Budhaditya Yogam: సూర్య బుధుల సంయోగం.. ఈ రాశులవారు జాక్ పాట్ కొట్టినట్టే

Published : Feb 09, 2026, 11:44 AM IST

Budhaditya Yogam:  జ్యోతిషశాస్త్రం ప్రకారం  మార్చి 7 నుంచి సూర్యుడు, బుధుడు సంయోగం చెందుతారు. సూర్యుడు, బుధుడి కలయికతో బుధాదిత్య రాజయోగం ఏర్పడింది. ఈ యోగం వల్ల కొన్ని రాశుల వారికి విపరీతంగా కలిసి వస్తుంది.

PREV
15
మేష రాశి

మేష రాశి వారికి సూర్య, బుధుల సంయోగం కొత్త ఉద్యోగావకాశాలను అందిస్తుంది. ఈ రాశి వారు ప్రభుత్వ ఉద్యోగానికి సిద్ధమవుతుంటే వారికి ఆ కోరిక తీరే అవకాశం ఉంది. అలాగే ప్రమోషన్ కోసం ఎదురుచూస్తున్న వారికి ఉన్నత పదవి దక్కే అవకాశం ఉంది. ఇది ఉద్యోగంలో ఎదగడానికి ఇది అనుకూలమైన సమయం. ఈ రాశి వారు నిర్ణయం తీసుకునే సామర్థ్యం కూడా బాగా పెరుగుతుంది. సమాజంలో మేష రాశి వారు చేసే మంచి పనులకు గుర్తింపు లభిస్తుంది.

25
మిథున రాశి

మిథున రాశి వారికి అధిపతి బుధుడు.  కాబట్టి సూర్యుడు, బుధుడి  కలయిక వీరికి ఎంతో కలిసి వస్తుంది. ఈ యోగం వీరికి ప్రత్యేకంగా మేలు చేస్తుంది. వ్యాపారం దిగాలనకుంటే ఇదే మంచి సమయం. ఇప్పటికే వ్యాపారం చేస్తున్నవారికి అందులో భారీ పెట్టుబడులు పెట్టడానికి ఇదే మంచి సమయం. ఆర్థికంగా వీరు బాగా స్థిరపడే కాలం ఇది, గతంలో ఇతరుల దగ్గర నిలిచిపోయిన డబ్బు తిరిగి చేతికి అందే సమయం. మీ మాటతీరు వల్ల  సమస్యలను సులభంగా పరిష్కరిస్తారు.

35
సింహ రాశి

సింహ రాశికి అధిపతి సూర్యుడు. కాబట్టి బుధ సూర్యుల కలయిక ఈ రాశి వారిలో ఆత్మవిశ్వాసాన్ని  పెంచుతుంది. వీరికి పూర్వీకుల ఆస్తికి సంబంధించిన వివాదాలు పరిష్కారమై సంతోషంగా ఉంటారు.  రాజకీయాలు లేదా మేనేజ్‌మెంట్‌లో రంగంలో ఉన్న వారికి ఉన్నత పదవి లేదా మరిన్ని బాధ్యతలు దక్కే అవకాశాలు ఉన్నాయి. సమాజంలో వీరి పలుకుబడి, మంచి పేరు పెరుగుతుంది.

45
తులా రాశి

తులా రాశి వారికి ఈ బుధాదిత్య రాజయోగం సంపద పరంగా  కొత్త ఆదాయ మార్గాలు తెరుచుకుంటాయి. ఉద్యోగులకు మంచి రోజులు మొదలవుతాయి. వీరికి పై అధికారుల నుంచి ఈ రాశి వారికి మంచి సపోర్టు లభిస్తుంది. సృజనాత్మక పనులు లేదా కళారంగాల్లో ఉన్నవారికి ఈ సమయం బాగా కలిసి వస్తుంది. వీరికి మంచి పేరు, ఆర్థిక లాభాలు పొందే అవకాశాలు కలుగుతాయి.

55
ధను రాశి

ధనుస్సు రాశి వారికి సూర్యుడు, బుధుల కలయిక  ఎంతో అదృష్టాన్ని తెచ్చిపెడుతుంది.  వీరికి ఆధ్యాత్మిక కార్యక్రమాలపై వీరికి విపరీతమైన ఆసక్తి పెరుగుతుంది. అలాగే  దూర ప్రయాణాలు చేసేందుకు వెళతారు. ఆ ప్రయాణం ఆహ్లాదకరంగా, లాభదాయకంగా ఉంటుంది. ఇక ఉన్నత విద్య అభ్యసిస్తున్న విద్యార్థులకు మంచి శుభవార్తలు అందే అవకాశం ఉంది. మీకు ధైర్యం పెరుగుతుంది.

Read more Photos on
click me!

Recommended Stories