Today Rasi Phalalu: నేడు ఈ 4 రాశులవారికి ఊహించని లాభాలు.. అనుకూల ఫలితాలు!

Published : Aug 26, 2026, 05:00 AM IST

Today Rasi Phalalu: ఈ రాశి ఫలాలు 26.08.2026 బుధవారానికి సంబంధించినవి. మేష, వృషభ, మిథున, కర్కాటక, సింహ, కన్య, తుల, వృశ్ఛిక, ధనుస్సు, మకర, కుంభ, మీన రాశుల దిన ఫలాలు ఇక్కడ తెలుసుకోండి.

PREV
113
నేటి రాశి ఫలాలు

ఈ రోజు రాశి ఫలాలు పంచాంగకర్త ఫణికుమార్ అందిస్తున్నారు. నేడు ఏ రాశి వారికి ఎలా ఉందో ఇక్కడ వివరంగా తెలుసుకుందాం.

213
మేష రాశి ఫలాలు

బంధువుల నుంచి రుణ ఒత్తిడి పెరుగుతుంది. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. ఆదాయానికి మించి ఖర్చులుంటాయి. వ్యాపారాలలో చిన్నపాటి సమస్యలు తప్పవు. ఉద్యోగాలలో ఆకస్మిక మార్పులుంటాయి. స్థిరాస్తుల క్రయ విక్రయాలలో ఆటంకాలు కలుగుతాయి.

313
వృషభ రాశి ఫలాలు

వ్యాపారాలలో లాభాలు అందుకుంటారు. సన్నిహితుల నుంచి కీలక సమాచారం అందుతుంది. నూతన ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. ఉద్యోగాలలో అవాంతరాలు తొలగుతాయి. చేపట్టిన కార్యక్రమాలు సజావుగా సాగుతాయి. ఇంటా బయటా అనుకూల వాతావరణం ఉంటుంది.

413
మిథున రాశి ఫలాలు

కుటుంబ వ్యవహారాలలో ఆలోచనలు నిలకడగా ఉండవు. సోదరులతో ఆస్తి వివాదాలు చికాకు పరుస్తాయి. రుణ ఒత్తిడులు పెరుగుతాయి. ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నాయి. వ్యాపార, ఉద్యోగాలు సామాన్యంగా సాగుతాయి. చేపట్టిన పనులు నిదానిస్తాయి.

513
కర్కాటక రాశి ఫలాలు

పనులు సకాలంలో పూర్తి చేస్తారు. మీ ఆలోచనలు అందరికి నచ్చుతాయి. భూ క్రయ విక్రయాలు లాభిస్తాయి. వృత్తి వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. ఉద్యోగ ప్రయత్నాలు ఆశాజనకంగా ఉంటాయి. పాత సంఘటనలు జ్ఞప్తికి వస్తాయి.

613
సింహ రాశి ఫలాలు

నూతనోత్సాహంతో కొన్ని వ్యవహారాలలో విజయం సాధిస్తారు. కీలక సమయంలో ఆప్తుల సలహాలు కలిసివస్తాయి. దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలు మరింత లాభిస్తాయి. ఉద్యోగాలలో పదోన్నతులు పెరుగుతాయి. నిరుద్యోగుల నిరీక్షణ ఫలిస్తుంది.

713
కన్య రాశి ఫలాలు

ఆర్థిక ఇబ్బందుల వల్ల నూతన రుణాలు చేస్తారు. వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. ఇంటా బయట పరిస్థితులు అనుకూలించవు. ప్రయాణాలు వాయిదా పడతాయి. చేపట్టిన పనులలో శ్రమ అధికమవుతుంది. బంధువులతో అకారణంగా విభేదాలు తప్పవు.

813
తుల రాశి ఫలాలు

ఆర్థిక లావాదేవీలు కొంత నిరుత్సాహపరుస్తాయి. చేపట్టిన వ్యవహారాలలో ఆటంకాలు తప్పవు. దూర ప్రయాణాలలో వాహన ఇబ్బందులుంటాయి. వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు పెరుగుతాయి. ఆలయ దర్శనాలు చేసుకుంటారు.

913
వృశ్చిక రాశి ఫలాలు

వ్యాపారాలు లాభాల బాటలో సాగుతాయి. బంధు మిత్రులతో సఖ్యతగా వ్యవహరిస్తారు. పనులలో చికాకులు పెరుగుతాయి. ఉద్యోగాలలో మీ హోదా పెరుగుతుంది. దీర్ఘకాలిక రుణ బాధలు తొలగుతాయి. దూర ప్రయాణాలు వాయిదా పడతాయి.

1013
ధనుస్సు రాశి ఫలాలు

ఆత్మీయుల నుంచి కీలక సమాచారం అందుతుంది. చేపట్టిన వ్యవహారాలు సాఫీగా పూర్తి చేస్తారు. వ్యాపార విస్తరణకు అవరోదాలు తొలగుతాయి. ఉద్యోగాలలో అనుకూల వాతావరణం ఉంటుంది. స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆకస్మిక ధనప్రాప్తి కలుగుతుంది.

1113
మకర రాశి ఫలాలు

దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. చేపట్టిన పనుల్లో అవాంతరాలు కలుగుతాయి. నూతన రుణాలు చేస్తారు. వ్యాపార, ఉద్యోగాలలో కొత్త సమస్యలు తప్పవు. ఆత్మీయులతో కొన్ని విషయాలలో విభేదాలు కలుగుతాయి. ప్రయాణాలలో ఊహించని మార్పులు ఉంటాయి.

1213
కుంభ రాశి ఫలాలు

ఉద్యోగాలలో మార్పులుంటాయి. ఆర్థిక పరిస్థితి నిరుత్సాహపరుస్తుంది. స్వల్ప అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. వ్యాపారాలలో నూతన సమస్యలు కలుగుతాయి. నూతన రుణాలు చేస్తారు. దూరపు బంధువుల నుంచి ముఖ్యమైన సమాచారం అందుతుంది.

1313
మీన రాశి ఫలాలు

ఆర్థిక పరిస్థితి సంతృప్తికరంగా ఉంటుంది. స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. వ్యాపారాలు మరింత విస్తరిస్తారు. ఉద్యోగాలలో ఆశించిన పురోగతి కలుగుతుంది. కీలక వ్యవహారాలు విజయవంతంగా సాగుతాయి. ఆప్తుల నుంచి ఊహించని ఆహ్వానాలు అందుతాయి.

Read more Photos on
click me!

Recommended Stories