Saturn Venus Conjunction: శని శుక్రుల కలయికతో ఈ 3 రాశులకు జీతం పెరిగే అవకాశం

Published : Jan 27, 2026, 10:40 AM IST

Saturn Venus Conjunction: శని శుక్ర సంయోగం వల్ల అర్ధ కేంద్ర యోగం ఏర్పడుతుంది. దీని వల్ల మూడు రాశుల వారికి విపరీతంగా కలిసి వస్తుంది. ముఖ్యం జీతంలో పెంపు, ప్రమోషన్ దక్కే అవకావం ఉంది. 

PREV
14
శని శుక్రుల కలయికతో..

జ్యోతిష్య లెక్కల ప్రకారం  జనవరి 28 ఉదయం 7:30 గంటలకు శని, శుక్రుడి మధ్య ఒక ప్రత్యేక కోణం ఏర్పడుతుంది. అందుకే ఈ రెండు గ్రహాల కలయిక ఎంతో ప్రభావవంతంగా ఉంటుంది. ఈ యోగం ఏర్పడే సమయంలో  శుక్రుడు మకరరాశిలో ఉంటాడు. సూర్యుడు, కుజుడు, బుధుడితో  కలిసి బలమైన స్థితిలో ఉంటాడు. దృక్ పంచాంగం ప్రకారం జనవరి 28 ఉదయం 7:29 గంటలకు, శని, శుక్రుడు ఒకరికొకరు 45 డిగ్రీల దూరంలోకి వస్తారు.  దీనివల్ల అర్ధ కేంద్ర యోగం ఏర్పడుతుంది.  కాబట్టి కొన్ని రాశుల వారికి ప్రత్యేకంగా కొన్ని లాభాలు కలుగుతాయి.

24
వృషభ రాశి

వృషభ రాశి వారికి ఈ యోగం వల్ల బాగా కలిసొస్తుంది.  ఈ సమయం అదృష్టాన్ని తీసుకొస్తుంది. శుక్ర, శని గ్రహాల ఈ కలయిక ఈ రాశి వారి విధి, కర్మకు సంబంధించిన రంగాలను చురుకుగా ఉంచుతుంది. ఈ రాశి వారు చాలా కాలంగా చేస్తున్న కష్టానికి తగ్గ ఫలితం వస్తుంది. విదేశీ పర్యటన చేసే అవకాశం ఉంది. కొత్త ఉద్యోగావకాశాలు వచ్చే అవకాశం ఉంది . ఈ రాశి వారు చేసే పనికి ప్రశంసలు దక్కుతాయి. ప్రమోషన్, బోనస్ పొందే అవకాశం ఉంది. వ్యాపారులకు ఇది బాగా కలిసొస్తుంది.  బయటి వనరుల నుంచి ఆర్థిక లాభాలు దక్కుతాయి. ఈ రాశి వారి ఆర్థిక పరిస్థితి బలపడుతుంది. భవిష్యత్తు కోసం డబ్బు ఆదా చేస్తారు.

34
మకర రాశి

మకర రాశి వారికి శని, శుక్రుడి కలయిక సానుకూల ఫలితాలను అందిస్తుంది.  శని ప్రస్తుతం ఈ రాశి వారి సంపద ఇంట్లో ఉండటం వల్ల ఆర్థికంగా బాగా కలిసివస్తుంది. ఈ రాశి వారి మనసు ఆధ్యాత్మికత వైపుకు మళ్లుతుంది. మతపరమైన ప్రయాణాలు చేసే అవకాశం ఉంది. అలాగే వీరికి కొత్త ఉద్యోగావకాశాలు కూడా వచ్చే ఛాన్స్ ఉంది. ఈ రాశి వారికి కష్టానికి తగ్గ గుర్తింపు లభిస్తుంది. ఉన్నతాధికారులు, సహోద్యోగులు ఈ రాశి వారి పనిని ఆకట్టుకుంటారు. వ్యాపార రంగంలో ఉన్నవారు మంచి లాభాలు పొందుతారు. కొత్త ఒప్పందం లేదా ప్రాజెక్ట్  వచ్చే అవకాశం ఉంది. 

44
మీన రాశి

మీన రాశి వారికి ఈ అర్థ కేంద్ర యోగం చాలా మంచి అవకాశాలు ఇస్తుంది. ప్రస్తుతం, శని ఈ  రాశి వారికి బాగా ప్రభావితం చేస్తుంది. శుక్రుడు లాభ గృహాన్ని ప్రభావితం చేస్తున్నాడు కాబట్టి ఇది అదృష్టాన్ని తెస్తుంది. చాలా కాలంగా తీరని కోరిక తీరే అవకాశం ఉంది. ఈ రాశి వారు కుటుంబంతో మంచి సమయం గడిపుతారు. ఆకస్మికంగా ఆర్థికంగా లాభాలు రావచ్చు. పూర్వీకుల ఆస్తి నుంచి లాభం వచ్చే అవకాశం ఉంది. ఉద్యోగులు తమ పనికి తగ్గ గుర్తింపు పొందుతారు. వీరికి ప్రమోషన్ లేదా జీతం పెంపు వంటివి కలిగే ఛాన్స్ ఉంది. విదేశీ ఉద్యోగాలు కూడా అందుబాటులోకి రావచ్చు. 

Read more Photos on
click me!

Recommended Stories