Raksha Bandhan 2026: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఈ ఏడాది రాఖీ పండగ నాడు మూడు అరుదైన, శుభప్రదమైన యోగాలు ఏర్పడన్నాయి. ఈ యోగాల వల్ల 5 రాశులవారికి వ్యక్తిగత, వృత్తి జీవితాల్లో అద్భుతమైన మార్పులు రానున్నాయి. మరి ఆ అదృష్ట రాశులేవో తెలుసుకోండి.
ఈ ఏడాది ఆగస్టు 28న రాఖీ పండగ రానుంది. ఆ రోజున హంస మహాపురుష రాజయోగం, బుధాదిత్య రాజయోగం, సమసప్తక రాజయోగాలు ఏర్పడనున్నాయి. దేవగురువైన బృహస్పతి తన ఉచ్ఛ రాశి అయిన కర్కాటకంలో సంచరిస్తున్నాడు. గురుడు తన ఉచ్ఛ రాశిలో కేంద్ర గృహంలో ఉన్నప్పుడు హంస పంచమహాపురుష రాజయోగం ఏర్పడుతుంది. దీనికి తోడు, సింహరాశిలో బుధ-సూర్య కలయికతో బుధాదిత్య రాజయోగం ఏర్పడనుంది. ఈ జ్యోతిష్య పరిణామాల వల్ల ఐదు రాశుల వారికి అద్భుతమైన ఫలితాలు ఉన్నాయి. ఆ రాశులేవో చూద్దాం.
26
కర్కాటక రాశి
కర్కాటక రాశి వారికి రక్షా బంధన్ బలమైన వృద్ధి దశను తీసుకు వస్తుంది. బృహస్పతి మీ రాశిలో ఉచ్ఛస్థితిలో ఉంటాడు. ఇది ఆత్మవిశ్వాసాన్ని పెంచి, కీలక నిర్ణయాలు తీసుకోవడంలో స్పష్టతను ఇస్తుంది. ఉద్యోగంలో కొత్త బాధ్యతలు పొందవచ్చు. వ్యాపారంలో నిలిచిపోయిన చెల్లింపులు అందే సూచనలు ఉన్నాయి. ఆర్థిక ప్రవాహం పెరిగినా, ఖర్చుల విషయంలో తెలివిగా వ్యవహరించాలి. సమాజంలో మీ పలుకుబడి పెరుగుతుంది. తోబుట్టువులతో బంధం బలపడుతుంది. ప్రేమ సంబంధాల్లో అపార్థాలు తొలగిపోవచ్చు. విద్యార్థులు చదువుపై దృష్టి పెట్టి మంచి ఫలితాలు సాధిస్తారు.
36
వృశ్చిక రాశి
వృశ్చిక రాశి వారికి, ఇది అవకాశాలను అందిపుచ్చుకునే సమయం. బృహస్పతి స్థానం మీ సృజనాత్మకతకు, కొత్త ప్రాజెక్టులకు మద్ధతు ఇస్తుంది. మీ కెరీర్‌కి ఉపయోగపడే కొత్త వ్యక్తుల పరిచయాలు ఏర్పడతాయి. ఉద్యోగంలో మీ వ్యూహం అందరినీ ఆకట్టుకుంటుంది. వ్యాపారులు కొత్త కస్టమర్లు లేదా భాగస్వామ్య ప్రతిపాదనలు పొందవచ్చు. నిలిచిపోయిన డబ్బు క్రమంగా తిరిగి వచ్చే అవకాశం ఉంది. కుటుంబ పెద్దల సలహాలు కలిసివస్తాయి. ప్రేమ సంబంధాలలో నమ్మకం పెరుగుతుంది.
సింహ రాశి వారికి, ఈ సమయం ఆత్మవిశ్వాసం, గుర్తింపుతో ముడిపడి ఉంటుంది. మీ రాశిలో సూర్య, బుధుల ప్రభావం కమ్యూనికేషన్‌ను బలపరుస్తుంది. ఉద్యోగంలో నాయకత్వం ప్రదర్శించే అవకాశం లభించవచ్చు. వ్యాపారంలో బ్రాండింగ్, మార్కెటింగ్ ప్రయోజనకరంగా ఉంటాయి. పాత పరిచయాలు వ్యాపార అవకాశంగా మారవచ్చు. ఆదాయాన్ని పెంచుకోవడానికి కొత్త మార్గాలు కనిపిస్తాయి. ప్రేమ బంధంలో, మీ మాటలు భాగస్వామిపై బలమైన ప్రభావాన్ని చూపుతాయి.
56
వృషభ రాశి
వృషభ రాశి వారికి, ఈ సమయం లాభాలను తెచ్చిపెడుతుంది. శుక్రుని స్థానం మీ సృజనాత్మకతను, వ్యక్తిగత ఆకర్షణను పెంచుతుంది. ఉద్యోగంలో మీ ప్రత్యేక నైపుణ్యాలను ప్రదర్శించే అవకాశం దొరుకుతుంది. మీ కష్టానికి గుర్తింపు లభించే అవకాశం ఉంది. వ్యాపారానికి పాత కస్టమర్ల నుంచి మళ్లీ మంచి ఆర్డర్స్ రావచ్చు. డబ్బు సంపాదించే అవకాశం పెరుగుతుంది. కుటుంబంలో శుభకార్యానికి సన్నాహాలు చేస్తారు. జీవిత భాగస్వామి మద్ధతు లభిస్తుంది.
66
మేష రాశి
మేష రాశి వారికి, ఈ సమయం ఆత్మవిశ్వాసంతో కూడిన ముందడుగును సూచిస్తుంది. ఒక కొత్త ప్రాజెక్ట్ మీకు మంచి గుర్తింపును తెచ్చిపెడుతుంది. వ్యాపారంలో మార్కెటింగ్, కమ్యూనికేషన్, నెట్‌వర్కింగ్ ప్రయోజనకరంగా ఉంటాయి. ఒక ప్రభావవంతమైన వ్యక్తిని కలవడం దీర్ఘకాలంలో ఉపయోగకరంగా ఉంటుంది. ప్రేమ బంధంలో, చర్చల ద్వారా సమస్యలు పరిష్కారమవుతాయి. సోదరుల నుంచి మద్ధతు లభిస్తుంది.