అక్టోబర్ నెలలో పుట్టిన పిల్లల్లో ఉండే లక్షణాలు ఇవే...!

First Published Oct 6, 2022, 2:22 PM IST

ఎలాంటి పరిస్థితుల్లో అయినా వీరు ఉత్సాహంగా ఉంటారు. వారు తమ వ్యక్తిత్వంతో ప్రజలను కూడా ఉత్సాహపరుస్తారు.

అక్టోబర్ మాసంలో పుట్టిన పిల్లల్లో చాలా ప్రత్యేక లక్షణాలు ఉంటాయట. ఈ ప్రత్యేక లక్షణాలే వారిని ఇతరుల నుంచి స్పెషల్ గా చూపిస్తుంది. ఈ దసరాలోనే మనం ప్రతి సంవత్సరం దసరా పండగను జరుపుకుంటాం. మరి ఈ పవిత్ర నెలలో పుట్టిన పిల్లల్లో ఉండే లక్షణాలేంటో ఓసారి చూద్దాం..
 

అక్టోబర్‌లో జన్మించిన పిల్లలను ప్రత్యేకంగా చేసే కొన్ని లక్షణాలు ఉన్నాయి. అక్టోబర్‌లో జన్మించిన మహాత్మా గాంధీ, బిల్ గేట్స్, ఆర్‌కె నారాయణ్ వంటి దిగ్గజాలు ప్రపంచవ్యాప్తంగా గౌరవం దక్కించుకున్నారు.
 

అక్టోబర్ నెలలో పుట్టిన వారు  ప్రశాంతంగా, ఆహ్లాదంగా ఉంటారు. వీరిలో ఉన్న ప్రత్యేక గుణం. ఎలాంటి పరిస్థితుల్లో అయినా వీరు ఉత్సాహంగా ఉంటారు. వారు తమ వ్యక్తిత్వంతో ప్రజలను కూడా ఉత్సాహపరుస్తారు.

అక్టోబర్‌లో జన్మించిన పిల్లలు శృంగార స్వభావం కలిగి ఉంటారు. ఈ పిల్లలు వారి జీవితంలో ప్రేమకు స్వచ్ఛమైన, పవిత్రమైన స్థానాన్ని ఇస్తారు. వీరు చూపించే ప్రేమ, వీరిలోని రొమాంటిక్ యాంగిల్... తమ పార్ట్ నర్ కి విపరీతంగా నచ్చేస్తోంది.

అక్టోబరులో జన్మించిన పిల్లలను ఎల్లప్పుడూ ప్రేరేపించే ఏదైనా ఉంటే, అది వారి బలమైన సంకల్ప శక్తి. ప్రతి పనిని చేయాలన్న ఆత్మవిశ్వాసం, ఒక పని పట్ల సరైన దృక్పథం, పూర్తి కాకముందే నిష్క్రమించకూడదనే సంకల్పం వారిని అరుదైన వ్యక్తులలో ఒకరిగా మారుస్తాయి.

మీరు ఎప్పుడైనా అక్టోబర్‌లో పుట్టిన పిల్లలతో స్నేహం చేస్తే, వారికి అబద్ధాలు చెప్పకండి. నిజాయితీ అనేది వారు ప్రమాణం చేసి దాని కోసం జీవిస్తారు. మహాత్మాగాంధీ వలె నిజాయితీని అనుసరిస్తారు. అక్టోబర్‌లో జన్మించిన పిల్లలు అబద్ధాలు చెప్పడాన్ని సహించలేరు.
నిజాయితీ ఒక నిధి. జీవితంలో చాలా సార్లు మీరు నిజాయితీగా ఉన్నందుకు బాధపడ్డా, చివరికి మీరు దాని కోసం గౌరవించబడతారు.
 

అక్టోబర్‌లో పుట్టిన పిల్లలు చాలా సృజనాత్మకంగా ఉంటారు. ఈ పిల్లల సహజసిద్ధమైన ప్రతిభను వారిపై పని చేయడానికి వారికి అవకాశం ఇస్తే వారు ఉన్నత స్థాయికి చేరుకోవడానికి సహాయపడుతుంది. మీ పిల్లవాడు అక్టోబర్‌లో జన్మించినట్లయితే, వారిలో ఉన్న టాలెంట్ ని గుర్తించి.. ప్రోత్సహించాల్సిన బాధ్యత తల్లిదండ్రులపైనే ఉంటుంది.
 

click me!