సొంతిల్లు కట్టుకోవడం చాలా మంది కళ. ఆ కళను తీర్చుకోవాలని ప్రతి ఒక్కరూ ఆశపడతారు. అయితే.. ఈ క్రమంలో.. ఇంటిని కొనేటప్పుడు తొందరపాటు నిర్ణయాలు మాత్రం తీసుకోకూడదని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు.
ఇల్లు కొనేటప్పుడు ఏ ఏరియాలో ఉందని చూసుకోవడం ఎంత అవసరమో.. ఆ ఇంటికి మంచి వాస్తు ఉందో లేదో కూడా చేూసుకోవాలని చెబుతున్నారు.
తెలిసీ తెలియక వాస్తు విషయంలో చేసే కొన్ని పొరపాట్ల కారణంగా.. ఆ ఇంటి దంపతుల మధ్య లేని పోని గొడవలు వచ్చే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
మీరు తీసుకునే ఇంట్లో బెడ్రూమ్ కనుక ఆగ్నేయం వైపు ఉంటే.. ఆ ఇంటి దంపతులకు కనీసం ప్రశాంతత కూడా ఉండదట. ప్రతి విషయానికి గొడవలు పడుతూనే ఉంటారట.
అప్పటికే వారి మధ్య ఏవైనా మనస్పర్థలు ఉంటే.. ఆ ఆగ్నేయం దిక్కు కారణంగా గొడవలు మరింత ఎక్కువయ్యే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు.
ఇక కొత్తగా పెళ్లైన దంపతులు వాయూవ్యం దిశగా ఉండే ఇంట్లో అస్సలు ఉండకూడదు. వారికి అంత మంచిది కాదు. దాంపత్య బంధం బలపడానికి బదులు.. ప్రేమ తగ్గిపోయి.. బంధానికి బీటలు పడే అవకాశం ఉంది.
భార్యభర్తల మధ్య వైవాహిక బంధం బలంగా ఉండటానికి దంపతులు.. ఈ శాన్యం వైపు ఎలాంటి బరువు పెట్టకుండా ఖాళీగా వదిలేయాలి. అప్పుడే వారి సంసారం చక్కగా సాగుతుంది. వారి మధ్య అవగాహన కూడా బాగుంటుంది.
ఈశాన్య వైపున ఇంటి వంటగదిని ఎప్పుడూ నిర్మించవద్దు. ఈ కారణంగా, ఇంట్లో ఎప్పుడూ గొడవలు, ఎవరికో ఒకరికి అనారోగ్యం ఉంటుంది.
అంతేకాదు.. వంట గది ఈశాన్యం మూల ఉంటే.. ఆ ఇంట్లో ఏది నిలవదు. ఖర్చు పెరుగుతుంది. సరుకులు త్వరగా ఖర్చు అయిపోతాయి. నెగిటివ్ ఎనర్జీ ఎక్కువగా పెరుగుతుంది.
ఈశాన్య వైపున ఇంటి వంటగదిని ఎప్పుడూ నిర్మించవద్దు. ఈ కారణంగా, ఇంట్లో ఎప్పుడూ గొడవలు, ఎవరికో ఒకరికి అనారోగ్యం ఉంటుంది.
ఇంటి ముందు తలుపు దక్షిణ దిశగా ఉంటే,ఆ ఇంటి వంట గది మాత్రం పడమటి దిక్కు ఉండకూడదు.
ఇల్లు దక్షిణం వైపు, కిచెన్ పడమటి దిక్కు ఉంటే.. ఆ ఇంట్లో ఎప్పుడూ అశాంతే ఉంటుంది. కుటుంబసభ్యుల్లో సఖ్యత ఉండదు.