.2026 సోమవారానికి సంబంధించినవి. మేష, వృషభ, మిథున, కర్కాటక, సింహ, కన్య, తుల, వృశ్ఛిక, ధనుస్సు, మకర, కుంభ, మీన రాశుల దిన ఫలాలు ఇక్కడ తెలుసుకోండి.

PREV
113
నేటి రాశి ఫలాలు

ఈ రోజు రాశి ఫలాలు పంచాంగకర్త ఫణికుమార్ అందిస్తున్నారు. నేడు ఏ రాశి వారికి ఎలా ఉందో ఇక్కడ వివరంగా తెలుసుకుందాం.

213
మేష రాశి ఫలాలు

ఆదాయానికి మించి ఖర్చులు పెరుగుతాయి. ఇంటా బయటా ఊహించని వివాదాలు చికాకు పరుస్తాయి. ఆరోగ్యం విషయంలో వైద్య సంప్రదింపులు చేయాల్సి వస్తుంది. వృత్తి, వ్యాపారాలలో శ్రమకు తగిన ఫలితం దక్కదు. ముఖ్యమైన పనులు వాయిదా పడతాయి. ఉద్యోగాలలో మార్పులు ఉంటాయి.

313
వృషభ రాశి ఫలాలు

రావాల్సిన సొమ్ము సకాలంలో చేతికి అందుతుంది. నిరుద్యోగులకు చాలా కాలంగా ఎదురుచూస్తున్న అవకాశాలు లభిస్తాయి. స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు వేగవంతం చేస్తారు. చిన్ననాటి విషయాలు గుర్తుకు తెచ్చుకుంటారు. అనుకున్న పనులు అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు. ఉద్యోగ వాతావరణం మరింత అనుకూలిస్తుంది.

413
మిథున రాశి ఫలాలు

ఉద్యోగులకు అధికారుల ఆదరణ పెరుగుతుంది. దైవసేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. వృత్తి, వ్యాపారాలు లాభాల బాట పడతాయి. ఇంటా బయటా మీ మాటకు విలువ పెరుగుతుంది. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. పాత మిత్రుల కలయిక ఉత్సాహాన్నిస్తుంది. చేపట్టిన పనుల్లో విజయం సాధిస్తారు.

513
కర్కాటక రాశి ఫలాలు

దూరపు బంధువుల నుంచి శుభవార్త అందుతుంది. వ్యాపార, ఉద్యోగాలు నిరుత్సాహపరుస్తాయి. నిరుద్యోగుల శ్రమ వృథాగా మిగులుతుంది. ఇతరుల వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడం మంచిదికాదు. ఆర్థిక పరిస్థితి కొంత నిరాశ కలిగిస్తుంది. చేపట్టిన పనుల్లో చికాకులు తప్పవు.

613
సింహ రాశి ఫలాలు

అధికారులతో అప్రమత్తంగా వ్యవహరించాలి. రుణదాతల నుంచి ఒత్తిడి పెరుగుతుంది. అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. కుటుంబ వాతావరణం గందరగోళంగా ఉంటుంది. శ్రమతో కానీ పనులు పూర్తి కావు. వ్యాపారాలు ఆశించిన విధంగా రాణించవు.

713
కన్య రాశి ఫలాలు

నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి. గృహ నిర్మాణ పనులు ప్రారంభిస్తారు. వృత్తి, ఉద్యోగాలలో మీ ప్రతిభ వెలుగులోకి వస్తుంది. సంఘంలో విశేషమైన గౌరవ మర్యాదలు పొందుతారు. విలువైన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి.

813
తుల రాశి ఫలాలు

చిన్ననాటి మిత్రులతో విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. సమాజంలో గౌరవ మర్యాదలకు లోటుండదు. సన్నిహితుల నుంచి శుభకార్యాలకు ఆహ్వానాలు అందుతాయి. వృత్తి, ఉద్యోగాల్లో ఆశించిన పురోగతి సాధిస్తారు. వ్యాపార విస్తరణకు నూతన పెట్టుబడులు అందుతాయి.

913
వృశ్చిక రాశి ఫలాలు

దైవచింతన పెరుగుతుంది. పెద్దల ఆరోగ్య సమస్యలు మానసికంగా కలచివేస్తాయి. వృత్తి, వ్యాపారాల్లో భాగస్వాములతో వివాదాలు తలెత్తుతాయి. కుటుంబ సభ్యులతో అకారణంగా కలహాలు కలుగుతాయి. ముఖ్యమైన పనులు వాయిదా వేయడం మంచిది. ఉద్యోగ ప్రయత్నాలు మందగిస్తాయి.

1013
ధనుస్సు రాశి ఫలాలు

వ్యాపారాలు నిరుత్సాహపరుస్తాయి. ముఖ్యమైన పనులు కొన్ని వాయిదా వేస్తారు. బంధువులతో వివాదాలకు దూరంగా ఉండడం మంచిది. వృత్తి, ఉద్యోగాలలో ఊహించని మార్పులు చోటుచేసుకుంటాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. పాత అప్పులు తీర్చడానికి కొత్త అప్పులు చేస్తారు.

1113
మకర రాశి ఫలాలు

వ్యాపార, ఉద్యోగాలలో సమస్యలు పరిష్కరించుకుంటారు. కుటుంబ సభ్యులతో శుభకార్యాలలో పాల్గొంటారు. విలువైన వస్తువులను బహుమతులుగా పొందుతారు. ఆర్థిక పరిస్థితి మరింత మెరుగ్గా ఉంటుంది. చేపట్టిన వ్యవహారాలలో విజయం సాధిస్తారు. సంతాన విద్యా, ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి.

1213
కుంభ రాశి ఫలాలు

వ్యాపార విస్తరణ ప్రయత్నాలు మందగిస్తాయి. బంధువులతో అకారణంగా విభేదాలు కలుగుతాయి. కుటుంబ వ్యవహారాల్లో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. ఆర్థికంగా ఇబ్బందులు తప్పవు. ముఖ్యమైన వ్యవహారాల్లో శ్రమ తప్ప ఫలితం కనిపించదు. ఉద్యోగాలలో అధికారులతో సమస్యలుంటాయి.

1313
మీన రాశి ఫలాలు

సంతాన విదేశీ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు మరింత ఉత్సాహాన్నిస్తాయి. వృత్తి, ఉద్యోగాలలో మీ అంచనాలు నిజమవుతాయి.

Read more Photos on
click me!

Recommended Stories