Today Rasi Phalalu: నేడు ఓ రాశివారికి ఆకస్మిక ధన లాభం.. పెండింగ్ పనులు పూర్తి!

Published : Sep 24, 2026, 05:00 AM IST

Today Rasi Phalalu: ఈ రాశి ఫలాలు 24.09.2026 గురువారానికి సంబంధించినవి. మేష, వృషభ, మిథున, కర్కాటక, సింహ, కన్య, తుల, వృశ్ఛిక, ధనుస్సు, మకర, కుంభ, మీన రాశుల దిన ఫలాలు ఇక్కడ తెలుసుకోండి.

PREV
113
నేటి రాశి ఫలాలు

ఈ రోజు రాశి ఫలాలు పంచాంగకర్త ఫణికుమార్ అందిస్తున్నారు. నేడు ఏ రాశి వారికి ఎలా ఉందో ఇక్కడ వివరంగా తెలుసుకుందాం.

213
మేష రాశి ఫలాలు

దైవ కార్యక్రమాలలో పాల్గొంటారు. ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నాయి. సంతాన ఉద్యోగ ప్రయత్నాలు మందకొడిగా సాగుతాయి. స్వల్ప అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. చేపట్టిన పనులలో ఆటంకాలు ఉంటాయి. ఆర్థిక ఇబ్బందుల వల్ల అప్పులు చేస్తారు.

313
వృషభ రాశి ఫలాలు

వృత్తి, వ్యాపారాలు స్వల్పంగా లాభిస్తాయి. మానసిక ఆందోళన పెరుగుతుంది. స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు వాయిదా వేస్తారు. ఆరోగ్యం విషయంలో జాగ్రత్త అవసరం. చేపట్టిన పనుల్లో జాప్యం తప్పదు. వివాదాలకు దూరంగా ఉండటం మంచిది.

413
మిథున రాశి ఫలాలు

ఇతరుల వ్యవహారాలలో జోక్యం చేసుకోవడం మంచిది కాదు. సంఘంలో గౌరవం పెరుగుతుంది. సోదరుల సహాయ సహకారాలతో కొన్ని పనులు పూర్తి చేస్తారు. వృత్తి, ఉద్యోగాలలో మీ ప్రతిభ వెలుగులోకి వస్తుంది. నూతన వస్తు, ఆభరణాలను కొనుగోలు చేస్తారు.

513
కర్కాటక రాశి ఫలాలు

అవసరానికి చేతిలో డబ్బు ఉండదు. కోపాన్ని అదుపులో ఉంచుకోవడం మంచిది. కుటుంబ సభ్యులతో దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. కొందరి ప్రవర్తన వల్ల మానసిక ఆందోళన కలుగుతుంది. అనారోగ్య సమస్యలు బాధిస్తాయి.

613
సింహ రాశి ఫలాలు

మానసికంగా మరింత ఉత్సాహంగా ఉంటారు. ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నప్పటికీ అవసరానికి డబ్బు సహాయం లభిస్తుంది. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. సంతాన వివాహ విషయం గురించి ప్రస్తావన వస్తుంది. వృత్తి, ఉద్యోగాలలో నూతన అవకాశాలు లభిస్తాయి.

713
కన్య రాశి ఫలాలు

మీ ఆలోచనలు ఇతరులకు నచ్చే విధంగా ఉండవు. నిరుద్యోగుల ప్రయత్నాలు నిరుత్సాహపరుస్తాయి. ఆదాయానికి మించి ఖర్చులు పెరుగుతాయి. దైవ కార్యక్రమాలపై దృష్టి సారిస్తారు. నూతన రుణ ప్రయత్నాలు కలసిరావు. కుటుంబ సభ్యులతో మాటపట్టింపులు ఉంటాయి.

813
తుల రాశి ఫలాలు

ఇతరులకు సైతం సహాయ సహకారాలు అందిస్తారు. కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా ఉంటాయి. దూర ప్రాంత బంధుమిత్రుల రాక ఆనందం కలిగిస్తుంది. ఆకస్మిక ధన లాభ సూచనలు ఉన్నాయి. దీర్ఘకాలిక రుణాలు తీర్చగలుగుతారు. వృత్తి, వ్యాపారాల్లో ఆశించిన లాభాలు అందుకుంటారు.

913
వృశ్చిక రాశి ఫలాలు

వృత్తి వ్యాపారాలలో విశేష లాభాలు పొందుతారు. బంధు, మిత్రుల సహాయ సహకారాలు లభిస్తాయి. ఒక వ్యవహారానికి సంబంధించి సమాచారం సేకరిస్తారు. నూతన వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. ప్రయాణాలలో నూతన పరిచయాలు కలుగుతాయి. ఆర్థిక ఇబ్బందులు అధిగమించి ముందుకు సాగుతారు.

1013
ధనుస్సు రాశి ఫలాలు

ఇంటా బయటా విలువ మరింత పెరుగుతుంది. సమాజంలో పేరు కలిగిన వ్యక్తుల నుంచి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. కొన్ని విషయాలలో ధైర్యంగా నిర్ణయాలు తీసుకుని ముందుకు సాగుతారు. వృత్తి, ఉద్యోగాలు అనుకూలిస్తాయి. కుటుంబ సభ్యులతో శుభకార్యాలలో పాల్గొంటారు. దైవానుగ్రహంతో కొన్ని పనులు పూర్తవుతాయి.

1113
మకర రాశి ఫలాలు

బంధు మిత్రుల నుంచి శుభకార్యాలకు ఆహ్వానాలు అందుతాయి. ఆకస్మిక ధన లాభ సూచనలు ఉన్నాయి. అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం కలుగుతుంది. కుటుంబ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. ఎప్పటి నుంచో పెండింగ్ లో ఉన్న పనులు పూర్తి చేస్తారు.

1213
కుంభ రాశి ఫలాలు

ఆర్థిక పరిస్థితి నిరుత్సాహపరుస్తుంది. వృత్తి, ఉద్యోగాలలో పని ఒత్తిడి పెరుగుతుంది. ఇతరుల వ్యవహారాలలో జోక్యం చేసుకోవడం మంచిది కాదు. సోదరులతో వివాదాలకు దూరంగా ఉండాలి. స్వల్ప అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. ప్రయాణాల్లో శ్రమ తప్పదు.

1313
మీన రాశి ఫలాలు

సమాజంలో పేరు, ప్రతిష్ఠలు పెరుగుతాయి. రుణ బాధల నుంచి ఉపశమనం పొందుతారు. జీవిత భాగస్వామితో పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. నిరుద్యోగుల ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆరోగ్యం మెరుగవుతుంది. ఇతరులకు సహాయ సహకారాలు అందిస్తారు. ధన లాభ సూచనలు ఉన్నాయి.

Read more Photos on
click me!

Recommended Stories