Today Rasi Phalalu: నేడు ఓ రాశివారు డబ్బు విషయంలో ఇతరులకు మాట ఇవ్వడం మంచిదికాదు!

Published : Jul 22, 2026, 05:00 AM IST

Today Rasi Phalalu: ఈ రాశి ఫలాలు 22.07.2026 బుధవారానికి సంబంధించినవి. మేష, వృషభ, మిథున, కర్కాటక, సింహ, కన్య, తుల, వృశ్ఛిక, ధనుస్సు, మకర, కుంభ, మీన రాశుల దిన ఫలాలు ఇక్కడ తెలుసుకోండి.

PREV
113
నేటి రాశి ఫలాలు

ఈ రోజు రాశి ఫలాలు పంచాంగకర్త ఫణికుమార్ అందిస్తున్నారు. నేడు ఏ రాశి వారికి ఎలా ఉందో ఇక్కడ వివరంగా తెలుసుకుందాం.

213
మేష రాశి ఫలాలు

కుటుంబ సభ్యుల నుంచి శుభవార్తలు అందుతాయి. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. ఇంటా బయటా మీ మాటకు విలువ పెరుగుతుంది. చేపట్టిన పనులు అప్రయత్నంగా పూర్తవుతాయి. బంధుమిత్రుల రాక ఆనందం కలిగిస్తుంది. వృత్తి, ఉద్యోగాలలో సహోద్యోగులతో సఖ్యత పెరుగుతుంది.

313
వృషభ రాశి ఫలాలు

డబ్బు వ్యవహారాలలో ఇతరులకు మాట ఇవ్వడం మంచిది కాదు. వృత్తి, ఉద్యోగాలలో నిలకడ లోపిస్తుంది. కొన్ని పనులు అనుకున్నట్లుగా జరగక ఇబ్బంది పడతారు. దూరప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. శారీరక, మానసిక అనారోగ్య సమస్యలు మరింత బాధిస్తాయి.

413
మిథున రాశి ఫలాలు

సంతాన వివాహ, ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆర్థికంగా అనుకూలం. సమాజంలో కీర్తి ప్రతిష్ఠలు పెరుగుతాయి. గృహ నిర్మాణ ఆలోచనలు కార్యరూపం దాల్చుతాయి. వృత్తి, వ్యాపారాలలో ఆశించిన లాభాలు అందుకుంటారు. తల్లిదండ్రుల ఆరోగ్యం విషయంలో శుభవార్తలు అందుతాయి.

513
కర్కాటక రాశి ఫలాలు

ఉద్యోగులు ఉన్నత పదవులు పొందుతారు. కొన్ని వ్యవహారాలలో స్థిరమైన నిర్ణయాలు తీసుకొని లాభపడతారు. దాయాదులతో స్థిరాస్తి వివాదాలు పరిష్కారం దిశగా సాగుతాయి. నిరుద్యోగులు లభించిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి. ఇంటా బయటా గౌరవ మర్యాదలు పెరుగుతాయి.

613
సింహ రాశి ఫలాలు

దీర్ఘకాలిక రుణాలు తీర్చగలుగుతారు. సంతానానికి నూతన ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. శారీరక, మానసిక ప్రశాంతత లభిస్తుంది. ఇతరుల సహాయ సహకారాలతో కొన్ని సమస్యల నుంచి బయటపడతారు. వృత్తి, ఉద్యోగాలలో అదనపు బాధ్యతల నుంచి ఉపశమనం పొందుతారు. వ్యాపారాలు అనుకూలం.

713
కన్య రాశి ఫలాలు

దూర ప్రయాణ సూచనలు ఉన్నాయి. అనుకోని విధంగా ఖర్చులు పెరుగుతాయి. నిరుద్యోగుల ప్రయత్నాలు మందకొడిగా సాగుతాయి. కొన్ని వ్యవహారాలలో ఊహించని ఇబ్బందులు ఎదురవుతాయి. వృత్తి, ఉద్యోగాలలో అధికారులతో నిదానంగా వ్యవహరించాలి. వ్యాపారాలు అంతగా కలిసిరావు.

813
తుల రాశి ఫలాలు

వృత్తి, వ్యాపారాలలో నష్టాలు అధిగమించి లాభాలు అందుకుంటారు. ఉద్యోగాలలో అధికారులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా వ్యవహారించాలి. ఆదాయం పెరుగుతుంది. ఇంటా బయటా సమస్యలు ఉన్నప్పటికీ నిదానంగా పరిష్కరించుకుంటారు. స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు వేగవంతం చేస్తారు.

913
వృశ్చిక రాశి ఫలాలు

ఇంటా బయటా ఊహించని సమస్యలు కలుగుతాయి. కుటుంబ సభ్యులతో మనస్పర్థలు తప్పవు. ప్రారంభించిన పనులు మందగిస్తాయి. ఆదాయానికి మించి ఖర్చులుంటాయి. వృత్తి, వ్యాపారాలలో ఆలోచనలు అంతగా కలిసిరావు. డబ్బు విషయాలలో ఇతరులకు మాట ఇవ్వడం మంచిది కాదు.

1013
ధనుస్సు రాశి ఫలాలు

కొన్ని నిర్ణయాలు ధైర్యంగా తీసుకుంటారు. నిరుద్యోగులకు నూతన అవకాశాలు అందుతాయి. నూతన వస్త్ర ఆభరణాలను కొనుగోలు చేస్తారు. అన్ని వైపుల నుంచి ఆర్థిక లాభాలు అందుతాయి. వృత్తి, వ్యాపారాలు ఆశించిన విధంగా సాగుతాయి. సోదరులతో సఖ్యతగా ఉంటారు.

1113
మకర రాశి ఫలాలు

తల్లితరపు వారితో మాటపట్టింపులు ఉంటాయి. పాత బాకీలు తీర్చగలుగుతారు. చేపట్టిన పనులలో అడ్డంకులు తప్పవు. శారీరక, మానసిక అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. వృత్తి, ఉద్యోగాలలో మిశ్రమ ఫలితాలుంటాయి. వ్యాపారాలలో వివాదాలకు దూరంగా ఉండటం మంచిది.

1213
కుంభ రాశి ఫలాలు

సంతాన ఆరోగ్యం విషయంలో జాగ్రత్త వహించాలి. వృత్తి, ఉద్యోగాలలో పని ఒత్తిడి పెరుగుతుంది. ఊహించని విధంగా ఇతరులతో వివాదాలు కలుగుతాయి. కుటుంబ సభ్యులు మీ మాటతో విభేదిస్తారు. ఇంట్లో విలువైన వస్తువుల విషయంలో అప్రమత్తత అవసరం.

1313
మీన రాశి ఫలాలు

చేపట్టిన పనుల్లో జాప్యం కలిగినప్పటికీ నిదానంగా పూర్తిచేస్తారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. సన్నిహితుల నుంచి వివాదాలకు సంబంధించిన సమాచారం అందుతుంది. వృత్తి, ఉద్యోగాలలో అధికారులతో చర్చలు ఫలిస్తాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ప్రయాణాలు లాభదాయకం.

Read more Photos on
click me!

Recommended Stories