Today Rasi Phalalu: నేడు ఓ రాశివారు విలువైన పత్రాల విషయంలో జాగ్రత్తగా ఉండాలి!

Published : Mar 26, 2026, 05:00 AM IST

Today Rasi Phalalu: ఈ రాశి ఫలాలు 26.03.2026 గురువారానికి సంబంధించినవి. మేష, వృషభ, మిథున, కర్కాటక, సింహ, కన్య, తుల, వృశ్ఛిక, ధనుస్సు, మకర, కుంభ, మీన రాశుల దిన ఫలాలు ఇక్కడ తెలుసుకోండి. 

PREV
113
నేటి రాశి ఫలాలు

ఈ రోజు రాశి ఫలాలు పంచాంగకర్త ఫణికుమార్ అందిస్తున్నారు. నేడు ఏ రాశి వారికి ఎలా ఉందో ఇక్కడ వివరంగా తెలుసుకుందాం.

213
మేష రాశి ఫలాలు

స్థిరాస్తి ఒప్పందాల గురించి పునరాలోచన చేయడం మంచిది. సన్నిహితులతో కీలక విషయాలను చర్చిస్తారు. వృత్తి, ఉద్యోగాలలో వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. కుటుంబ సభ్యులతో చిన్నపాటి మనస్పర్థలు ఉంటాయి. వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. ఆర్థిక పరిస్థితి గందరగోళంగా ఉంటుంది.

313
వృషభ రాశి ఫలాలు

అనుకున్న పనులు వేగంగా పూర్తి చేస్తారు. సోదరులతో వివాదాలను తెలివిగా పరిష్కరించుకుంటారు. వృత్తి, ఉద్యోగాలలో నూతన ప్రోత్సాహకాలు అందుకుంటారు. దూర ప్రయాణాలలో జాగ్రత్తగా వ్యవహరించాలి. వ్యాపార ప్రారంభానికి అవరోధాలు తొలగుతాయి. ఆర్థిక లావాదేవీలు ఆశాజనకంగా సాగుతాయి.

413
మిథున రాశి ఫలాలు

వృత్తి, వ్యాపారాలలో తీసుకున్న నిర్ణయాలు భవిష్యత్తుకు ఉపయోగపడే విధంగా ఉంటాయి. విలువైన పత్రాల విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలి. చేపట్టిన పనుల్లో శ్రమ పెరుగుతుంది. నిరుద్యోగుల ప్రయత్నాలు ఫలిస్తాయి.

513
కర్కాటక రాశి ఫలాలు

చిన్ననాటి మిత్రులతో విలువైన సమయాన్ని గడుపుతారు. కుటుంబ పెద్దలతో చిన్నపాటి వివాదాలు ఉంటాయి. చేపట్టిన పనులలో నూతన ప్రణాళికలు అమలుచేసి సకాలంలో పూర్తిచేస్తారు. వ్యాపారాలలో స్వల్ప లాభాలు అందుకుంటారు.

613
సింహ రాశి ఫలాలు

వృత్తి, ఉద్యోగాల్లో అధికారులతో మాట పట్టింపులు ఉంటాయి. చేపట్టిన పనులు అనుకున్న సమయానికి పూర్తిచేస్తారు. భూ సంబంధిత వ్యాపారులకు కొంత అనుకూల వాతావరణం ఉంటుంది. ఇంట్లో కొందరి ప్రవర్తన ఇబ్బంది కలిగిస్తుంది. దైవ సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు.

713
కన్య రాశి ఫలాలు

నూతన వ్యాపారాలు ప్రారంభించి ఆశించిన లాభాలు అందుకుంటారు. అన్ని రంగాల వారికి అనుకూల ఫలితాలు ఉంటాయి. కుటుంబ వాతావరణం అనుకూలిస్తుంది. వృత్తి, ఉద్యోగాల్లో శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది. దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. చేపట్టిన పనులు సకాలంలో పూర్తిచేస్తారు.

813
తుల రాశి ఫలాలు

స్థిరాస్తి కొనుగోలుకు అవరోధాలు తొలగుతాయి. వృథా ఖర్చులు పెరుగుతాయి. నూతన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు. కుటుంబంలో మీ ఆలోచనలు ఎవ్వరికీ నచ్చవు. ఉద్యోగులకు అదనపు బాధ్యతలుంటాయి. వ్యాపారాలలో సొంత ఆలోచనలు అమలుచేయడం మంచిది.

913
వృశ్చిక రాశి ఫలాలు

శత్రువులపై విజయం సాధిస్తారు. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. సన్నిహితుల నుంచి ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి. కొన్ని వ్యవహారాలలో జీవిత భాగస్వామి సలహాలు తీసుకుని ముందుకు సాగడం మంచిది. బంధువులతో స్వల్ప వివాదాలుంటాయి. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి.

1013
ధనుస్సు రాశి ఫలాలు

బంధుమిత్రుల నుంచి శుభకార్యాలకు ఆహ్వానాలు అందుతాయి. వృత్తి, ఉద్యోగాల పరంగా సానుకూల ఫలితాలుంటాయి. రావాల్సిన సొమ్ము సకాలంలో చేతికి అందుతుంది. ఇంటి వాతావరణం గందరగోళంగా ఉంటుంది. వ్యాపారాలలో అవరోధాలు అధిగమించి ముందుకు సాగుతారు.

1113
మకర రాశి ఫలాలు

ఆదాయానికి మించి ఖర్చులు పెరుగుతాయి. కుటుంబ సభ్యులతో విందు, వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఉద్యోగాలలో అధికారుల నుంచి ప్రశంసలు అందుకుంటారు. నిరుద్యోగులకు చాలాకాలంగా ఎదురుచూస్తున్న అవకాశాలు అందుతాయి. దైవ సేవా కార్యక్రమాలకు డబ్బు సహాయం చేస్తారు.

1213
కుంభ రాశి ఫలాలు

నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. చేపట్టిన పనులను ప్రణాళిక బద్ధంగా పూర్తి చేస్తారు. అన్ని రంగాల వారికి అనుకూల వాతావరణం ఉంటుంది. సన్నిహితుల నుంచి అందిన ఒక వార్త ఉత్సాహం కలిగిస్తుంది. వ్యాపార వ్యవహారాలు అనుకూలంగా సాగుతాయి. ఉద్యోగులు ఉన్నత పదవులు పొందుతారు.

1313
మీన రాశి ఫలాలు

దీర్ఘకాలిక రుణ భారం అధికమవుతుంది. బంధు మిత్రులతో మాటపట్టింపులు ఉంటాయి. కుటుంబ వ్యవహారాలలో కీలక నిర్ణయాలు తీసుకుంటారు. చేపట్టిన పనులలో శ్రమ మరింత పెరుగుతుంది. ఉద్యోగాలలో అధికారులతో చర్చలు అనుకూలించవు. వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి.

Read more Photos on
click me!

Recommended Stories