
ఈ రోజు రాశి ఫలాలు పంచాంగకర్త ఫణికుమార్ అందిస్తున్నారు. నేడు ఏ రాశి వారికి ఎలా ఉందో ఇక్కడ వివరంగా తెలుసుకుందాం.
స్థిరాస్తి ఒప్పందాలలో పునరాలోచన చేయడం మంచిది. వృత్తి, ఉద్యోగాలలో వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. చేపట్టిన వ్యవహారాలు కొంత మందకొడిగా సాగుతాయి. వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. ఆర్థిక పరిస్థితి గందరగోళంగా ఉంటుంది. కుటుంబ సభ్యులతో చిన్నపాటి వివాదాలు ఉంటాయి.
నూతన వ్యాపార ప్రారంభానికి అవరోధాలు తొలగుతాయి. వృత్తి, ఉద్యోగాలలో నూతన ప్రోత్సాహకాలు అందుతాయి. దూర ప్రయాణాలలో జాగ్రత్తగా వ్యవహరించాలి. ఆర్థిక లావాదేవీలు ఆశాజనకంగా సాగుతాయి. అనుకున్న పనులు అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు. సోదరులతో వివాదాలను తెలివిగా పరిష్కరించుకుంటారు.
ఇంట్లో విందు వినోదాది కార్యక్రమాలు నిర్వహిస్తారు. చేపట్టిన పనుల్లో శ్రమ పెరుగుతుంది. వృత్తి, వ్యాపారాలలో తీసుకున్న నిర్ణయాలు భవిష్యత్తుకు ఉపయోగపడే విధంగా ఉంటాయి. నిరుద్యోగ ప్రయత్నాలలో విజయం సాధిస్తారు. ఉద్యోగాల్లో అనుకూల వాతావరణం ఉంటుంది.
చిన్ననాటి మిత్రులతో విలువైన సమయాన్ని గడుపుతారు. చేపట్టిన పనులలో నూతన ప్రణాళికలు అమలుచేసి సకాలంలో పూర్తిచేస్తారు. వృత్తి, ఉద్యోగాల్లో అధికారులతో మాట పట్టింపులు ఉంటాయి. వ్యాపారాలలో స్వల్ప లాభాలను అందుకుంటారు. కుటుంబ పెద్దలతో చిన్నపాటి మాటపట్టింపులుంటాయి.
భూ సంబంధిత వ్యవహారాల్లో ఆశించిన లాభాలు అందుతాయి. కుటుంబ సభ్యులతో దైవ సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. చిన్ననాటి మిత్రులతో విలువైన సమయాన్ని గడుపుతారు. వృత్తి, ఉద్యోగాల్లో అధికారులతో మాట పట్టింపులు ఉంటాయి. ఇంట్లో కొందరి ప్రవర్తన చికాకు కలిగిస్తుంది.
దైవ సేవా కార్యాక్రమాలలో పాల్గొంటారు. కుటుంబ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. నూతన వ్యాపారాలు ప్రారంభించి ఆశించిన లాభాలు అందుకుంటారు. వృత్తి, ఉద్యోగాల్లో శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. అన్ని రంగాల వారికి అనుకూల ఫలితాలు ఉంటాయి.
నూతన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు. మీ ఆలోచనలు కుటుంబ సభ్యులకు నచ్చేవిధంగా ఉండవు. వాహన సంబంధ సమస్యలు వస్తాయి. స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాల్లో అవరోధాలు తొలగుతాయి. వ్యాపారాలలో సొంత ఆలోచనలు కలిసివస్తాయి. ఉద్యోగులకు అదనపు బాధ్యతలుంటాయి.
శత్రు సమస్యలు తొలగుతాయి. ఆదాయ మార్గాలు సంతృప్తికరంగా సాగుతాయి. సన్నిహితుల నుంచి ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి. బంధువులతో దైవ కార్యక్రమాలలో పాల్గొంటారు. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. కొన్ని వ్యవహారాలలో జీవిత భాగస్వామి సలహాలు తీసుకుని ముందుకు సాగడం మంచిది.
ఇంట్లో కొన్ని సంఘటనలు ఆశ్చర్యం కలిగిస్తాయి. రావాల్సిన సొమ్ము సకాలంలో చేతికి అంది అవసరాలు తీరుతాయి. వ్యాపార ప్రారంభానికి అవరోధాలు అధిగమించి ముందుకు సాగుతారు. బంధు మిత్రుల నుంచి శుభకార్యాలకు ఆహ్వానాలు అందుతాయి. వృత్తి, ఉద్యోగాలలో సానుకూల ఫలితాలుంటాయి.
నిరుద్యోగులకు చాలా కాలంగా వేచి చూస్తున్న అవకాశాలు అందుతాయి. ఉద్యోగాలలో మంచి పనితీరుతో అధికారులను ఆకట్టుకుంటారు. సేవా కార్యక్రమాలకు డబ్బు సహాయం చేస్తారు ఆదాయానికి మించి ఖర్చులు పెరుగుతాయి. కుటుంబ సభ్యులతో విందు, వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు.
సన్నిహితుల నుంచి అందిన ఒక వార్త ఉత్సాహం కలిగిస్తుంది. అన్ని రంగాల వారికి అనుకూల పరిస్థితులుంటాయి. వ్యాపార వ్యవహారాలు అనుకూలంగా సాగుతాయి. ఉద్యోగాలలో పదోన్నతులు పెరుగుతాయి. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. చేపట్టిన పనులను ప్రణాళిక బద్ధంగా పూర్తి చేస్తారు.
కుటుంబ వ్యవహారాలలో కీలక నిర్ణయాలు అమలుచేస్తారు. చేపట్టిన పనులలో శ్రమ మరింత పెరుగుతుంది. ఉద్యోగాలలో అధికారులతో చర్చలు ఫలించవు. వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. దీర్ఘకాలిక రుణ భారం అధికమవుతుంది. బంధు మిత్రులతో చిన్నపాటి వివాదాలు ఉంటాయి.