మాస ఫలాలు: ఓ రాశి వారికి ఈనెలలో ఊహించని ధనలాభం

First Published Dec 1, 2022, 10:00 AM IST

డిసెంబర్ నెల రాశిఫలాలు  ఇలా ఉన్నాయి. ఓ రాశివారికి  ఈ నెల  బంధుమిత్రులతోటి కలహాలు ఏర్పడును. అనవసరమైన ప్రయాణాలు ఏర్పడతాయి. సమాజం నందు మీ గౌరవ ప్రతిష్టలు తగ్గుతాయి

ఈ నెలలో  రాశి చక్రంలోని పన్నెండు రాశులు వారికి ఈ వారం ఎలా ఉండబోతోంది?  ఎవరికీ శుభం జరుగుతుంది..  వారి అదృష్ట నక్షత్రాలు ఏమి చెబుతున్నాయి.  ఎవరికి కలిసి వస్తుంది...ఎవరు నష్టపోతున్నారు. మొత్తం రాశుల వారికి ఎలా ఉంటుందో  ఈ మాస ఫలాలు లో తెలుసుకుందాం.

ఈ ఫలితాలు అనేవి అన్నివర్గాలకు చెందిన వారిని దృష్టిలో పెట్టుకొని తెలియజేస్తున్నాము. మీకు సంపూర్ణమైన ఫలితాలు తెలుసుకోవాలని ఆసక్తి మీకుంటే మీ పుట్టిన తేది ఆధారంగా వ్యక్తిగత జాతక పరిశీలనను అనుభవజ్ఞులైన జ్యోతిష పండితులను సంప్రదించి వారి ద్వారా మీ జాతక చక్రం వేయించుకుని విషయం తెలుసుకుని తగిన రేమిడిలను ఆచరిస్తే ఫలితాలు అనుకూలంగా అనిభవంలోకి వస్తాయి.

Vijaya Rama krishna

జోశ్యుల విజయ రామకృష్ణ - ప్రముఖ  జ్యోతిష, జాతక, వాస్తు సిద్దాంతి, స్మార్త పండితులు - గాయిత్రి మాత ఉపాసకులు.(తిరుమల తిరుపతి దేవస్దాన పూర్వ విధ్యార్ది)  'శ్రీ మాతా' వాస్తు... జ్యోతిష్యం.   - ఫోన్:   8523814226  (సంప్రదించు వారు వాట్సప్ లో డిటేల్స్ పెట్టండి ...సాయింత్రం నాలుగు తర్వాత ఫోన్ చేయవలెను)

Zodiac Sign

మేషం (అశ్విని 1,2,3,4 భరణి 1,2,3,4 కృత్తిక 1):

ఈ మాసం సామాన్యంగా ఉంటుంది. ఉద్యోగులకు అనుకూలమైన మార్పులు. ప్రయత్నించిన పనులలో విజయం కలుగుతుంది. ఇంటా బయట గౌరవం లభిస్తుంది. కుటుంబం నందు ఆనందకరమైన వాతావరణం. రుణాలు తీరి ఉపశమనం లభిస్తుంది. ప్రత్యర్థుల మీద పై చేయి సాధిస్తారు . ఆరోగ్యం కొద్దిపాటి ఇబ్బంది ఎదురవుతాయి. అన్నదమ్ముల సహాయ సహకారాలు లభించును. చెడు స్నేహ స్నేహాలకు దూరంగా ఉండండి. మానసిక భయాలు ఏర్పడతాయి. సమాజము నందు చేయు  వ్యవహారము నందు మృదువుగా మాట్లాడుతూ వ్యవహారాన్ని చక్కబెట్టుకొనవలెను అనవసరమైన ఖర్చులు ఆందోళన కలిగిస్తాయి. వ్యాపారాలు యందు పెట్టుబడులు ఆచితూచి పెట్టుబడులు పెట్టవలెను. ఉద్యోగమునందు అధికారుల యొక్క  ఒత్తిడిలు ఎక్కువగా నుండును.  బంధువులతోటి కలిసి ఆనందంగా గడుపుతారు. ప్రభుత్వ సంబంధిత పనులు సజావుగా జరుగును. మాస మధ్యలో మీ ఆశయాలు నెరవేరుతాయి. అభివృద్ధి కార్యక్రమాలలో మిత్రులు యొక్క సహాయ సహకారాలు తీసుకుంటారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ఇతరులకు మీ యొక్క సహాయ సహకారాలను అందించండి తద్వారా మీ యొక్క అభివృద్ధి  కార్యక్రమాలకు ఉపయోగపడుతుంది.  సంతానం గూర్చి ఎదురుచూడువారు శుభవార్త వింటారు. ఈ రాజుగారు ఏ మాసం విష్ణు నా విష్ణు సహస్రనామ పారాయణ లేదా విష్ణు అర్చన చేయండి శుభ ఫలితాలు పొందండి

Zodiac Sign

వృషభం (కృత్తిక 2 3 4, రోహిణి 1 2 3 4, మృగశిర 1 2):

ఉద్యోగమనందు అధికారుల యొక్క ఆగ్రహానికి గురవుతారు. వ్యాపారం నందు నిల్వ ఉండని వస్తువుల యందు ధన నష్టం కలుగుతుంది. తలపెట్టిన పనులలో ఆటంకాలు ఏర్పడతాయి. అనవసరమైన కోరికలతోటి మనసు చికాకుగా ఉంటుంది. విరోధాలకి  వాదనలకు దూరంగా ఉండాలి. కుటుంబమునందు ప్రతికూలత వాతావరణం ఏర్పడవచ్చు.   పిల్లల యొక్క ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకొనవలెను. బంధుమిత్రులతోటి కలహాలు ఏర్పడును. అనవసరమైన ప్రయాణాలు ఏర్పడతాయి. సమాజం నందు మీ గౌరవ ప్రతిష్టలు తగ్గుతాయి.. మీ ప్రత్యర్ధులు వలన అపకార ప్రయత్నాలు జరగవచ్చు. భార్య భర్తల మధ్య మనస్పర్ధలు ఏర్పడును. వాహన ప్రయాణాలలో తగు జాగ్రత్తలు తీసుకోవాలి.  శారీరక శ్రమ  పెరుగుతుంది. మాస మధ్యలో  వృత్తి వ్యాపారాలు యందు ధన లాభం కలుగుతుంది. అధికారుల యొక్క మన్ననలు వలన అధికార లాభం కలుగుతుంది.  ఆరోగ్యం చేకూరి ప్రశాంతత లభిస్తుంది. వైవాహక జీవితం ఆనందంగా గడుస్తుంది.  భూ గృహ నిర్మాణాధి పనులు వాయిదా వేయడం మంచిది. కోర్టు వ్యవహారాలు యందు వ్యతిరేకంగా ఉంటుంది. ఈ మాసం ఆదిత్య హృదయ పారాయణ లేదా సూర్యనారాయణ స్వామి అర్చనచేయండి విశేషమైన ఫలితాలు పొందండి ఏ మాసం ఏ రాశి వారు ఈ రాశి వారు మహాలక్ష్మి అష్టోత్తరం లేదా మహాలక్ష్మి పూజ చేయండి శుభ ఫలితాలు పంపండి
 

Zodiac Sign


మిథునం (మృగశిర 3 4, ఆరుద్ర 1 2 3 4, పునర్వసు 1 2 3):
శారీరక శ్రమ తగ్గి ర సౌఖ్యం లభిస్తుంది.  వృత్తివ్యాపారాలు యందు ధన లాభం కలుగుతుంది. ఉద్యోగస్తులకు అనుకూలమైన మార్పులు. నిరుద్యోగులకు ఉద్యోగ ప్రాప్తిస్తుంది. నూతన అభివృద్ధి కార్యక్రమాలలో సోదరులు సోదరుల యొక్క సహాయ సహకారాలు లభిస్తాయి. రుణాలు చేయు విషయంలో పెద్దల యొక్క సలహాలు మేరకు తీసుకొని వలెను. ఆరోగ్య విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలి. ఆర్థిక కష్టాలు ఏర్పడి పొదుపు చేసిన ధనాన్ని తీసి ఖర్చు చేయవలసి వస్తుంద కొన్ని కీలకమైన సమస్యలు ఏర్పడుతాయి.పిల్లల యొక్క వ్యవహారంలో కొన్ని  నిర్ణయాలు తీసుకోవాలి.. సమాజం నందు గౌరవం తగ్గుతుంది. ప్రత్యర్ధుల తో అపకార భయాలు ఏర్పడతాయి. మిత్రులతోటి సఖ్యతగా ఉండవలెను. జీవిత భాగస్వామి యొక్క ఆరోగ్య విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలి.  మాస మధ్యలో విందు వినోదాలలో పాల్గొంటారు. ప్రజల యొక్క అభిమానం పొందుతారు. శారీరక సుఖం లభించును.వృత్తి వ్యాపారాలు లాభిస్తాయి.  భూ గృహ  క్రయ విక్రయాలు నిర్మాణాలు కలిసి వస్తాయి. ఈ మాసం దుర్గారాధన లేక మహిషాసుర మర్దిని స్తోత్రం నిత్యంపారాయణం చేయండి  మంచి శుభ ఫలితాలను పొందండి.

Zodiac Sign

కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి 1 2 3 4, ఆశ్లేష 1 2 3 4):
వ్యాపారాల యందు ఊహించని ధన లాభం కలుగుతుంది. తలపెట్టిన పనులన్నీ సకాలంలో పూర్తవుతాయి. కుటుంబము నందు సంతోషకరమైన వాతావరణం ఏర్పడుతుంది. అభివృద్ధి కార్యక్రమాలలో బంధువుల యొక్క సహకారం లభించును. కుటుంబ అభివృద్ధి కోసం నిర్ణయాలు తీసుకుంటారు. వైవాహిక జీవితం ఆనందంగా గడుపుతారు. సమాజమునందు గౌరవ ప్రతిష్టలు పెరుగును. నూతన వస్తు వాహనాది కొనుగోలు చేస్తారు. ఉద్యోగము నందు అనుకూలమైన మార్పులు. వినోద యాత్రలు చేస్తారు. అధికారం ప్రాప్తిస్తుంది.కోర్టు వ్యవహారాలు అనుకూలమైన తీర్పులు వస్తాయి. ప్రత్యర్థుల మీద  పైచేయి సాధిస్తారు. భూ గృహ క్రయ విక్రయాల ద్వారా ఆదాయం లాభం కలుగును. వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. నూతన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు. మాసాంతంలో రుణాలు చేయవలసి వస్తుందని. అనవసరమైన ఖర్చులు పెరుగుతాయి. చేయ పనులలో ఆతరత  పెరిగి ఆటంకాలు ఏర్పడును. సమాజము నందు అవమానాలు జరుగవచ్చు. కొన్ని సమస్యలు ఏర్పడను. ఈ మాసం ఈ రాశి వారు సుబ్రహ్మణ్యేశ్వర అర్చన లేదా సుబ్రహ్మణ్యేశ్వర అష్టోత్తరం పారాయణ చేయండి శుభ ఫలితాలు పొందండి

Zodiac Sign

సింహం (మఖ 1 2 3 4, పుబ్బ1 2 3 4, ఉత్తర 1):
ప్రయత్నించిన పనులలో ఆటంకాలు ఏర్పడతాయి.ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యమైన వస్తువులు యందు జాగ్రత్తగా ఉండవలెను.  కఠినంగా  మాట్లాడడం వలన అనేక సమస్యలు ఏర్పడుతాయి. కోపాన్ని అదుపు చేసుకుని వ్యవహరించాలి . వృత్తి వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి. బృందమిత్రుల యొక్క కలయికలు. నూతన గృహ నిర్మాణాలు కలిసి వస్తాయి. భార్యాభర్తల మధ్య అన్యోన్యత బాగుంటుంది. ఉద్యోగము నందు సహోద్యోగులు యొక్క సహాయ సహకారాలను అందించారు. ఆర్థిక ఇబ్బందులు ఏర్పడి కొంత మేరకు రుణాలు చేయవలసి వస్తుంది. ఇతరులతోటి కొద్దిపాటి గొడవలు చిన్నపాటి తగాదాలు ఏర్పడతాయి. వాహన ప్రయాణాల యందు జాగ్రత్తలు అవసరము. పిల్లల యొక్క ఆరోగ్య విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలి. మనసు నందు అనేక ఆలోచనలతోటి చికాకుగా ఉంటుంది. మా సాంతంలో గృహమునందు పెద్దల యొక్క ఆరోగ్య విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలి.  జీవిత భాగస్వామి తోటి సఖ్యతగా మెలగవలెను. సమాజము  నందు ప్రతికూలత వాతావరణం ఏర్పడవచ్చు.  శారీరక శ్రమపరిగి పెరుగును. ఈ మాసం ఈ రాశి వారు రుద్రార్చన లేదా శివ అష్టోత్తరం పారాయణ చేయండి శుభ ఫలితాలు పొందండి

Zodiac Sign

కన్య (ఉత్తర 2 3 4, హస్త 1 2 3 4, చిత్త 1 2):

సంతాన అభివృద్ధి ఆనందం కలుగజేస్తుంది. తలపెట్టిన పనులన్నీ సకాలంలో పూర్తవుతాయి. శారీరక శ్రమ పెరిగి పెరుగుతుంది. ఇతరులతోటి కలహాలకు దూరంగా ఉండండి.  స్థానచలనం జరిగే అవకాశం. రాజకీయ వ్యవహారాలు కలిసి వస్తాయి.  ఆరోగ్యం చేకూరి ప్రశాంతత లభిస్తుంది. మీఆశయం నెరవేరుతుంది. ఆర్థిక లావాదేవీలు ఆనందాన్ని కలిగిస్తాయి. పట్టుదలతో చేసే పనులు పూర్తగును. కుటుంబం నందు ఆనందకరమైన వాతావరణ ఏర్పడుతుంది. కొన్ని కీలకమైన సమస్యలు పరిష్కారాలు లభిస్తాయి.  శుభ కార్యక్రమాల్లో పాల్గొంటారు. బంధుమిత్రులతో కలిసి ఆనందంగా గడుపుతారు. ఉద్యోగమునందు అభివృద్ధి కలుగుతుంది. జీవిత భాగస్వామి తోటి ఆనందంగా గడుపుతారు. సమాజము నందు కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. నూతన వస్తూ వాహనాది కొనుగోలు చేస్తారు. ఎంతటి సమస్యనైనా సరే బుద్ధి జాతర్యంతోటి పరిష్కారం చేస్తారు. వృత్తి వ్యాపారాలు యందు ధనలాభం కలుగుతుంది.ఈ రాశి వారు ఈమాసం దుర్గా అర్చన లేదా దుర్గా స్తోత్రం పారాయణా చేయండి శుభ ఫలితాలు పొందండి
 

Zodiac Sign

తుల (చిత్త 3 4, స్వాతి 1 2 3 4, విశాఖ 1 2 3):
దుష్ట సావాసాలకు దూరంగా ఉండటం మంచిది. మనసునందు అనేక ఆలోచనలతోటి చికాకుగాగా ఉండును.వ్యాపారాల్లో ధన నష్టం ఏర్పడుతుంది.  తలచిన పనులు పనులలో ఆటంకాలు ఏర్పడడం. రుణ బాధలు పెరుగును. సంతానం తోటి విరోధాలు ఏర్పడతాయి.బంధుమిత్రుల తోటి మనస్పర్ధలు. కొన్ని సమస్యలు వలన మనసునందు విచారం కలుగును. అనవసరమైన ప్రయాణాలు ఏర్పడతాయిరుణ బాధలు పెరుగును. శారీరక శ్రమ పెరిగి బలహీనత ఏర్పడుతుంది
నిరాశ నిస్పృహలకు గురవుతారు. శత్రు రోగ  బాధలు పెరుగును. భూ గృహ క్రయవిక్రయాలు యందు ధన నష్టం వాటిల్లుతుంది. ఆత్రుతతో చేయు పనులు ఆటంకాలు ఏర్పడతాయి. అనవసరమైన కాలయాపన. భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు.  ఉద్యోగంలో అధికారుల యొక్క ఒత్తిడిలు ఎక్కువగా నుండును. ఉద్యోగపరమైన అభివృద్ధి కలుగుతుంది. సంతాన అభివృద్ధి కొద్దిపాటి ఆనందాన్ని కలిగిస్తుంది. మా సాంతంలో అనుకున్న పనులు అనుకున్నట్లుగా పూర్తవుతాయి. మనసునందు ఉల్లాసంగా ఉంటారు. బంధుమిత్రులతోటి సత్కాలక్షేపం చేస్తారు. ఈ రాశి వారు ఈ మాసం సూర్యారాధన లేదా ఆదిత్య హృదయం పారాయణం చేయండి శుభ ఫలితాలు పొందండి

Zodiac Sign

వృశ్చికం (విశాఖ 4, అనురాధ 1 2 3 4, జ్యేష్ఠ 1 2 3 4): వృద్ధి వ్యాపారాలు యందు ఊహించని ధనలాభం కలుగుతుంది.  ఆర్థిక సమస్యల తీరి ప్రశాంతత లభించును. కొన్ని సమస్యలు చికాకులు పుట్టించును. కోపం తగ్గించుకొని వ్యవహరించవలెను.ఆరోగ్య విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలి.  బృందమిత్రులతోటి మనస్పర్ధలు ఏర్పడతాయి. ప్రభుత్వ సంబంధిత పనులలో ఆటంకాలు ఏర్పడతాయి. ఉద్యోగము నందు ప్రతికూలత. ఆశుభవార్తలు వినవలసి వస్తుంది.  కుటుంబం ప్రతికూలత వాతావరణం ఏర్పడవచ్చు.  కొన్ని కీలకమైన సమస్యలు సూక్ష్మ బుద్ధి తోటి పరిష్కారం అవుతాయి. గృహ మార్పులు నిర్మాణాలు పనులు సానుకూలంగా ముందుకు సాగును. ముఖ్యమైన వస్తువులు తగు జాగ్రత్త అవసరం. బంధువులతో మనస్పర్ధలు తగాదాలు ఏర్పడవచ్చు.  వివాహ ప్రయత్నాల్లో ఆటంకాలు ఏర్పడతాయి. మాట్లాడేటప్పుడు   జాగ్రత్తలు తీసుకోవాలి. భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు రావచ్చును. మా సాంతంలో కుటుంబ సౌఖ్యం. ఆరోగ్యం చేకూరి ప్రశాంతత లభిస్తుంది. అభివృద్ధి ఆలోచనలు కలుగుతాయి. తలపెట్టిన పనులన్నీ సకాలంలో పూర్తి అవుతాయి.  చేయు వ్యవహారాలు యందు కోపాన్ని తగ్గించుకుని చేయవలెను. ఈ మాసం ఈ రాశి వారు గణపతి అర్చన లేదా గణపతి అష్టోత్తరం పారాయణం చేయండి శుభ ఫలితాలు పొందండి

Zodiac Sign

ధనస్సు (మూల 1 2 3 4 పూ.షాడ 1 2 3 4, ఉ.షాడ 1):
స్థానాచలనం కలగవచ్చు.అనవసరమైన ఖర్చులు పెరుగుతాయి. ఇంటా బయట గౌరవం పెరుగుతుంది.  నూతన ఉత్సాహంతో ముందుకు సాగుతారు.  కుటుంబమునందు సంతోషకరమైన వాతావరణ ఏర్పడుతుంది. కలహాలకు దూరంగా ఉండండి. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. చేయ పనులలో ఆటంకాల ఏర్పడిన చివరకు పూర్తవును . సంతాన విషయంలో తగు జాగ్రత్తలు తీసుకుని వలెను. విద్యార్థులు ప్రయత్నించన పరీక్షల ఉత్తీర్ణులవుతారు.
వృత్తి వ్యాపారంలో  స్వల్ప ధన లాభం కలుగుతుంది. శుభ కార్యక్రమాల్లో పాల్గొంటారు. కీలకమైన సమస్యలు ను  ధైర్యంగా ముందుండి పరిష్కారం చేస్తారు. ప్రయాణాలు కలిసి వస్తాయి. బంధుమిత్రులతో ఆనందంగా గడుపుతారు. జీవిత భాగస్వామితోటి కొద్దిపాటి మనస్పర్ధలు రావచ్చును. మా సాంతంలో  కుటుంబ సౌఖ్యం లభించును. ఉద్యోగముందు అధికార వృద్ది కలుగును. విద్యార్థులు విద్య యందు వృద్ధి కనబరుస్తారు. నూతన వస్తూ వాహనాది కొనుగోలు చేస్తారు. దుష్ట సావాసాలకి దూరంగా ఉండడం మంచిది. గొడవలకు దూరంగా ఉండండి. ముఖ్యమైన వస్తువుల యందు తగు జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ మాసం ఈరాశి వారు రుద్రార్చన లేక శివాష్టోత్తరం పారాయణం చేయండి శుభ ఫలితాలు పొందండి

Zodiac Sign

మకరం (ఉ.షాడ 2 3 4, శ్రవణం 1 2 3 4, ధనిష్ట 1 2):
గృహము నందు శుభకార్యాలు జరుగును. శారీరిక శ్రమ తగ్గి సుఖం లభించును.  బంధుమిత్రులు తోటి కొద్దిపాటి మనస్పర్ధలు రావచ్చును.  ఉద్యోగమునందు అధికారుల యొక్క ఒత్తిడిలు ఎక్కువుగా ఉంటాయి. అధికారులు తోటి కలహాలు ఏర్పడవచ్చు. సమాజంలో గౌరవం తగ్గుతుంది.  మనసు నందు అనేక ఆలోచనలు కలుగుతాయి.   తలపెట్టిన పనులలో ఆటంకాలు ఏర్పడతాయి. వ్యాపారాల యందు సామాన్యంగా ఉంటుంది. ఆరోగ్య విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలి. ఆర్థిక ఇబ్బందులు తలెత్తవచ్చు. కొన్ని కీలకమైన సమస్యలు బాధ కలుగును. మనసునందు అనేక ఆలోచనలు వలన చికాకుగా ఉంటుంది.  ఇతరుల యొక్క విషయాల్లో జోక్యం చేసుకోవద్దు. ఇతరుల జామీలకు దూరంగా ఉండటం మంచిది.   సమాజం నందు అపనిందలు ఏర్పడవచ్చు.  మిత్రులతోటి విరోధాలు ఏర్పడతాయి.  అనాలోచిత నిర్ణయాల వలన కొత్త సమస్యలు ఏర్పడగలవు. శత్రువులు అపకారం చేయాలని చూస్తారు జాగ్రత్త అవసరం. లక్ష్మీ పూజ లేదా అష్టలక్ష్మి స్తోత్రాన్ని పారాయణం చేయండి శుభ ఫలితాలు పొందండి

Zodiac Sign

కుంభం (ధనిష్ఠ 3 4, శతభిషం 1 2 3 4, పూ.భాద్ర 1 2 3):

బంధుమిత్రుల యొక్క కలయిక. రాజకీయ వ్యవహారాలు కలిసి వస్తాయి. వ్యాపారం నందు ధన లాభం కలుగుతుంది. మానసికంగా శారీరకంగా బలపడతారు.  ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకుని వలెను. రుణాలు తీరి ప్రశాంతత లభిస్తుంది. ప్రయాణాలు కలిసి వస్తాయి. తలపెట్టిన పనులలో  విజయం సాధిస్తారు. ప్రత్యర్థులు పై చేయి సాధిస్తారు. కీలకమైన సమస్యలు పరిష్కారం మై ప్రశాంతత లభించును. ప్రయాణాలు కలిసి వస్తాయి. వ్యవహారాల యందు స్త్రీల యొక్క సహాయ సహకారాలు లభించును. మీ ఆశయాలు నెరవేరుతాయి. వివాహాది ప్రయత్నాలు ఫలించును. ప్రభుత్వ సంబంధిత పనులు సజావుగా సాగును. ఉద్యోగమునందు అధికారుల యొక్క మన్నలలో పొందగలరు. బంధువులతో మనస్పర్ధలు  ఏర్పడగలవు. దురాలోచనలు ఆలోచనలు కలగవచ్చు. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. సమాజం నందు గౌరవ ప్రతిష్టలు పెరుగుతాయి. నూతన అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చేస్తారు. నూతన గృహ భూ క్రయవిక్రయాలు కలిసి వస్తాయి. మాసాంతంలో గృహమునందు శుభకార్యాలు జరుగును.  ఆధ్యాత్మిక కార్యక్రమాలు పాల్గొనుట. తలచిన పనుల్లో పనులలో విజయం సాధిస్తారు. ఈ మాసం ఈ రాశి వారు దుర్గా అర్చన లేదా దుర్గా స్తోత్రం పారాయణం చేయండి శుభ ఫలితాలు పొందండి

Zodiac Sign

మీనం(పూ.భాద్ర 4, ఉ.భాద్ర 1 2 3 4, రేవతి 1 2 3 4):
అనవసరంగా ఖర్చులు ఆందోళన కలిగిస్తాయి. ఇంటా బయట కలహాలకు దూరంగా ఉండడం చాలా మంచింది. మీ ఆశయాలు నెరవేరుతాయి. నూతన వస్తు వాహన కొనుగోలు చేస్తారు. కొన్ని  సమస్యలు కీలకంగా మారుతాయి. సంతానం కోసం ఎదురుచూసే వారికి  శుభవార్త వింటారు. కుటుంబ సభ్యులతో కూడి సంతోషంగా గడుపుతారు. సహోదరుల యొక్క సహాయ సహకారాలు లభించును. వృత్తి వ్యాపారాలు యందు లాభసాటిగా జరుగుతాయి.  ఆర్థికంగా నిలబక్కుంటారు. కీలకమైన సమస్యలు ధైర్యంగా ముందుకెళ్లండి పరిష్కార మార్గం దొరుకుతుంది. మిత్రుల సహాయ సహకారాలు లభిస్తాయి. శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు.  భార్యాభర్తల దాంపత్య జీవితం ఆనందంగా గడుస్తుంది. ఆకారణంగా కలహాలు ఏర్పడతాయి.  వాహన ప్రయాణాల యందు జాగ్రత్త అవసరం. కొద్దీ పాటి నిరాశ నిస్పృహలకు లోనవుతారు. మాసాంతంలో ప్రభుత్వ సంబంధిత పనులనుసజావుగా జరుగుతాయి. బృందమిత్ర తోటి ఆనందంగా గడుపుతారు. చేయ ఉద్యోగం నందు అధికారులతోటి సంబంధాలు పెరిగి అధికారం వృద్ది కలుగును. నూతన అభివృద్ధి కార్యాలకు శ్రీకారం చేస్తారు. ఈ మాసం ఈ రాశి వారు సుబ్రహ్మణ్యేశ్వర ఆరాధన లేదా సుబ్రహ్మణ్యేశ్వర అష్టోత్తరం పారాయణం చేయండి శుభ ఫలితాలు పొందండి.

click me!