2023 లో మేష రాశివారి ఫలితాలు...!

First Published | Dec 1, 2022, 11:15 AM IST

నూతన సంవత్సరం 2023 లో మేష రాశివారి ఫలితాలు ఇలా ఉన్నాయి. మేష రాశివారికి ఈ ఏడాది ఆర్థిక వ్యవహారాల్లో చికాకులు పడినా లాభపడతారు. ఎక్కువగా ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు.   పుణ్యకార్యాచరణ లేదా పుణ్యక్షేత్ర సందర్శన  అవకాశం. 

Aries 2023

ఈ సంవత్సరంలో  రాశి చక్రంలోని పన్నెండు రాశులు వారికి   ఎలా ఉండబోతోంది?  ఎవరికీ శుభం జరుగుతుంది..  వారి అదృష్ట నక్షత్రాలు ఏమి చెబుతున్నాయి.  ఎవరికి కలిసి వస్తుంది...ఎవరు నష్టపోతున్నారు. మొత్తం రాశుల వారికి ఎలా ఉంటుందో  ఈ సంవత్సర ఫలాలు లో తెలుసుకుందాం.

ఈ ఫలితాలు అనేవి అన్నివర్గాలకు చెందిన వారిని దృష్టిలో పెట్టుకొని తెలియజేస్తున్నాము. మీకు సంపూర్ణమైన ఫలితాలు తెలుసుకోవాలని ఆసక్తి మీకుంటే మీ పుట్టిన తేది ఆధారంగా వ్యక్తిగత జాతక పరిశీలనను అనుభవజ్ఞులైన జ్యోతిష పండితులను సంప్రదించి వారి ద్వారా మీ జాతక చక్రం వేయించుకుని విషయం తెలుసుకుని తగిన రేమిడిలను ఆచరిస్తే ఫలితాలు అనుకూలంగా అనిభవంలోకి వస్తాయి.

Vijaya Rama krishna


జోశ్యుల విజయ రామకృష్ణ - ప్రముఖ  జ్యోతిష, జాతక, వాస్తు సిద్దాంతి, స్మార్త పండితులు - గాయిత్రి మాత ఉపాసకులు.(తిరుమల తిరుపతి దేవస్దాన పూర్వ విధ్యార్ది)  'శ్రీ మాతా' వాస్తు... జ్యోతిష్యం.   - ఫోన్:   8523814226  (సంప్రదించు వారు వాట్సప్ లో డిటేల్స్ పెట్టండి ...సాయింత్రం నాలుగు తర్వాత ఫోన్ చేయవలెను)


  మేషం (అశ్విని 1,2,3,4 భరణి 1,2,3,4 కృత్తిక 1):

మేషరాశి వారికి  ఈ  సంవత్సరం అంతా ప్రోత్సాహకరంగానే ఉంటుంది. గతంలో కంటే ఎక్కువ అనుకూల పరిస్థితులు కనపడుతున్నాయి.  . శుభకార్యముల నిమిత్తం తరచుగా ధనవ్యయం అయినా కలిసి వస్తుంది.  ముఖ్యమైన విషయాల్లో  ఇతరుల మీద ఆధారపడని వారికి సక్సెస్ శాతం ఎక్కువగా కనపడుతుంది. అలాకాని వారు ఈ సంవత్సరం అందరి వద్దా అనవసరమైన సలహాలు తీసుకొని, చికాకులు పడుతుంటారు.  కుటుంబ సభ్యులతో నష్టాలు ఉండవుగాని, మనస్పర్థలకు అవకాశం ఎక్కువ. జాగ్రత్తగా ఉండాలి. ఆర్థిక వ్యవహారాల్లో చికాకులు పడినా లాభపడతారు. ఎక్కువగా ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు.   పుణ్యకార్యాచరణ లేదా పుణ్యక్షేత్ర సందర్శన  అవకాశం.  దైనందిన కార్యకలాపాలు అస్తవ్యస్తంగా పూర్తి అవుతాయి. కోర్టు వ్యవహారాల్లో నమ్మకద్రోహానికి గురవుతారు. ఉద్యోగంలో స్థానచలన ప్రయత్నాలలో ప్రత్యేక జాగ్రత్తలు అవసరం. వ్యాపారులకు సంవత్సరం అంతా హెచ్చుతగ్గులు తప్పవు. లాభాలు తక్కువ.  ఈ సంవత్సరం భార్యాభర్తల మధ్య సఖ్యత మెరుగ్గా ఉంటుంది. 

2023 లో వృషభ రాశివారి ఫలితాలు....!
 

జనవరి 2023

ఈ నెలలో  మీరు కోర్టు కేసులలో విజయం పొందవచ్చు. హడావిడిగా వచ్చి తప్పుడు నిర్ణయం తీసుకోవచ్చు కాబట్టి ఏం చేసినా జాగ్రత్తగా చేయండి. ఎవరైనా మీకు వ్యతిరేకంగా కుట్ర చేయవచ్చు, కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ప్రేమ వ్యవహారాలకు సంబంధించి మీ దూరం పాటించండి, లేకపోతే, మీరు కొన్ని ఇబ్బందుల్లో పడవచ్చు. కాలానుగుణంగా ఉద్యోగంలో మిమ్మల్ని మీరు మార్చుకోండి, లేకపోతే మీరు వెనుకబడిపోతారు. అధికారులు మీ పట్ల అసంతృప్తిగా ఉండవచ్చు.

లవ్ లైఫ్ : ఈ నెలలో ఇగోలతో కొద్ది పాటి గొడవలు జరిగినా, చివరకు ఒకటి అవుతారు . కాకపోతే తెగేదాకా లాగద్దు. పార్టనర్స్ విషయంలో నమ్మకం అవసరం. పాత విషయాలు తవ్వద్దు. అవే వివాదాలకు కారణం అవుతాయి.   

ఉద్యోగం-వ్యాపారం: ఈ నెలలో, సహోద్యుల నుండి సహాయం అందుతుంది. అయితే, కొన్ని సందర్భాల్లో, మీరు అధికారుల తో జాగ్రత్తగా ఉండండి. వ్యాపారస్తులు కొద్దిపాటి ఇబ్బందులు. జాగ్రత్తగా ఉండండి.  శ్రమ ఎక్కువగా..ఫలితం తక్కువ. డబ్బు లావాదేవీలలో నిర్లక్ష్యం మిమ్మల్ని సమస్యల్లోకి తోస్తుంది..

 ఆరోగ్యం: ఆరోగ్యం విషయంలో అత్యంత  జాగ్రత్తగా ఉండాల్సిన సమయం. చల్లని పదార్దాలకు దూరంగా ఉండండి. అలాగే ఫాస్ట్ ఫుడ్ ని కొంతకాలం ఎవాయిడ్ చేయండి. లేకపోతే ఈ నెలలో కొన్ని దీర్ఘకాలిక వ్యాధులు మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాసం ఉంది.  

ఫిబ్రవరి 2023

ఈ నెలలో కాస్త జాగ్రత్తగా ఉండాలి. ఆదాయం బాగున్నా... ఉద్యోగాల్లో స్థిరం తగ్గుతుంది. ప్రమోషన్‌లు దగ్గరకు వచ్చి మిస్‌ అవుతాయి. మీకు శ్రమకు తగిన లాభం, శ్రమకు తగిన గుర్తింపు అందవు. అధికారుల నుంచి సహకారం తక్కువగా ఉంటుంది. ఆరోగ్యపరంగా పెద్ద ఇబ్బందులేవీ ఉండవు. అయితే మానసిక రుగ్మతలు ఉన్నవారు తరచుగా యిబ్బందులకు లోనవుతారు.  


లవ్ లైఫ్: అన్ని విషయాల్లో మీ లైఫ్ పార్టనర్ మీకు సపోర్ట్ గా నిలుస్తుంది. ఈ నెలలో, మీరు మీ భాగస్వామి కోసం ప్రత్యేక టైమ్  వెచ్చించేందుకు ప్లాన్ చేసుకోవచ్చు. అయితే ఇక్కడో జాగ్రత్త తీసుకోవాలి. మీ ప్రేమ భాగస్వామితో మీ వృత్తి జీవితం గురించి ఎక్కువగా మాట్లాడకండి. సమస్యలు తెచ్చుకోకండి.

ఉద్యోగం-వ్యాపారం: ఈ నెల ఉద్యోగస్దులకు ఓ మాదిరిగా  ఉంటుంది. మీరు మీ శక్తి, సామర్థ్యానికి అనుగుణంగా పని చేసినా  చెప్పుకోదగ్గ గుర్తింపు రాదు. వ్యాపారంలో మీ పార్టనర్స్ నుంచి ఊహించని ఒత్తిడి ఉండవచ్చు. అయితే అదృష్టం ఏమిటంటే.. నెలాఖరులోగా పెద్ద డీల్ లేదా వ్యాపార ఒప్పందానికి అవకాశం ఉంది.

ఆరోగ్యం: మీరేదన్నా మందులు వాడుతూంటే అసలు నిర్లక్ష్యం వద్దు. దీర్ఘకాలిక వ్యాధులు మిమ్మల్ని కొంత ఇబ్బంది పెడతాయి. ఆందోళన మిమ్మల్ని అనారోగ్యం పాలు చేసేలా ప్రేరేపిస్తుంది. మంచి నిద్ర, ఆహారానికి ప్రయారిటీ ఇవ్వండి.

Astro

మార్చి 2023

విదేశీ నివాస ప్రయాణ ప్రయత్నాలలో ఉంటే కనుక చాలా కష్టం,  ఇబ్బందులతో పనులు పూర్తి అవుతాయి. షేర్‌ వ్యాపారులకు, ఫైనాన్స్‌ వ్యాపారులకు ఈ నెల  చాలా చికాకులు ఎదురవుతాయి. విద్యార్థులు జాగ్రత్తగా ఉండాలి. మీ ఇతర వ్యాపకాలు మిమ్మల్ని దెబ్బ తీస్తాయి.   రైతులకు శ్రమ ఎక్కువ అవుతుంది. గర్భిణీస్త్రీలు ఈ  నుంచి బహు జాగ్రత్తలు పాటించాలి. ఒత్తిడికి లోనయ్యే అవకాశాలు ఎక్కువ. 

లవ్ లైఫ్ : ఈ నెలలో మీ లైఫ్ పార్టనర్ తో కాస్త జాగ్రత్తగా ఉండాలి. లేకపోతే అపార్దాలకు మీరు చేతులారా చోటిచ్చినట్లు అవుతుంది. మీ పార్టనర్ అభిప్రాయాలకు, భావాలను గౌరవం ఇవ్వండి.  అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. మీ ఆలోచలను మీ భాగస్వామిపై రుద్దడం మానుకోండి.

ఉద్యోగం-వ్యాపారం: ఈ నెల  ఉద్యోగం విషయంలో మీరే చేసే ప్రయత్నాల్లో  విజయం సాధించే అవకాశాలు ఉన్నాయి. గతంలో కలిసిన పరిచయాలు ఇప్పుడు కలిసి వస్తాయి. వ్యాపారంలో మాత్రం ఇబ్బందికర పరిస్దితులు కనిపిస్తున్నాయి. లక్ష్మీ అష్టోత్తరం చేయండి.  ఆందోళన తొలిగించుకోండి.

ఆరోగ్యం: ఈ నెల మొత్తం మీ ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించాలి. ఫాస్ట్ ఫుడ్ ఎక్కువగా తినవద్దు. ఉదర సంభంథ వ్యాధులు వచ్చే అవకాశం ఉంది. కుటుంబ సభ్యుల అనారోగ్యం కారణంగా మీ వృత్తి, వ్యాపారాలలో  ఒత్తిడి పెరుగుతుంది.
 

ఏప్రియల్  2023

ఈ నెలలో మేష రాశి వారికి ఆర్థిక వెసులుబాటు తగ్గుతుంది. కుటుంబ విషయాల్లో మంచి పరిణామములు చోటు చేసుకుంటాయి. అనవసరమైన వస్తువుల కొనుగోలు, ప్రయణాల కోసం ఖర్చు ఎక్కువగా ఉంటుంది. రాహుకేతు శాంతి చేయించండి. ఉద్యోగం ఒత్తిడితో ఉంటుంది. దైనందిన కార్యకలాపాలు అస్తవ్యస్తంగా ఉండే అవకాసం ఉంది.

లవ్ లైఫ్ :మీలైఫ్ పార్టనర్ మీకు అన్ని విధాలా అనుకూలంగా ఉంటుంది. మీరు చేసే పనులుకు సహకారం అందిస్తుంది.  ఎలాంటి వివాద స్థితికి సంబంధించిన సూచన లేదు. జీవితం ఆనందమయంగా ఉంటుంది. ప్రేమ యాత్రలకు ఇది సరైన సమయం.

ఉద్యోగం-వ్యాపారం: ఈ నెల ఉద్యోగంలో జాగ్రత్తగా ఉండాలి. పై అధికారులతో  వివాదాలతో ప్రారంభం కావచ్చు. వ్యాపారస్తులకు టైమ్ కలిసి వస్తుంది. పూర్తి  అనుకూలంగా ఉంటుంది. కొత్త ఎగ్రిమెంట్స్, డీల్స్ చేస్తారు.

ఆరోగ్యం: ఆరోగ్యపరంగా మీకు కలిసొచ్చే సమయం.  అంతకు ముందు నెలలో ఎదుర్కొన్న వ్యాధుల నుండి ఉపశమనం పొందుతారు. అలాగని ఆరోగ్యం విషయంలో అజాగ్రత్తగా ఉండకండి.
 

Aries

మే  2023

ఈ నెలలో తెలియని పని ఒత్తిడి పెరుగుతుంది. వృత్తి, కుటుంబ విషయాలకు సమన్యాయం చేయలేక బాగా చికాకుకు గురి అవుతారు. కానీ డబ్బు పరంగా కలిసి వస్తుంది. పాత అప్పులు తీరుస్తారు. ఈ క్రమంలో దగ్గరైన బంధువుల ద్వారా, స్నేహితుల ద్వారా ఏ సలహాలూ తీసుకోవద్దు. ఓర్పు చాలా అవసరం. ఆరోగ్య విషయంలో బహు జాగ్రత్తలు పాటించాలి. ఇతరుల వ్యవహారాల్లోనూ కలుగజేసుకోవద్దు. మీ గ్రహ స్దితులు మిమ్మల్ని సమస్యల్లోకి తోసేస్తాయి. 

లవ్ లైఫ్ : మీ లైఫ్ పార్టనర్ కు మీ మీద ఎక్సపెక్టేషన్స్ పెరుగుతాయి. ఈ క్రమంలో మీరు నోరు జారితే ... ఆ తర్వాత గొడవలు వచ్చేస్తాయి.  ఏ విషయంలోనైనా వివాదాలు తలెత్తే అవకాశం ఉంది కాబట్టి వాటిని లాగకండి..అక్కడితో ముగించే ప్రయత్నం చేయండి. మనశ్సాంతి పోగొట్టుకోకండి.

ఉద్యోగం-వ్యాపారం:  ఈనెల మీ ఉద్యోగ జీవితంలో కీలక మార్పులు. ఉద్యోగంలో కొత్త ప్రాజెక్టులు, బాధ్యతలు వెతుక్కుంటూ వస్తాయి. అధికారులు మిమ్మల్ని మెచ్చుకుంటారు. మీరు ఏదైనా ప్రతిష్టాత్మకమైన పనిలో మీ పై అధికారులు మిమ్మల్ని వినియోగించుకుంటారు.

ఆరోగ్యం: ఈ నెల కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. నెల మధ్యలో కొన్ని రోజులు మీరు ఆరోగ్యం పట్ల అప్రమత్తంగా ఉండాలి. ఈ సమయంలో మీరు ఏదైనా ఇన్ఫెక్షన్ లేదా అలెర్జీకి బాధితులుగా మారవచ్చు.
 

Aries Zodiac

జూన్   2023

ఈ నెల మీకు  చాలా మంచి కాలం. క్రమంగా ఓర్పుతో సర్వకార్యసాధన చేస్తారు. ప్రధానంగా కుటుంబ విషయంలో ఇబ్బందులు లేకుండా ఉంటాయి. కొన్ని గ్రహాలు బాగాలేకపోయినా  ఈ కాలంలో కూడా మిగిలిన గ్రహాల అనుకూలత దృష్ట్యా ఆర్థిక, ఆరోగ్య విషయాలలో మంచి అనుకూలస్థితి సాధిస్తారు. ఋణ సదుపాయం బాగుంటుంది. ప్రత్యేక జాగ్రత్తలతో కాలం సానుకూలం చేసుకుంటారు. ఎవరి మీదా ఆధారపడకుండా చేసే పనులు మిమ్మల్ని విజయపథంలోకి తీసుకువెడతాయి.

లవ్ లైఫ్ : మీ లైఫ్ పార్టనర్ తో ...మీరు గడిపే క్షణాలు అద్బుతంగా మారబోతున్నాయి. మీ ఇద్దరి మధ్యా ప్రేమ మరియు సామరస్యం అద్భుతంగా ఉంటుంది. మీ పార్టనర్ తో కలిసి కొత్త ఆలోచనలు, జీవితంలో కొన్ని మార్పులకు దారి తీసే అవకాశం కూడా ఉంది. ఈ నెలలో మీ లవ్ లైఫ్ బాగుంటుంది.

ఉద్యోగం-వ్యాపారం: ఈ నెలలో  మీరు ఉద్యోగంలో అన్ని వైపుల నుండి,అందరి నుంచి సపోర్ట్ పొందుతారు. మీరు ఆదాయ మార్గాలను కనుగొంటారు. దాంతో మీకు ఉత్సాహంగా జీవితం గడుస్తుంది.  ఈ నెలలో మీరు వ్యాపారంలో చాలా మంచి లాభాలను పొందుతారు.

ఆరోగ్యం: ఆరోగ్య పరంగా, మీరు ఈ నెలలో పాదాలకు సంభందించిన  సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుంది. కొందరికి  కాలేయంలో ఇన్ఫెక్షన్ లేదా నొప్పి ఉండే అవకాసం ఉంది. జాగ్రత్తగా ఉండాలి. ఏదీ అతి చేయవద్దు. 

aries

జూలై   2023

ఈ నెలలో మొదట్లో సాదా సీదాగా అనిపించినా క్రమంగా చాలా మంచి ఫలితాలు అందుకుంటారు. ప్రతిరోజూ అధిక శ్రమ ఉంటుంది. అయితే శ్రమకు తగినట్లు లాభదాయకంగా ఉంటుంది. ప్రధానంగా మీ విజ్ఞానం మీకు గౌరవం తెచ్చి పెడుతుంది. మీ స్నేహితుల వల్ల లాభం చేకూరుతుంది. బంధువుల నుంచి అనుకోని లాభాలు ఉంటాయి. దూర ప్రయాణాలు, అలంకరణ వస్తువుల కొనుగోలులో ఖర్చు పెరుగుతుంది. కనబడుతున్న అన్ని అంశాలూ నిజం కాదు అని గ్రహించండి. ప్రతి విషయంలోనూ స్వయం శోధన అవసరం. ఈ నెలలో వృత్తి వ్యవహారాలు జాగ్రత్తగా చేసుకోవాలి

లవ్ లైఫ్ : ఈ నెల మీ లవ్ లైఫ్ సోసోగా ఉంటుంది. మీ పార్టనర్ తో మీరు గడిపే సమయం తక్కువగా ఉంటుంది. మీ వైవాహిక జీవితం మీద గ్రహాల వ్యతిరేక ప్రభావం ఉంది. కాబట్టి  మీరు కొన్ని విషయాలలో మీ లైఫ్ పార్టనర్  వ్యతిరేకతను భరించవలసి ఉంటుంది. తొందరపడవద్దు.

ఉద్యోగం- వ్యాపారం: ఉద్యోగ ప్రదేశంలో కొన్ని విభేధాల. మీకు, మీ  సహోద్యోగులు మరియు అధికారుల మధ్య సైద్ధాంతిక విభేదాలు ఉండవచ్చు. ఆఫీస్ లో వాతావరణం కొంత ఉద్రిక్తంగా ఉండవచ్చు. మీరు మీ స్దాయిని దాటి ముందుకు వెళ్లకండి.  వ్యాపారంలో సమస్యలు ఉంటాయి. తెలివిగా దాటాలి. 

ఆరోగ్యం: ఆరోగ్యానికి ప్రత్యేకమైన సూచనలు అయితే లేవు.  నోరు  లేదా దంతాలకు సంబంధించిన ఏదైనా సమస్య రావచ్చు. అంతకు మించి అనారోగ్యాలు లేవు. మీరు తీసుకునే చిన్న చిన్న  జాగ్రత్తలే మీకు పెద్ద రక్ష 
 

Aries

ఆగస్ట్    2023

ఈ నెల ప్రత్యేకమైనది కాదు. మీకు సాధారణ స్థాయి ఫలితాలు ఉంటాయి. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు వహిస్తారు. కుటుంబ విషయాలు చాలావరకు మంచి ఫలితాలతో ఉంటాయి. ఖర్చులను నియంత్రించగలుగుతారు. ఉద్యోగం, వ్యాపారం అంతా సాధారణ స్థాయి ఫలితాలతో ఉంటాయి. అభివృద్ధిపథంలో ప్రయాణం సాగుతుందనే చెప్పాలి.  

లవ్ లైఫ్ :  మీరు మీ లైఫ్ పార్టనర్  నుండి ప్రేమతో కూడిన గిప్ట్ లు పొందవచ్చు. కొన్ని సందర్భాల్లో ఇద్దరి మధ్యా చిన్నచిన్న విభేధాలు, స్వల్ప ఉద్రిక్తత ఉండవచ్చు కానీ మొత్తం మీద సమయం అనుకూలంగా ఉంటుంది.

ఆరోగ్యం: ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు అవసరం.  అనవసర విషయాల వలన మానసిక చికాకులు ఉంటాయి. ఆరోగ్య విషయమై కొత్త ప్రయోగాలు ఏమీ చేయవద్దని సూచన.

ఉద్యోగం- వ్యాపారం:  ఉద్యోగస్దులు మితభాషణ మంచిది. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎంత లాభదాయకంగా ఉన్నా, లేకున్నా వ్యాపారులు చాలా జాగ్రత్తలు వహిస్తూ వ్యాపారాలు చేయాలి. వృత్తి ఉద్యోగాల్లో అధికారుల నుంచి తరచుగా చికాకులు వస్తుంటాయి. ఆర్థికంగా ఖర్చులు నియంత్రించలేని స్థితి ఉంటుంది. 

సెప్టెంబర్    2023

ఈ నెలలో మీకు అంతకు ముందు ఉన్నట్లుగా డబ్బులు ఆడవు. ఆర్థిక వెసులుబాటు తగ్గుతుంది. అయితే  కుటుంబ విషయాల్లో మంచి పరిణామములు చోటు చేసుకుంటాయి. అలంకరణ వస్తువుల కొనుగోలు, ప్రయణాల కోసం ఖర్చు ఎక్కువగా ఉంటుంది.   ఉద్యోగం ఒత్తిడితో ఉంటుంది. దైనందిన కార్యకలాపాలు అస్తవ్యస్తంగా ఉంటాయి.

లవ్ లైఫ్ :   మీ జీవిత భాగస్వామిని మచ్చిక చేసుకోండి. ఈ క్రమంలో అంతకు ముందు ఉన్న సమస్యలు, అన్ని అంశాలలోనూ అవరోధాలు తొలగుతాయి. కుటుంబం జీవితంలో చికాకులు వుంటాయి. తెలివిగా సరి చేసుకుంటారు. పిల్లల విషయంలో మంచి నిర్ణయాలు తీసుకుంటారు.

ఉద్యోగం- వ్యాపారం:  ఉద్యోగాలలో  క్రమక్రమంగా పని ఒత్తిడి పెరుగుతుంది.పని విషయంలో అసౌకర్యాలు ఎక్కువ అవుతాయి. ఇతరులను మచ్చిక చేసుకునేందుకు ధనవ్యయం ఎక్కువవుతుంది. అధికారులతో ఒత్తిడి పెరుగుతుంది. అనవసర విషయాల వలన మానసిక చికాకులు ఉంటాయి. వ్యాపారస్దులు ఆలోచించి స్టాక్ పెట్టుకోండి. గతంలో కలిసి వచ్చిందే ఇప్పుడూ కలిసి వస్తుంది...లాభాలు తెచ్చిపెడుతుందని భావించవద్దు.

ఆరోగ్యం: ఈ నెలలో ఆరోగ్యం బాగున్నా, అజీర్తి సమస్యలు వచ్చే అవకాసం ఉంది.  ఆహారం విషయంలో ప్రత్యేక శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. ఉదర సంభందం అనారోగ్యాలు , అరుగదల తగ్గటం,  వాంతులు వంటివి  ఉండవచ్చు.

అక్టోబర్    2023

 ఈ  నెల కాస్త స్నేహితులతో, సన్నిహితులతో వివాదాలు తలెత్తే అవకాసం ఉంది.  కాబట్టి ప్రతిపనీ స్వయంగా చేసుకోవడం మంచిది. కుటుంబ సభ్యులతో నష్టాలు ఉండవుగాని, మనస్పర్థలకు అవకాశం ఎక్కువ.ఎక్కువగా సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. చాలాకాలం పుణ్యకార్యాచరణ లేదా పుణ్యక్షేత్ర సందర్శన మీద దృష్టి ఉంచే అవకాశం ఉంటుంది. 

లవ్ లైఫ్ :  గతంలో కంటే మీ లైఫ్ పార్టనర్ తో  ఎక్కువ అనుకూల పరిస్థితులు ఉంటాయి.  మీకు బాగా అనుకూలంగా అన్ని కలిసివస్తాయి. మీ మాటే చెల్లుబాటు అవుతుంది. శుభకార్యముల నిమిత్తం తరచుగా ప్రయాణాలు, ఆనందంగా గడుపుతారు. మీ లైఫ్ పార్టనర్ పై  మీద ఆధారపడని వారికి విజయావకాశాలు ఎక్కువగా ఉంటాయి. అనవసరమైన సలహాలు తీసుకొని, చికాకులు పడకండి.

ఉద్యోగం- వ్యాపారం:  ఉద్యోగంలో స్థానచలన ప్రయత్నాలలో ప్రత్యేక జాగ్రత్తలు అవసరం. వ్యాపారులకు సంవత్సరం అంతా హెచ్చుతగ్గులు తప్పవు. లాభాలు తక్కువ.  ఆర్థిక వనరులు వచ్చే మార్గం చిన్నదిగాను ఖర్చు అయ్యే మార్గం పెద్దదిగా ఉన్న కారణం చేత ఆర్థిక వ్యవహారాల్లో చికాకులు పడతారు. 

ఆరోగ్యం: రాత్రిళ్లు ఎక్కువసేపు  అనవసర ఆలోచనలు, వృథా కాల క్షేపాల వల్ల ఆరోగ్య పరంగా ఇబ్బందులు ఎదురవుతాయి.  మానసిక రుగ్మతలు తలెత్తుతాయి. ఆరోగ్యపరంగా ఇబ్బందులు వుంటాయి. ధనవ్యయం ఎక్కువగా వుంటుంది.

నవంబర్    2023

నెల మొదట్లోకాస్త ఇబ్బంది కరంగా అనిపించినా క్రమంగా చాలా మంచి ఫలితాలు అందుకుంటారు. ప్రతిరోజూ అధిక శ్రమ ఉంటుంది. అయితే శ్రమకు తగినట్లు లాభదాయకంగా ఉంటుంది. ప్రధానంగా మీకు అన్ని విషయాలపై ఉన్న అవగాహన  మీకు గౌరవం తెచ్చి పెడుతుంది. మిత్రలాభం చేకూరుతుంది. అనుకోని లాభాలు ఉంటాయి. దూర ప్రయాణాలు, అలంకరణ వస్తువుల కొనుగోలులో ఖర్చు పెరుగుతుంది. కోర్టు వ్యవహారాల్లో సెటిల్‌మెంట్‌ ధోరణి చాలా లాభం. తరచుగా బుద్ధిమాంద్యానికి లోనవుతారు. వీలయినంత వరకు దూరప్రాంత ప్రయాణాలను విరమించడం శ్రేయస్కరం. 

లవ్ లైఫ్ :  మీ లైఫ్ పార్టనర్ తో  విభేధాలపుతో తరచుగా మానసిక ఒత్తిడికి లోనవుతారు.  కాకపోతే అన్ని పనులూ సక్రమంగా జరుగుతాయి. కొన్ని విషయాలలో లాభాలు ఉంటాయి. మితభాషణ అవసరం. శుభకార్యాల్లో పాల్గొంటారు. అన్ని పనులూ స్వయంగా చేసుకోవడం మంచిది.

ఆరోగ్యం:  ఈ నెలలో నేత్ర సమస్యలు ఎక్కువ కాగలవు. జీర్ణ సంబంధ, చర్మ సంబంధ సమస్యలు వున్న ఈ నక్షత్రం వారు ఎక్కువగా చికాకులు పొందే అవకాసం.. చిన్న అనారోగ్యం అయినా దాన్ని సరిగ్గా తగ్గించుకోకపోతే పెద్దగా మారి ఇబ్బంది పెడుతుంది.  

ఉద్యోగం- వ్యాపారం:  ఉద్యోగంలో అధికారులు తరచుగా ఆగ్రహిస్తారు. ఎవరినీ నమ్మి పనులు చేయవద్దు.  తెలివితేటలు ప్రదర్శించి ఉద్యోగ సమస్యల నుంచి గట్టెక్కుతారు. ఆరోగ్య సమస్యలు ఉన్నవారు టెన్షన్ పడద్దు.  వ్యాపారస్దులు ఎవరినీ అతిగా నమ్మద్దు. చాలా  జాగ్రత్తగా ఉండాలి.
 


డిసెంబర్    2023

ఈ నెలలో మేష రాశి వారికి క్రమంగా శుభపరిణామాలు పెరుగుతాయి. ఆదాయం బాగా వుండి ధనవ్యయం అధికంగా చేస్తుంటారు. పిల్లల విద్య వివాహ ప్రయత్నాలు, ఉద్యోగంలో సక్సెస్‌ వార్తలు ఆనందం కలిగిస్తాయి. తరచుగా పుణ్యక్షేత్ర సందర్శనలు, దాన ధర్మాలు చేస్తారు. మితభాషణ, ఓర్పు, స్నేహం ప్రదర్శించి తలపెట్టిన పనుల్లో విజయం సాధిస్తారు. అధికారుల అండదండలు బాగా ఉంటాయి. గురువులను, పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు. పెద్దల ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది.

లవ్ లైఫ్ :  గ్రహసంచారం అనుకూలంగా ఉండటంతో మీ లవ్ లైఫ్ అనుకూల ఫలితాలు ఇస్తుంది. అందువలన ఎంతటి సమస్యలనైనా సులువుగా దాటవేయగలుగుతారు. ప్రతి విషయంలోనూ ఓర్పు, నేర్పు ప్రదర్శిస్తారు. మీ ఇద్దరి మధ్యా   లావాదేవీలు ఇబ్బంది లేకుండా సాగిపోతాయి. వైవాహిక  సౌఖ్యం ఉంటుంది.

ఆరోగ్యం:   జీర్ణ సంబంధ, చర్మ సంబంధ సమస్యలు వున్న ఈ నక్షత్రం వారు ఎక్కువగా చికాకులు పొందుతారు.  భోజనం, స్నానం వంటి నిత్యకృత్యాలు కూడా కాలంతో సంబంధం లేకుండా ఉంటాయి. ఆరోగ్యం, ఋణ విషయంలో జాగ్రత్తలు పాటించండి. మనశ్శాంతిగా ఉండడం కోసం ప్రత్యేక సాధన అవసరం.

ఉద్యోగం- వ్యాపారం:   స్థిరాస్తి సమస్యలను త్వరగా సెటిల్‌మెంట్‌ చేసుకోకపోవడం శాపంగా మారుతుంది.  చాలా కాలంగా ఎదుర్కొంటున్న వృత్తి సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. అయితే 15వ తేదీ తర్వాత గ్రహాలు అనుకూలంగా లేనందున ఉద్యోగ  విషయంలో జాగ్రత్తలు అవసరం.
 

Latest Videos

click me!