చీపురును ఇంట్లో పెడితే ఏమౌతుందో తెలుసా?

First Published | Dec 2, 2024, 12:29 PM IST

వాస్తుశాస్త్ర నిపుణుల ప్రకారం.. మన ఇంట్లో అంతా బాగుండాలంటే ప్రతి వస్తువు వాస్తు ప్రకారమే ఉండాలి. అయితే చాలా మంది చీపురును ఇంట్లో ఏడ పడితే అక్కడ పెడుతుంటారు. కానీ దీనివల్ల ఏం జరుగుతుందో తెలుసా? 

వాస్తుశాస్త్రం మన ఇంటికి సంబంధించిన ప్రతి విషయం గురించి ఎంతో వివరంగా చెప్తుంది. ముఖ్యంగా మన ఇంట్లోఉన్న వస్తువుల గురించి. ప్రతి ఒక్కరి ఇంట్లో రెగ్యులర్ గా వాడే చీపురు గురించి వాస్తు శాస్త్రం ఎన్నో విషయాలను తెలియజేస్తుంది. కానీ దీని గురించి ఎవ్వరూ పెద్దగా పట్టించుకోరు. 
 


వాస్తు ప్రకారం.. చీపురు ఎన్నో విషయాలకు చిహ్నంగా భావిస్తారు. చీపును శ్రేయస్సుకు, పరిశుభ్రతకు. ప్రతికూల శక్తులను తరిమికొట్టడానికి ఉపయోగపడుతుందని వాస్తు శ్రాస్త్రం నమ్ముతోంది. వాస్తు ప్రకారం.. చీపురును ఎక్కవ పెడుతున్నామనేది మన ఇంట్లో ఇంట్లో శక్తి ప్రవాహాన్ని ప్రభావితం చేస్తుందట. అందుకే దీన్ని ఎక్కడ పడితే అక్కడ పెట్టకూడదు. దీన్ని పెట్టాల్సిన స్థానంలో పెడితేనే ఇళ్లు క్షేమంగా ఉంటుంది.

వస్తు ప్రకారం.. ఇంట్లో చీపురును సరైన ప్లేస్ లో పెడితే పాజిటీవ్ ఎనర్జీ ఇళ్లు మొత్తం వ్యాపిస్తుంది. ఒకవేళ మీరు రాంగ్ ప్లేస్ లో పెడిగే నెగిటీవ్ ఎనర్జీ వస్తుంది. అయితే మనలో చాలా మంది చీపును ఇంటి బయటే పెడుతుంటారు. అసలు చీపురును ఇంటి లోపల పెట్టాలా? లేదంటే ఇంటి బయటపెట్టాలో ఇప్పుడు తెలుసుకుందాం పదండి. 
 


వాస్తు శాస్త్రంలో చీపురుకున్న ప్రాముఖ్యత

చీపురుతో ఇంటిని, వాకిలిని క్లీన్ చేస్తాం కాబట్టి దీన్నిజస్ట్ శుభ్రపరిచే వస్తువుగానే చూడటం సరికాదు.ఇది ఒక నిత్యవసర వస్తువే అయినా.. దీనికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఎందుకంటే చీపుర్లు ఇంట్లో ఉన్న ప్రతికూలతలను బయటకు తరిమికొడతాయి. అలాగే ఇంట్లో శ్రేయస్సు, సుఖ సంతోషాలు ఉండటానికి సహాయపడతాయని వాస్తు శాస్త్రం చెబుతోంది. 

అందుకే చీపురును తప్పుగా ఉపయోగించినా లేదా తప్పుడు ప్లేస్ లో పెట్టినా మీ ఇంటి ఆర్థిక పరిస్థితి దిగజారుతుంది. అలాగే మీకు అనుకోని ఆర్థిక సమస్యలు వస్తాయని వాస్తు శాస్త్రం చెబుతోంది. మీరు చీపురును తప్పుగా ఉపయోగిస్తే ఇంట్లో ఉన్న పాజిటీవ్ ఎనర్జీ పోతుంది. అందుకే చీపురు విషయంలో జాగ్రత్తగా ఉండాలంటారు. 
 

Looking at the broom


చీపురును ఇంటి బయట ఉంచాలా? 

చాలా మంది చీపుర్లను ఇంటి బయటే పెడుతుంటారు. కానీ వాస్తు శాస్త్రం ప్రకారం.. చీపుర్లను ఎప్పుడూ కూడా ఇంటి బయట ఉంచకూడదు. ముఖ్యంగా ఇతరులకు కనిపించే ప్లేస్ లో. ఇంటికి దూరంగా చీపురును ఉంచితే మీకు ఎన్నో ప్రతికూలతలు ఎదురవుతాయి. చీపురును సరిగ్గా ఉంచకపోతే డబ్బు నష్టం కలుగుతుంది. ఎందుకంటే చీపురు సంపద దేవత అయిన లక్ష్మీదేవికి సంబంధించింది కాబట్టి. 
  
చీపురును ఇంటి బయట అంటే ఇతరులకు కనిపించే ప్రదేశంలో చీపురును పెడితే లక్ష్మీదేవికి కోపం వస్తుంది. దీంతో ఆ తల్లి అనుగ్రహం మీ ఇంటిపై ఉండదని నమ్ముతారు. దీనివల్ల మీకు  ఆర్థిక ఇబ్బందులు, కష్టాలు వస్తాయని నమ్ముతారు. వాస్తు ప్రకారం.. ఇంటిని శుభ్రంగా ఉంచే చీపురును సరైన ప్రదేశంలోనే పెట్టాలి. మీరు అందరికీ కనిపించే చోట చీపురును పెడితే మీ ఇంట్లోకి ప్రతికూల శక్తులు వచ్చే ప్రమాదం ఉంది. 
 

Vastu tips of broom

చీపురును ఎక్కడ పెట్టాలి? 

వాస్తు ప్రకారం.. చీపురును ఉంచడానికి ఇంటి నైరుతి మూల ఎంతో పవిత్రమైంది. ఈ మూలను చీపురును ఉంచడానికి మంచి అనువైన ప్లేస్ గా భావిస్తారు. ఎందుకంటే ఈ మూల స్థిరత్వం, సమతుల్యతతో సంబంధాన్ని కలిగుంటుంది. మీరు చీపురును ఇక్కడ పెడితే మీ ఇంట్లో శ్రేయస్సు నెలకొంటుంది. మీ ఆర్థిక పరిస్థితి బాగుంటుంది. 

ఎప్పుడైనా సరే చీపురును ఇంటి బయట అంటే ఇతరులకు కనిపించే ప్లేస్ లో పెట్టకూడదు. అయితే చీపురును మెట్ల కింద, స్టోర్ రూమ్ లో లేదా ఎవ్వరికీ కనిపించని మూలలో పెట్టొచ్చు. ఏదేమైనా బయటి వ్యక్తులకు చీపురును కనిపించకుండా ఉంచాలి. వాస్తు ప్రకారం చీపురును ఉత్తర, ఈశాన్య దిశల్లో పెట్టొద్దు. ఎందుకంటే ఇవి సంపద, పురోగతికి సంబంధించినవిగా నమ్ముతారు. ఈ మూలల్లో చీపురును పెడితే మీ ఇంట్లో డబ్బుకు లోటు ఉంటుంది. అందుకే ఈ మూలల్లో మాత్రం చీపురును పెట్టకూడదు. 

Latest Videos

click me!