Today Rasi Phalalu: నేడు ఈ 2 రాశులవారికి ఊహించని సమస్యలు ఎదురవుతాయి.. జాగ్రత్త!

Published : Nov 23, 2026, 05:00 AM IST

Today Rasi Phalalu: ఈ రాశి ఫలాలు 23.11.2026 సోమవారానికి సంబంధించినవి. మేష, వృషభ, మిథున, కర్కాటక, సింహ, కన్య, తుల, వృశ్ఛిక, ధనుస్సు, మకర, కుంభ, మీన రాశుల దిన ఫలాలు ఇక్కడ తెలుసుకోండి.

PREV
113
నేటి రాశి ఫలాలు

ఈ రోజు రాశి ఫలాలు పంచాంగకర్త ఫణికుమార్ అందిస్తున్నారు. నేడు ఏ రాశి వారికి ఎలా ఉందో ఇక్కడ వివరంగా తెలుసుకుందాం.

213
మేష రాశి ఫలాలు

వ్యాపారులకు నూతన అవకాశాలు లభిస్తాయి. నిరుద్యోగుల ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆప్తుల నుంచి ఆశించిన సహాయం అందుతుంది. ఉద్యోగాలలో పదోన్నతులు పెరుగుతాయి. అన్ని రంగాల వారికి అనుకూల వాతావరణం ఉంటుంది. చేపట్టిన పనులలో శ్రమకు తగిన ఫలితం పొందుతారు.

313
వృషభ రాశి ఫలాలు

నూతన కార్యక్రమాలను ప్రారంభించి సకాలంలో పూర్తి చేస్తారు. కుటుంబ సభ్యులతో ఆలయ సందర్శనాలు చేసుకుంటారు. వృత్తి, ఉద్యోగాలలో కీలక సమాచారం అందుతుంది. నూతన వ్యాపార ప్రారంభానికి పెట్టుబడులు అందుతాయి. దీర్ఘకాలిక రుణ సమస్యలు పరిష్కరించుకుంటారు.

413
మిథున రాశి ఫలాలు

ఉద్యోగులకు ట్రాన్స్ ఫర్లు తప్పవు. ఆకస్మికంగా ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. వృథా ఖర్చులు పెరుగుతాయి. చేపట్టిన పనుల్లో స్వల్ప అవాంతరాలు ఉంటాయి. వృత్తి, వ్యాపారాలలో గందరగోళ పరిస్థితులు ఉంటాయి. కుటుంబంలో అదనపు బాధ్యతలు కొంత చికాకు పరుస్తాయి.

513
కర్కాటక రాశి ఫలాలు

ముఖ్యమైన పనులలో ఆటంకాలుంటాయి. కుటుంబ పెద్దల ఆరోగ్య సమస్యలు బాధిస్తాయి. వ్యాపారాలలో ఊహించని సమస్యలు ఎదురవుతాయి. ఉద్యోగులకు పని ఒత్తిడి పెరుగుతుంది. కొన్ని వ్యవహారాలలో కష్టానికి తగిన ఫలితం దక్కదు. దూర ప్రయాణాలలో అవరోధాలు కలుగుతాయి.

613
సింహ రాశి ఫలాలు

మిత్రుల నుంచి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. అనుకున్న సమయానికి అనుకున్న విధంగా పనులు పూర్తి చేస్తారు. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగాలలో సమస్యలు తొలగి ఊరట చెందుతారు. సంఘంలో ప్రముఖులతో పరిచయాలు విస్తృతమవుతాయి. శుభ కార్యాలకు డబ్బు ఖర్చు చేస్తారు.

713
కన్య రాశి ఫలాలు

ఉద్యోగులకు ఇతరుల నుంచి ఊహించని సమస్యలు కలుగుతాయి. చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి. బంధువులతో మాటపట్టింపులు ఉంటాయి. కుటుంబ వాతావరణం చికాకు పరుస్తుంది. ఆదాయ మార్గాలకు అవరోధాలు కలుగుతాయి. ఇంటా బయటా విమర్శలు అధికమవుతాయి.

813
తుల రాశి ఫలాలు

చేపట్టిన పనులలో అప్రయత్న కార్యసిద్ధి కలుగుతుంది. వ్యాపారాలలో నూతన పెట్టుబడులు అందుతాయి. నిరుద్యోగుల ప్రయత్నాలు కొంత అనుకూలిస్తాయి. ఉద్యోగాలలో సమస్యలు అధిగమించి ముందుకు సాగుతారు. సమాజంలో గౌరవ మర్యాదలకు లోటుండదు. మిత్రుల నుంచి విలువైన వస్తువులు బహుమతులుగా పొందుతారు.

913
వృశ్చిక రాశి ఫలాలు

నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. వృత్తి, ఉద్యోగాలలో నూతన బాధ్యతలు చేపడతారు. అవసరానికి చేతిలో డబ్బు ఉండదు. నూతన రుణ ప్రయత్నాలు కలసిరావు. దూర ప్రయాణాలు వాయిదా పడతాయి. వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. ఇంట్లో కొందరి ప్రవర్తన తలనొప్పి తెప్పిస్తుంది.

1013
ధనుస్సు రాశి ఫలాలు

ఆర్థికంగా అనుకూలత కలుగుతుంది. కుటుంబ సభ్యులతో దైవదర్శనం చేసుకుంటారు. చిన్ననాటి మిత్రులతో సంతోషంగా గడుపుతారు. వృత్తి, వ్యాపారాలలో నూతన ప్రోత్సాహకాలు లభిస్తాయి. ఉద్యోగాలలో అనుకూల వాతావరణం ఉంటుంది. నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి.

1113
మకర రాశి ఫలాలు

ఆప్తుల నుంచి ధన సహాయం అందుతుంది. ఆదాయ మార్గాలు విస్తృతమవుతాయి. చేపట్టిన పనులలో విజయం కలుగుతుంది. వ్యాపారాలలో ఆశించిన లాభాలు అందుతాయి. ఉద్యోగుల కలలు ఫలిస్తాయి. ఆధ్యాత్మిక విషయాలపై దృష్టి సారిస్తారు. చిన్ననాటి మిత్రులతో విందు వినోదాది కార్యక్రమాలలో పాల్గొంటారు.

1213
కుంభ రాశి ఫలాలు

సన్నిహితుల నుంచి ఊహించని సమస్యలు కలుగుతాయి. కుటుంబ సభ్యులతో చిన్నపాటి మాటపట్టింపులుంటాయి. వృత్తి, వ్యాపారాలు నిదానంగా సాగుతాయి. ఉద్యోగులు అధికారుల ఆగ్రహానికి గురికావాల్సి వస్తుంది. సోదరులతో ఆస్తి వివాదాలు చికాకు కలిగిస్తాయి. ఇతరుల నుంచి రుణ ఒత్తిడులు అధికమవుతాయి.

1313
మీన రాశి ఫలాలు

ఉద్యోగాలలో అదనపు బాధ్యతల వల్ల తగిన విశ్రాంతి ఉండదు. చేపట్టిన పనుల్లో అవాంతరాలు కలుగుతాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. వృత్తి, వ్యాపారాలలో మిశ్రమ ఫలితాలుంటాయి. దాయదులతో స్థిరాస్తి ఒప్పందాలు వాయిదా పడతాయి. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉంటుంది.

Read more Photos on
click me!

Recommended Stories