ఇంట్లో ఈ మొక్కలను అస్సలు నాటకండి.. లేదంటే ఎన్నో కష్టాలు పడాల్సి వస్తది

First Published | Nov 9, 2023, 2:57 PM IST

వాస్తు శాస్త్రం ప్రకారం.. మొక్కలు నాటేందుకు కూడా నియమాలను పాటించాలి. సమయం, దిశకు అనుగుణంగా మొక్కలను నాటకపోతే మీరు జీవితంలో ఎన్నో ఇబ్బందులను ఎదుర్కోవాల్సి ఉంటుందంటున్నారు జ్యోతిష్యులు. 

వాస్తు శాస్త్రాన్ని నిర్లక్ష్యం చేస్తే ఇంట్లో ఎన్నో కలహాలు వస్తాయంటారు జ్యోతిష్యులు. వాస్తును ఫాలో కాకపోవడం వల్ల ఆర్థిక సమస్యలను కూడా ఫేస్ చేయాల్సి ఉంటుంది. కాగా వాస్తు నియమాలను పాటించడం వల్ల ఇంట్లో సుఖ సంతోషం, శ్రేయస్సు నెలకొంటాయి. అయితే చాలా సార్లు మనకు తెలియకుండానే ఇంట్లో కొన్ని రకాల మొక్కలను నాటుతుంటాం. కానీ ఇవి ఎన్నో సమస్యలకు దారితీస్తాయంటున్నారు జ్యోతిష్యలు. మరి ఇంట్లో ఎలాంటి మొక్కలను నాటకూడదో మనం ఇప్పుడు తెలుసుకుందాం.. 
 

ముళ్ల మొక్కలు

ఇంటి ముందు, లేదా ఇంటి వెనుక భాగంలో ముల్ల మొక్కలను అసలే నాటకూడదు. ఎందుకంటే వీటిని నాటడం వల్ల శత్రువుల భయం ఉంటుంది. అలాగే ఇంట్లో ధనం తగ్గుతుంది. అందుకే ఈ మొక్కను ఇంటిదగ్గర పొరపాటున కూడా నాటకూడదు.


రావిచెట్టు

రావిచెట్టును కూడా ఇంటిదగ్గర నాటకూడదంటారు. జ్యోతిష్యుల ప్రకారం.. ఇంటికి తూర్పు దిక్కున రావి చెట్టును నాటకూడదు. దీనివల్ల మీరు జీవితంలో ఆర్థిక సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. అందుకే మర్చిపోయి కూడా రావిచెట్టును నాటకండి.
 

Image: Getty

సైకమూరు చెట్టు

చాలా మంది తమకు తెలియకుండానే తమ ఇంట్లో sycamore చెట్టును కూడా నాటుతుంటారు. అయితే ఈ చెట్లను కూడా అశుభంగా భావిస్తారు. ఇండ్లల్లో సైకమూరు చెట్టును నాటకూడదని శాస్త్రాల్లో ఉంది. ఇలా చేయడం వల్ల నెగెటివ్ ఎనర్జీ పెరుగుతుందట. 
 

పనస చెట్టు

ఇంటి వెనుక లేదా దక్షిణ దిశలో పనస చెట్లను నాటకూడదని జ్యోతిష్యులు చెబుతున్నారు. ఎందుకంటే ఇంట్లో పనస చెట్టును నాటడం వల్ల ఆర్థిక పరిస్థితి మరింత దిగజారుతుందని వాస్తు నిపుణులు అంటున్నారు. అలాగే మీరు జీవితంలో ఎన్నో సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. అందుకే మర్చిపోయి కూడా వీటిని మీ ఇంట్లో నాటకండి. ఇంట్లో సుఖసంతోషాలు, సౌభాగ్యాలు, సంపదల కోసం ఇంటికి ఉత్తర దిశలో తులసి మొక్కను నాటండి.

Latest Videos

click me!