Zodiac sign: ఈ రాశి పిల్లలకు కోపం చాలా ఎక్కువ..!

Published : Jul 15, 2022, 12:51 PM IST

 కొందరు పిల్లలకు మాత్రం విపరీతమైన కోపం వచ్చేస్తూ ఉంటుంది. ఇదిగో.. ఈ కింద రాశులకు చెందిన పిల్లలకు కూడా కోపం చాలా ఎక్కువట.  ఎక్కువ కోపం నుంచి అతి తక్కువ కోపం ఎవరికి ఉంటుందో ఓసారి చూద్దాం. 

PREV
113
Zodiac sign:  ఈ రాశి పిల్లలకు కోపం చాలా ఎక్కువ..!

పిల్లలు అందరూ ఒకేలా ఉండరు. ఒక్కొక్కరు ఒక్కోలా ఉంటారు. కొందరు చెప్పిన విషయాన్ని వెంటనే అర్థం చేసుకుంటారు. కొందరికి ఒకటికి పది సార్లు చెప్పాల్సి ఉంటుంది. ఇక కొందరు పిల్లలు చాలా కామ్ గా ఉంటారు. కానీ కొందరు పిల్లలకు మాత్రం విపరీతమైన కోపం వచ్చేస్తూ ఉంటుంది. ఇదిగో.. ఈ కింద రాశులకు చెందిన పిల్లలకు కూడా కోపం చాలా ఎక్కువట.  ఎక్కువ కోపం నుంచి అతి తక్కువ కోపం ఎవరికి ఉంటుందో ఓసారి చూద్దాం.  జోతిష్య శాస్త్రం ప్రకారం ఆ రాశులేంటో ఓసారి చూద్దాం..

213

1.సింహ రాశి..

సింహ రాశికి చెందిన పిల్లలకు కోపం చాలా ఎక్కువ. ఈ రాశి పిల్లలు నిత్యం అటెన్షన్ కోరుకుంటూ ఉంటారు. ఎంత మందిలో అందరూ తమను గుర్తించాలని ఆరాటపడుతూ ఉంటారు. వారు కోరుకున్నది జరగకుంటే వీరికి విపరీతంగా కోపం వస్తుంది. ఎలాగైనా వారు కోరుకున్నది సాధించుకుంటారు.

313

2..మేష రాశి..
మేష రాశి పిల్లల ప్రవర్తన అన్ని విషయాల్లోనూ అతిగా ఉంటుంది. వీరు నిజానికి తెలివైన వారు. దాదాపు అన్ని విషయాల్లో ఓపికగానే ఉంటారు. కానీ.. ఎప్పుడైతే తాము కోరుకున్నది జరగదు అని తెలిస్తే మాత్రం అస్సలు ఊరుకోరు. విపరీతమైన కోపం తెచ్చుకుంటారు.

413

3.ధనస్సు రాశి..
ధనస్సు రాశివారికి రూల్స్ ఫాలో అవ్వాలి అంటూ.. బౌండరీలు పెడితే అస్సలు నచ్చదు. ఇలానే చేయాలి.. అలానే చేయాలి అంటే వీరికి చాలా కోపం వచ్చింది. రూల్స్ ని వీరు పనిష్మెంట్ లా ఫీలౌతూ ఉంటారు.
 

513

4.వృషభ రాశి..
వృషభ రాశివారు మనసులో ఏది ఉన్నా బయటకు పెట్టరు. చాలా తక్కువగా మాట్లాడుతూ ఉంటారు. వీరు కేవలం తమ కంఫర్ట్ జోన్ లో మాత్రమే ఉంటారు. దాని నుంచి బయటకు రావాలని వీరు ప్రయత్నించరు. వారి కంఫర్ట్ జోన్ నుంచి బయటకు తీసుకు  రావాలని ప్రయత్నిస్తే మాత్రం కోపంతో ఊగిపోతారు.

613

5.కుంభ రాశి..
నిజానికి కుంభ రాశివారు చాలా కామ్ గా ఉంటారు. చాలా బుద్దిగా పొద్దికగా ఉంటారు. కానీ వారికి తమకంటూ స్పేస్, ప్రైవసీ లేకపోతే మాత్రం... వారు తమ నిశ్శబ్దాన్ని బద్దలు కొట్టేస్తారు. వారి కోపాన్ని ఎవరూ కంట్రోల్ చేయలేరు.

713

6.మీన రాశి..
మీన రాశికి చెందిన పిల్లలు ఎలాంటి పరిస్థితిని అయినా అర్థం చేసుకుంటారు. అయితే.. వారిని ప్రతి విషయంలో అందరూ గ్రాంటెడ్ తీసుకుంటే మాత్రం విపరీతమైన కోపంతో ఊగిపోతారు. ఆ సమయంలో వీరి టెంపర్ ని ఎవరూ హ్యాండిల్ చేయలేరు.

813

7.వృశ్చిక రాశి..
వృశ్చిక రాశి వారు దాదాపు చాలా ఓపికగా, కామ్ గా ఉంటారు కానీ.. ఏదైనా వాదన జరిగితే మాత్రం  వీరికి కోపం వచ్చేస్తుంది. అప్పుడు మాత్రమే వీరు తమ కోపాన్ని చూపిస్తారు.

913

8.కర్కాటక రాశి..
 కర్కాటక రాశివారు ఎమోషన్స్ కి ఎక్కువ విలువ ఇస్తారు. వీరు తొందరగా ఎవరిపైనా కోపం చూపించలేరు. కోపం వచ్చినప్పుడు కూడా వీరు ఏడుస్తారు.. బాధ పడతారు. కానీ ఎక్కువగా కోపం చూపించరు. వీరు కోపం చూపించే సందర్భాలు చాలా తక్కువగా ఉంటాయి.

1013

9.మిథున రాశి..

మిథున రాశివారు నిత్యం చాలా సరదాగా ఉంటారు.  వీరికి కోపం వచ్చే సందర్భాలు చాలా అంటే చాలా తక్కువ. ఏదైనా బాగా బాధపెట్టినప్పుడు మాత్రమే వీరు దాని గురించి ఆలోచించడం, బాధ పడటం, కోప్పడటం లాంటివి చేస్తారు. లేదంటే వీరు చాలా సౌమ్యులు.

1113

10.కన్య రాశి..
కన్య రాశి పిల్లలకు కోపం రాదు. మెచ్యూరిటీ లేనివారు మాత్రమే కోపం తెచ్చుకుంటారు అని వీరు అనుకుంటారు. వీరు ఎదుటివారి మీద పదాలు వాడటంలోనూ చాలా జాగ్రత్తగా ఉంటారు. ఎదుటివారు బాధపడే మాటలను కూడా వీరు మాట్లాడరు.

1213

11.మకర రాశి..
మకర రాశి పిల్లలు చాలా తెలివిగల వారు. చాలా ప్రాక్టికల్ గా ఉంటారు. వీరికి ఏది అవసరమో, ఏది కాదో క్లారిటీ చాలా ఎక్కువ. ఏ విషయంలో కోపం తెచ్చుకోవాలో.. దేనికి అవసరం లేదో వీరికి క్లారిటీ ఎక్కువ. కాబట్టి.. అవసరం లేనివాటి కోసం ఏడ్వడం, కోపం తెచ్చుకోవడ లాంటివి వీరు చేయరు.

1313

12.తుల రాశి..

ఈ రాశివారు ప్రతి విషయంలోనూ చాలా బ్యాలెన్స్డ్ గా ఉంటారు.ఈ రాశిపిల్లలు ఉండటం వారి తల్లిదండ్రులు ఎంతో అదృష్టం చేసుకున్నారో. అలా ఉంటుంది వీరి ప్రవర్తన. ఎవరితోనూ గొడవలు పడటం కూడా వీరికి తెలీదు.

click me!

Recommended Stories