zodiac sign: రాశిచక్రం ప్రకారం మీ పిల్లలు మార్చుకోవాల్సినది ఇదే..!

First Published Jul 4, 2022, 1:28 PM IST

ప్రవర్తన మార్చుకోవడం అంటే ఎవరికైనా చాలా కష్టమైన విషయం. అయితే... చెడు ప్రవర్తన ఉన్నవారిని చాలా మంది మార్చే ప్రయత్నం చేస్తుంటారు. ఈ మార్పు చిన్న వయసులో మొదలైతే ఎక్కువ ప్రయోజనం ఉంటుంది.

ఒక్కొక్కరు ఒక్కో ప్రవర్తన కలిగి ఉంటారు. కొందరి ప్రవర్తన మంచిగా ఉంటే... మరి కొందరి ప్రవర్తన చెడుగా ఉండొచ్చు. మరొకరికి కోపం ఎక్కువగా ఉండొచ్చు. ఇలా ఒక్కొక్కరి వ్యక్తిత్వం ఒక్కోలా ఉంటుంది. అయితే... ప్రవర్తన మార్చుకోవడం అంటే ఎవరికైనా చాలా కష్టమైన విషయం. అయితే... చెడు ప్రవర్తన ఉన్నవారిని చాలా మంది మార్చే ప్రయత్నం చేస్తుంటారు. ఈ మార్పు చిన్న వయసులో మొదలైతే ఎక్కువ ప్రయోజనం ఉంటుంది. జోతిష్యశాస్త్రం ప్రకారం.. ఏ రాశి పిల్లలు ఏ ప్రవర్తన విషయంలో మార్పులు చేసుకోవాలో ఓసారి చూద్దాం..

1.మేష రాశి..
మేష రాశి పిల్లలకు కంగారు ఎక్కువ. ఈ కంగారులోనే ఈ రాశివారు ఎక్కువగా ఎదుటివారిని బాధ పెడుతూ ఉంటారు. అలా బాధ పెట్టిన తర్వాత.... తమ ప్రవర్తనను చూసి బాధపడుతూ ఉంటారు. అయ్యో.. అలా చేయకుండా ఉండాల్సింది అని బాధపడుతూ ఉంటారు. తర్వాత బాధ పడే బదులు.. ముందుగానే తేరుకొని.. తమ కంగారు ప్రవర్తనను మార్చుకోవడం మేలు.
 

2.వృషభ రాశి..
వృషభ రాశి పిల్లలు అన్ని విషయాల్లో మొండిగా ఉంటారు. చాలా కోపం కూడా ఎక్కువ. అయితే... ఈ రాశివారు తమ కోపం, మొండితనాన్ని తగ్గించుకోవడం ఉత్తమం. ఎదుటివారు చెప్పే విషయాలను, నిర్ణయాలను కూడా వినడం నేర్చుకోవాలి. ఎదుటివారి అభిప్రాయాలకు విలువ ఇవ్వడం ఈ రాశివారు నేర్చుకోవాలి.

3.మిథున రాశి..
మిథున రాశి వారు చాలా మాటకారి. ఆపుకోకుండా ఎంత సేపైనా మాట్లాడుతూనే ఉంటారు. ఇది మంచి విషయమే. కానీ... ఈ రాశివారు.. అప్పుడప్పుడు పుకార్లు కూడా పుట్టిస్తూ ఉంటారు. దాని వల్ల ఇతరులు సమస్యల్లో పడే అవకాశం ఉంది. కాబట్టి.. ఆ అలవాటు మార్చుకోవాలి.
 

4.కర్కాటక రాశి..
కర్కాటక రాశివారు చాలా ఎమోషనల్. ఏ విషయానికి ఎమోషనల్ అవ్వాలో.. దేనికి అవ్వకూడదో వీరికి సరిగా తెలీదు. రెండింటినీ బ్యాలెన్స్ ఎలా చేయాలో వీరికి అవగాహన ఉండదు.

5.సింహ రాశి..
సింహ రాశి పిల్లలు.. ప్రతి విషయంలోనూ తమను తాము గొప్పగా ఊహించుకుంటారు. అందంలో.. చదువులో.. ఇలా ఏదో ఒక విషయంలో తమను తాము గొప్పగా ఫీలౌతూ ఉంటారు. కాబట్టి.. ఆ వ్యక్తిత్వాన్ని వారు వదులుకోవాలి. దానికి బదులు అందరితోనూ ప్రేమగా ఉండటం నేర్చుకోవాలి. గర్వం వదిలిపెట్టాలి.

6.కన్య రాశి..
కన్య రాశి పిల్లలు దాదాపు తమ లక్ష్యం కోసం  కష్టపడుతూ ఉంటారు. ప్రతి విషయంలో తమ లక్ష్యాన్ని నిర్దిష్టం చేసుకొని దాని దిశగా కష్టపడుతూ ఉంటారు. దీనిలో ఎలాంటి తప్పు లేదు కానీ.. ఒక్కోసారి మాత్రం లక్ష్యం తప్పి ప్రవర్తిస్తూ ఉంటారు. లక్ష్యం అంటూ లేకుండా.. ఎలా పడితే అలా చేసుకుంటూ వెళ్లిపోతూ ఉంటారు. అలా లక్ష్యం లేకుండా చేయడం వల్ల వీరికి సరైన ఫలితం దక్కదు.
 

7.తుల రాశి..
తుల రాశి వారు దాదాపు అన్ని విషయాల్లో చాలా ప్రశాంతంగా ఉంటారు. కానీ ఒక్కోసారి మాత్రం చాలా భిన్నంగా ప్రవర్తిస్తారు.  వారి వ్యక్తిత్వం పూర్తిగా మారిపోయిందా అన్నట్లు వారు ప్రవర్తిస్తారు. అయితే.. చిన్నపిల్లల్లుగా ఉన్నప్పుడు ఇలా ఉండటం వల్ల పెద్ద సమస్య కాదు కానీ.... పెద్దగా అయిన తర్వాత ఇలా ఉంటే ఇబ్బంది పడే అవకాశం ఉంది.

8.వృశ్చిక రాశి..
వృశ్చిక రాశి పిల్లలు చాలా నిజాయితీగా, నిబద్దతగా ఉంటారు. అయితే.. అప్పుడప్పుడు మాత్రం.. వీరు ఇతరులను చూసి జెలసీగా ఫీలౌతూ ఉంటారు. అంతేకాదు.. ఒక్కోసారి వీరికి విపరీతమైన కోపం కూడా వస్తూ ఉంటుంది. ఈ వ్యక్తిత్వాన్ని వారు మార్చుకోవడం చాలా అవసరం.

9.ధనస్సు రాశి..
ధనస్సు రాశి పిల్లలు.. అందరి విషయంలో చాలా కన్సర్న్ గా ఉంటారు. అంతేకాదు అందరితోనూ సరదాగా, సాహాసాలు చేయడానికి ఇష్టపడతారు. అయితే... వీరికి నిలకడ అనేది ఉండదు. దేనీనీ పెద్దగా పట్టించుకోరు. ఈ విషయంలో మాత్రం వ్యక్తిత్వాన్ని మార్చుకోక తప్పదు.

10.మకర రాశి..
మకర రాశి పిల్లలు ప్రతి విషయంలోనూ రీజనబుల్ గా ఉంటారు. అయితే.. ఇది ఒక్కోసారి చాలా ప్రాక్టికల్ గా... ఎవరూ క్షమించరాని విధంగా ఉంటుంది. కాబట్టి.. దానిని మార్చుకోవాలి.

11.కుంభ రాశి..
కుంభ రాశి  పిల్లల్లో తిరుగుబాటుతనం చాలా ఎక్కువ. ఈ వ్యక్తిత్వాన్ని వీరు కచ్చితంగా మార్చుకోవాలి. లేదంటే.. అది వారి దారిలో చాలా సమస్యలను తీసుకువస్తుంది. అంతేకాదు ఒక్కోసారి వీరు చాలా మొండిగా... ఏదీ పట్టనట్లుగా కూడా ప్రవర్తిస్తూ ఉంటారు.
 

12.మీన రాశి..
మీన రాశి పిల్లలు చాలా సెన్సిటివ్. ఈ కారణంతో వీరు తమ కంటే ఇతరులకు ఎక్కువ ప్రాధానత్య ఇస్తూ ఉంటారు. ఈ క్రమంలో మీరు ప్రతి విషయంలోనూ హర్ట్ అవుతూ ఉంటారు. అందరూ వీరిని నెగ్లెక్ట్ చేస్తారు. కాబట్టి.. ఆ వ్యక్తిత్వాన్ని మార్చుకోవాలి.

click me!