ఆస్తి వివాదాలు పరిష్కారం దిశగా సాగుతాయి. ఆప్తుల నుంచి శుభవార్తాలు అందుతాయి. ఆకస్మిక ధన ప్రాప్తి కలుగుతుంది. వ్యాపారాలు లాభిస్తాయి. ఇంటా బయట పరిస్థితులు అనుకూలిస్తాయి. కుటుంబానికి సంబంధించి కొన్ని ఆశ్చర్యకర విషయాలు తెలుసుకుంటారు. వృత్తి, ఉద్యోగాల్లో ఒత్తిడులు అధిగమిస్తారు.