Mega Twins: రామ్ చరణ్ కవల పిల్లల జాతకం ఎలా ఉండనుంది? పండితులు ఏం చెబుతున్నారు

Published : Feb 05, 2026, 02:49 PM IST

Mega Twins: మెగా స్టార్ చిరంజీవి ఇంటికి వారసుడు వచ్చాడు. దీంతో వారి ఇంట్లో ఆనందం వెల్లివిరిసింది. రామ్ చరణ్ కి కొడుకు పుట్టినందుకు అభిమానులు సైతం సంబరాలు చేసుకుంటున్నారు. 

PREV
13
మెగా ట్విన్స్ జాతకం..

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఉపాసన దంపతులు ఇటీవల కవలలకు జన్మనిచ్చిన విషయం తెలిసిందే. కాగా.. వీరు జన్మించిన సమయం అద్భుతంగా ఉందని.. పిల్లలు మహా జాతకులు అవుతారు అంటూ జోతిష్యులు చెబుతున్నారు. వారి జాతకం ఎలా ఉండబోతుందో ఇప్పుడు చూద్దాం...

23
శ్రీరాముని నక్షత్రం..

రామ్ చరణ్ కవల పిల్లలు జనవరి 31వ తేదీ శనివారం జన్మించారు. వీరు జన్మించింది పునర్వసు నక్షత్రంలో.. ఇది అత్యంత శుభప్రదమైన నక్షత్రంగా భావిస్తారు. ఇది సాక్షాత్తు శ్రీరామ చంద్రుడు జన్మించిన నక్షత్రం ఇది. ఈ నక్షత్రంలో పుట్టిన వారికి ఆత్మవిశ్వాసం ఎక్కువ. చాలా దర్శబద్ధంగా ఉంటారు. జోతిష్య నిపుణుల ప్రకారం.. ఈ నక్షత్ర జాతకులు ఏదైనా పనిని మధ్యలో వదలకుండా పూర్తి చేస్తారు. ‘ పునర్వసు’ అంటే మళ్లీ ప్రకాశించడం అని అర్థం. ఇది వంశాభివృద్ధికి సంకేతం.

33
2. మిథున రాశి ,తుల లగ్నం - అద్భుత కలయిక

మిథున రాశి: ఈ రాశికి అధిపతి బుధుడు. దీనివల్ల పిల్లలకు అద్భుతమైన తెలివితేటలు, చురుకుదనం, కమ్యూనికేషన్ స్కిల్స్ ఉంటాయి.

తుల లగ్నం: తుల లగ్నానికి అధిపతి శుక్రుడు. ఇది విలాసవంతమైన జీవితానికి, కళాత్మక హృదయానికి చిహ్నం. మిథున రాశి, తుల లగ్నం కలయిక వల్ల వీరు సమాజంలో అందరినీ ఆకట్టుకునే ఆకర్షణీయమైన వ్యక్తిత్వాన్ని (Charismatic Personality) కలిగి ఉంటారు.

3. ఆంజనేయ స్వామి, లక్ష్మీ కటాక్షం

జనవరి 31 శనివారం కావడం, అమృత ఘడియల్లో జన్మించడం వల్ల వీరికి హనుమంతుని రక్షణ ఉంటుందని పండితులు చెబుతున్నారు.

నాయకత్వ లక్షణాలు: వీరిలో ధైర్య సాహసాలు మెండుగా ఉంటాయి. పదిమందిని నడిపించే నాయకత్వ లక్షణాలు సహజంగానే అబ్బుతాయి.

ధన యోగం: లక్ష్మీ కటాక్షం పుష్కలంగా ఉండటం వల్ల ఆర్థికంగా వీరు అత్యున్నత స్థాయికి చేరుకుంటారు. వీరి రాకతో మెగా కుటుంబంలో సంపద, కీర్తి మరింత పెరుగుతాయి.

4. మాట తక్కువ - చేత ఎక్కువ

ఈ జాతకంలో ఉన్న మరో గొప్ప లక్షణం "నిశ్శబ్ద విజయం". వీరు అనవసరంగా మాట్లాడకుండా, తమ పని ద్వారానే సమాధానం చెబుతారని, గొప్ప పరోపకారం చేసే గుణం (Philanthropy) వీరికి ఉంటుందని జ్యోతిష్యులు విశ్లేషిస్తున్నారు.

Read more Photos on
click me!

Recommended Stories