Today Rasi Phalalu: నేడు ఓ రాశివారు జాగ్రత్త.. ప్రయాణాల్లో ప్రమాద సూచనలు!

Published : Sep 25, 2026, 05:00 AM IST

Today Rasi Phalalu: ఈ రాశి ఫలాలు 25.09.2026 శుక్రవారానికి సంబంధించినవి. మేష, వృషభ, మిథున, కర్కాటక, సింహ, కన్య, తుల, వృశ్ఛిక, ధనుస్సు, మకర, కుంభ, మీన రాశుల దిన ఫలాలు ఇక్కడ తెలుసుకోండి.

PREV
113
నేటి రాశి ఫలాలు

ఈ రోజు రాశి ఫలాలు పంచాంగకర్త ఫణికుమార్ అందిస్తున్నారు. నేడు ఏ రాశి వారికి ఎలా ఉందో ఇక్కడ వివరంగా తెలుసుకుందాం.

213
మేష రాశి ఫలాలు

మిత్రులతో చిన్నపాటి వివాదాలు ఉంటాయి. ముఖ్యమైన కార్యక్రమాలు వాయిదా పడతాయి. ప్రయాణాలలో అవరోధాలు కలుగుతాయి. వ్యాపార, ఉద్యోగాలలో ఒత్తిడులు తప్పవు. సంతాన ఆరోగ్య సమస్యలు బాధిస్తాయి. ఆదాయానికి మించి ఖర్చులు ఉంటాయి.

313
వృషభ రాశి ఫలాలు

చేపట్టిన పనులు శ్రమతో కానీ పూర్తి కావు. దూర ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. ప్రత్యర్థుల నుంచి ఊహించని సమస్యలు కలుగుతాయి. వ్యాపార, ఉద్యోగాలు సాదాసీదాగా సాగుతాయి. ముఖ్యమైన వ్యవహారాలలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం మంచిది కాదు.

413
మిథున రాశి ఫలాలు

వృత్తి, వ్యాపారాలు ఉత్సాహవంతంగా సాగుతాయి. దూర ప్రాంతాల నుంచి శుభవార్తలు అందుతాయి. ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. కుటుంబ వ్యవహారాలలో కీలక నిర్ణయాలు అమలు చేస్తారు. చేపట్టిన పనులు సజావుగా పూర్తి చేస్తారు.

513
కర్కాటక రాశి ఫలాలు

వ్యాపార, ఉద్యోగాల్లో ఊహించని మార్పులు ఉంటాయి. చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. నిరుద్యోగుల ప్రయత్నాలు మందకొడిగా సాగుతాయి. రుణదాతల నుంచి ఒత్తిడి అధికమవుతుంది.

613
సింహ రాశి ఫలాలు

చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. ఇంటా బయటా పరిస్థితులు అనుకూలిస్తాయి. వ్యాపారాలు మరింత పుంజుకుంటాయి. ఉద్యోగాలలో సమస్యలు పరిష్కారమవుతాయి. సమాజంలో ప్రముఖులతో పరిచయాలు ఉత్సాహాన్నిస్తాయి. వాహన కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి.

713
కన్య రాశి ఫలాలు

కొన్ని పనులు వాయిదా పడతాయి. కుటుంబ సభ్యులతో అకారణంగా వివాదాలు కలుగుతాయి. ఉద్యోగాలలో బాధ్యతలు పెరుగుతాయి. దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. వృత్తి, వ్యాపారాలలో శ్రమకు తగిన ఫలితం దక్కదు. స్థిరాస్తి వివాదాలు ఉంటాయి.

813
తుల రాశి ఫలాలు

వ్యాపారాలు మరింత లాభసాటిగా సాగుతాయి. వృత్తి, ఉద్యోగాలలో మీ ప్రతిభాపాటవాలు వెలుగులోకి వస్తాయి. రాజకీయ సంబంధిత సమావేశాలకు ఆహ్వానాలు అందుతాయి. మొండి బాకీలు వసూలవుతాయి.

913
వృశ్చిక రాశి ఫలాలు

నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. వృత్తి, వ్యాపారాలు మరింత లాభసాటిగా సాగుతాయి. విలువైన వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. చిన్ననాటి మిత్రులను కలుసుకుని కష్ట సుఖాలను పంచుకుంటారు. ఉద్యోగాల్లో పదోన్నతులు పెరుగుతాయి.

1013
ధనుస్సు రాశి ఫలాలు

సోదరులతో స్వల్ప వివాదాలు ఉంటాయి. కుటుంబ వాతావరణం గందరగోళంగా ఉంటుంది. వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి. ఉద్యోగులకు అదనపు పనిభారం ఉంటుంది. ప్రయాణాలలో ప్రమాద సూచనలు ఉన్నాయి. కొన్ని వ్యవహారాలు శ్రమతో కానీ పూర్తి కావు.

1113
మకర రాశి ఫలాలు

ఉద్యోగులకు పని ఒత్తిడి పెరుగుతుంది. ఆదాయానికి మించి ఖర్చులు పెరుగుతాయి. ఇతరుల వ్యవహారాలలో జోక్యం చేసుకోవడం మంచిదికాదు. ఆరోగ్యం విషయంలో జాగ్రత్త అవసరం. పనుల్లో ఆటంకాలు తప్పవు. భాగస్వామ్య వ్యాపారాలు నత్తనడకన సాగుతాయి.

1213
కుంభ రాశి ఫలాలు

నిరుద్యోగులకు ఇంటర్వ్యూ అవకాశాలు లభిస్తాయి. ముఖ్యమైన కార్యక్రమాల్లో విజయం సాధిస్తారు. వృత్తి, వ్యాపారాలు సాఫీగా సాగుతాయి. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. అవసరానికి సన్నిహితుల సహాయం పొందుతారు. జీవిత భాగస్వామితో విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు.

1313
మీన రాశి ఫలాలు

దూరపు బంధువుల నుంచి శుభవార్తలు అందుతాయి. నిరుద్యోగులకు అధికారుల అనుగ్రహం కలుగుతుంది. ఉద్యోగ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. విందు వినోదాది కార్యక్రమాలకు డబ్బు ఖర్చు చేస్తారు. వ్యాపార విస్తరణకు కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు అందుతాయి.

Read more Photos on
click me!

Recommended Stories