దీపావళి పండుగ సందర్భంగా ప్రజలు కొత్త దుస్తులు కొనుగోలు చేయడం సర్వ సాధారణం. పండుగనాడు కొత్త దుస్తులు వేసుకోవడం ఫ్యాషన్ కాదు. దీని వెనుక మన సంస్కృతి, సంప్రదాయాలు దాగి ఉన్నాయి. కొత్త బట్టలు మంచి సంకేతం. ఇది సంతోషకరమైన రోజుల ప్రారంభాన్ని సూచిస్తుంది. మన రాశి, గ్రహం, మన జీవనశైలి, మనం ధరించే దుస్తులు అన్నీ ఒకదానికొకటి సంబంధించినవి. మీరు దీపావళి సందర్భంగా కొత్త దుస్తుల కోసం షాపింగ్ చేస్తుంటే, మీ రాశి ప్రకారం బట్టలు కొని వాటిని ధరించండి. దీని ద్వారా ఎక్కువ లాభం పొందవచ్చు.