
జోశ్యుల విజయ రామకృష్ణ - ప్రముఖ జ్యోతిష, జాతక, వాస్తు సిద్దాంతి, స్మార్త పండితులు - గాయిత్రి ఉపాసకులు.(తిరుమల తిరుపతి దేవస్దాన పూర్వ విధ్యార్ది) 'శ్రీ మాతా' వాస్తు... జ్యోతిష్యాలయం- ఫోన్: 8523814226 (సంప్రదించు వారు వాట్సప్ లో డిటేల్స్ మరియు సమస్య పెట్టండి ...సాయింత్రం నాలుగు తర్వాత ఫోన్ చేయవలెను)
రాశి చక్రంలోని పన్నెండు రాశులు వారికి ఈ మాసం ఎలా ఉండబోతోంది? ఎవరికీ శుభం జరుగుతుంది.. వారి అదృష్ట నక్షత్రాలు ఏమి చెబుతున్నాయి. ఎవరికి కలిసి వస్తుంది...ఎవరికి ఇబ్బందులు ఉంటాయి ...ఈ మాసం రాశి ఫలాలు లో తెలుసుకుందాం.
ఈ ఫలితాలు అనేవి అన్నివర్గాలకు చెందిన వారిని దృష్టిలో పెట్టుకొని తెలియజేస్తున్నాము. మీకు సంపూర్ణమైన ఫలితాలు తెలుసుకోవాలని ఆసక్తి మీకుంటే మీ పుట్టిన తేది ఆధారంగా వ్యక్తిగత జాతక పరిశీలనను అనుభవజ్ఞులైన జ్యోతిష పండితులను సంప్రదించి వారి ద్వారా మీ జాతక చక్రం వేయించుకుని విషయం తెలుసుకుని తగిన రేమిడిలను ఆచరిస్తే ఫలితాలు అనుకూలంగా అనుభవంలోకి వస్తాయి.
మేషం (అశ్విని 1,2,3,4 భరణి 1,2,3,4 కృత్తిక 1):
వృత్తి వ్యాపారాల యందు ధన నష్టం ఏర్పడవచ్చు. ఆర్థిక ఇబ్బందులు పెరిగి కొంతమేర రుణాలు చేయవలసి వచ్చును. ఆరోగ్య విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. కుటుంబం నందు ప్రతికూలత వాతావరణం. సమాజము నందు గౌరవ ప్రతిష్టలు తగ్గును. ఉద్యోగమునందు అధికారాల యొక్క ఒత్తిడి అధిక శ్రమ ఏర్పడతాయి.కొన్ని సమస్యలు ఊహించిన దానికంటే ఎక్కువగా బాధించును. ప్రయాణాల యందు జాగ్రత్తలు తీసుకొనవలెను. దైవ సంబంధమైన దిత కార్యక్రమాలలో పాల్గొంటారు. కుటుంబ సౌఖ్యం లభిస్తుంది. అనుకోని ఖర్చులు పెరుగును. ఆరోగ్యము కొరకు జాగ్రత్తలు తీసుకోవాలి. చేదు పనులలో శ్రమ అధికంగా ఉంటుంది. బందోవర్గం తోటి అకారణంగా విరోధం ఏర్పడవచ్చు. దుష్ట సావాసాలకు దూరంగా ఉండవలెను. ప్రయాణాల యందు వస్తువులు జాగ్రత్త అవసరం. ప్రతి సమస్యను ధైర్యంగా ఎదుర్కొంటారు. అప్రయత్నంగా ధనలాభం కలుగుతుంది. ఉద్యోగమనందు అధికారుల చేత గౌరవం పొందుతారు. మిత్రులతో టీ అకారణంగా కలహాలు ఏర్పడతాయి. ఈ మాసం ఈ రాశి వారు సూర్యారాధన ఆదిత్య హృదయము చేయుట వలన శుభ ఫలితాలు పొందగలరు.
వృషభం (కృత్తిక 2 3 4, రోహిణి 1 2 3 4, మృగశిర 1 2):
ధనధాన్యాది లాభాలు పొందగలరు. బంధుమిత్రులతో కలిసి విందు వినోదాలలో పాల్గొంటారు. సమాజము నందు కీర్తి గౌరవం లభించడం. విద్యార్థులు చదువు యందు ప్రతిభ పాటలు చూపిస్తారు. పెద్దల ఆదరణ పొందగలరు. ఆర్థికంగా బలపడతారు. భూ గృహ నిర్మాణ క్రయవిక్రయాలు కలిసి వస్తాయి. తలపెట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు.
గృహమునందు శుభకార్యాలు జరుగును. సంతాన సౌఖ్యం లభిస్తుంది. ఆనందంగా ఉత్సాహంగా గడుపుతారు. కులదేవతారాధన జరిపిస్తారు. ఉద్యోగం నందు అభివృద్ధి కలుగుతుంది. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లభించును. ఆరోగ్యం బాగుంటుంది. అనవసరమైన ఖర్చులు పెరుగును. భార్యాభర్తల మధ్య అన్యోన్యత తగ్గి మనస్పర్ధలు ఏర్పడగలవు. కలహాలకు వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. శత్రు బాధలు కలుగును. చేయు వ్యవహారమునందు ఉద్రేకతలు ఆతృత తగ్గించుకుని వ్యవహరించవలెను. శుక్ర సంచారం అన్ని విధాలా కలిసి వచ్చును. విద్యార్థులు విద్య యందు ప్రతిభ పాటలు చూపిస్తారు. మా సాంతంలో స్థానచలనం. ఆరోగ్య సమస్యలు ఏర్పడతాయి. అకారణంగా మిత్రులతోటి విరోధం. ఉద్యోగమునందు అధికారుల సమస్యలు ఏర్పడతాయి. ఈ మాసం ఈ రాశి వారు విష్ణు సహస్రనామం పారాయణ మరియు లక్ష్మీనారాయణ అర్చన చేయండి శుభ ఫలితాలు పొందండి.
మిథునం (మృగశిర 3 4, ఆరుద్ర 1 2 3 4, పునర్వసు 1 2 3):
వృత్తి వ్యాపారాలు రాణిస్తాయి. ఆదాయ మార్గాలు బాగుంటాయి. కీలకమైన సమస్యలను ధైర్యంగా ముందుకు వెళ్తారు. బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలు లభిస్తాయి. చేయ వ్యవహారము నందు కోపాన్ని అదుపు చేసుకొని వ్యవహరించవలెను. అనవసరమైన ఖర్చులు పెరగకుండా జాగ్రత్త అవసరం. పై అధికారుల తోటి విభేదాలు ఏర్పడవచ్చు. రవి గ్రహ సంచారం వలన శుభ ఫలితాలు పొందగలరు. ప్రభుత్వ సంబంధిత పనులన్నీ సజావుగా సాగును. గత కొంతకాలంగా నష్టపోయిన వ్యాపారం క్రమక్రమంగా అభివృద్ధి కలుగుతుంది. ఏ పని చేసినా మీ విధిని సక్రమంగా నిర్వహిస్తారు. తలపెట్టిన వ్యవహారాలన్నీ విజయవంతంగా పూర్తి అగును. ఉద్యోగమనందు అధికారుల ఆదర అభిమానాలు పొందగలరు. ఆరోగ్యం బాగుంటుంది. ఇతరులతోటి అభివృద్ధి కొరకు చర్చిస్తారు. కుజసంచారం అనుకూలంగా లేదు. సంతాన అభివృద్ధి కలుగుతుంది. శుక్ర సంచారం వలన అనవసరమైన ఖర్చులు పెరుగును. ఈ మాసం ఈ రాశి వారు సుబ్రహ్మణ్యం స్తోత్రం ఆరాధన మరియు మహాలక్ష్మి స్తోత్రాన్ని పారాయణ చేయండి శుభ ఫలితాలు పొందండి.
కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి 1 2 3 4, ఆశ్లేష 1 2 3 4):
వ్యాపారాలు అంతంతమాత్రంగా ఉండను. చేయ పని యందు శారీరక శ్రమ పెరిగి బలహీనత పొందుతారు. సమాజము నందు ప్రతికూలత వాతావరణ ఏర్పడుతుంది. తగాదాలకు వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. తలపెట్టిన పనులు పూర్తి కాక ఇబ్బందులు పడతారు. పిల్లల యొక్క ఆరోగ్యం విషయంలో జాగ్రత్త వహించవలెను. అకారణంగా కలహాలు ఏర్పడతాయి. వాహన ప్రయాణం నందు జాగ్రత్త అవసరం. శుక్ర సంచారం వలన అనుకూలమైన ఫలితాలు పొందగలరు. చేయు వ్యవహారం నందు మిత్రులు యొక్క సహాయ సహకారాలు లభిస్తాయి. అనుకోని ధన లాభం కలుగుతుంది. శారీరక శ్రమ తగ్గి సౌఖ్యం లభిస్తుంది. కీలకమైన సమస్యలను నిర్భయంగా ఎదుర్కొంటారు. బుధ గ్రహ సంచారం అనుకూలమైనది కాదు. ఇతరులతోటి మాట్లాడే విషయంలో జాగ్రత్తలు తీసుకుని వలెను. శత్రువుల తోటి ఇబ్బందులకు రావచ్చు. అనేక విధాలుగా అనవసరమైన ఖర్చులు చేయవలసి ఉంటుంది. బంధు వర్గం తోటి విరోధాలు రావచ్చు. ఈ మాసం ఈ రాశి వారు ఆదిత్య హృదయం మరియు విష్ణు సహస్రనామాన్ని పారాయణం చేయండి శుభ ఫలితాలు పొందండి. (అష్టమ శని )జరుగుతున్నది
సింహం (మఖ 1 2 3 4, పుబ్బ1 2 3 4, ఉత్తర 1):
అనుకున్న పనులు అనుకున్నట్లుగా సకాలంలో పూర్తి చేస్తారు. వృత్తి వ్యాపారం నందు రాణిస్తారు. మిత్రుల యొక్క సహాయ సహకారాలు లభిస్తాయి. వైవాహిక జీవితం ఆనందంగా సాగును. ఆర్థికంగా లాభపడతారు. ప్రయాణాలు కలిసి వస్తాయి. ప్రతి చిన్న విషయంలోనూ ధైర్యంగా ముందుకు సాగుతారు. సమాజం నందు చేయూ వ్యవహారములు ఆచుతూచి వ్యవహరించవలెను. కుజ సంచారం వలన శుభ ఫలితాలను పొందగలరు. ప్రయత్నించిన కార్యాలలో విజయం సాధిస్తారు. ఇష్టమైన విలాసవంతమైన వస్తువులు కొనుగోలు చేస్తారు. జీవిత భాగస్వామితోటి ఆనందంగా గడుపుతారు. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు ఉపశమనం కలుగుతుంది. రవి సంచారం అనుకూలంగా లేదు. అకారణంగా కలహాలు ఏర్పడగలవు. వాహన ప్రయాణాల యందు జాగ్రత్త అవసరము. సమాజము నందు అవమానాలు ఎదుర్కోవలసి ఉంటుంది. మానసికంగా నిరాశ స్పృహలకు లోనవుతారు. ఈ మాసం ఈ రాశి వారు సూర్య స్తోత్రం సూర్యరాధన చేయండి శుభ ఫలితాలు పొందండి.
కన్య (ఉత్తర 2 3 4, హస్త 1 2 3 4, చిత్త 1 2):
భార్యాభర్తల మధ్య అవగాహన రాహిత్య వలన ఆ కారణ కలహాలు ఏర్పడవచ్చు. మనస్సునందు నిరోత్సాహంగా ఉండుట. పిల్లల యొక్క ఆరోగ్యంలో కొద్దిపాటిసమస్యలు ఏర్పడగలవు. బంధుమిత్రులతోటి విరోధాలు రావచ్చు. అనవసరమైన ప్రయాణాలు చేయవలసి వస్తుంది. ప్రయాణమునందు అవరోధములు ఏర్పడగలరు. అనాలోచిత పనుల వలన ఇబ్బందులు ఎదురవుతాయి. వృత్తి వ్యాపారాలు అనుకూలించవు. ఉద్యోగమనందు అధికారుల యొక్క ఒత్తిడులు పెరుగును. వాగ్వాదాలకు దూరంగా ఉండడం. వృధాగా ఖర్చులు పెరుగుట. ఆస్తి తగాదాలు రావచ్చు. ప్రభుత్వ సంబంధిత పనులలో స్తబ్దత ఏర్పడడం. ఆరోగ్య సమస్యలు ఏర్పడగలవు. చేయు వ్యవహారం నందు అధిక శ్రమ ఏర్పడుతుంది. శత్రువుల మూలంగా పనులలో ఆటంకాలు ఏర్పడడం. బుధ గ్రహ సంచారం అనుకూలం. వృత్తి వ్యాపారం ధనలాభం కలుగుతుంది. సమాజమునందు కీర్తి ప్రతిష్టలు లభిస్తాయి. ఈ మాసం ఈ రాశి వారు సూర్యాష్టకం సుబ్రహ్మణ్య ఆరాధన కుజ స్తోత్రం పారాయణ చేయండి శుభ ఫలితాలు పొందండి.
తుల (చిత్త 3 4, స్వాతి 1 2 3 4, విశాఖ 1 2 3):
వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి. తలపెట్టిన పనులలో కొద్దిపాటి ఇబ్బందులు ఎదురైన పూర్తవును. చిన్నపాటి ఆరోగ్య సమస్యలు రాగలవు. ఉద్యోగమునందు అధికారులతోటి వివాదాలు ఏర్పడవచ్చు. కుటుంబ సభ్యుల తోటి ప్రతికూలత వాతావరణ. అకారణంగా కోపం. ఇతరులతోటి వివాదాలు ఏర్పడగలవు. వ్యాపారాలు అనుకూలంగా ఉండవు. శుక్ర సంచారం వలన శుభ ఫలితాలు పొందగలరు. బంధువులతో కలిసి ఆనందంగా గడుపుతారు. వృత్తి వ్యాపారాలు లాభసాధిగా జరుగును. ఉద్యోగవనందు అధికారుల యొక్క మనలను పొందగలరు. సమాజమనందు కీర్తి ప్రతిష్టలు పెరుగును. మిత్రుల యొక్క సహాయ సహకారాలు లభిస్తాయి. అన్ని విధాల అభివృద్ధి చెందగలరు. బుధ గ్రహ సంచారం వలన అధికారులతోటి సమస్యలు ఏర్పడతాయి. తలపెట్టిన కార్యాలలో ఆటంకాలు ఏర్పడను. కుటుంబం నందు ప్రతికూలత వాతావరణం. రవి గ్రహ సంచారం వలన శరీర సౌఖ్యం లభిస్తుంది. శత్రువులపై పై చేయి సాధిస్తారు. మానసిక ప్రశాంతత లభిస్తుంది. మా సాంతంలో భార్యాభర్తల మధ్య అన్యోన్యత తగ్గి మనస్పర్ధలు రాగలవు. బంధుమిత్రులతో ద్వేషాలు. ఈ మాసం ఈ రాశి వారు ఋధ అష్టోత్తరం సుబ్రహ్మణ్య ఆరాధన చేయండి శుభ ఫలితాలు పొందండి.
వృశ్చికం (విశాఖ 4, అనురాధ 1 2 3 4, జ్యేష్ఠ 1 2 3 4):
నూతన వస్తు వాహనాది కొనుగోలు చేస్తారు. సమాజము నందు ప్రతిభ తగ్గ గౌరవం లభిస్తుంది. వృత్తి వ్యాపారాలు లాభసాటికా జరుగును. ఆదాయ మార్గాలు బాగుంటాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ప్రతి విషయంలో ఆచి తూచి అడుగులు వేయడం ఉత్తమం. కుటుంబ సౌఖ్యం లభిస్తుంది. ప్రతి సమస్యను ధైర్యంగా ఎదుర్కొంటారు. మిత్రులతోటి అపకారం జరగవచ్చు. చేయ పనులలో బుద్ధి కుశలత తగ్గి ఇబ్బందులు ఎదురవుతాయి. ఉద్యోగ సంబంధ విషయాలలో ప్రతికూలత వాతావరణం ఏర్పడను. ఆర్థిక ఇబ్బందులు ఏర్పడి రుణాలు చేయవలసి వస్తుంది. శారీరక మానసిక బలహీనత. చిన్నపాటి ఆరోగ్య సమస్యలు ఎదురవుతాయి. వాహన ప్రయాణాల యందు జాగ్రత్త అవసరం. బుధ గ్రహ సంచారం వలన బంధుమిత్రులతో కలిసి విందు వినోదాలలో ఆనందంగా గడుపుతారు. సమాజము నందు ప్రజాభిమానం పొందగలరు. సుఖశాంతులు లభ్యమగును. స్థిరాస్తి వృద్ధి చేస్తారు. మా సాంతంలో మానసిక ప్రశాంతత లభిస్తుంది. ప్రయత్న కార్యాలన్నీ సకాలంలో పూర్తగును. ఈ మాసం ఈ రాశి వారు కుజ స్తోత్రం, సుబ్రమణ్య ఆరాధన చేయండి శుభ ఫలితాలు పొందండి ఈ రాశి వారికి (అర్థాష్టమ శని) జరుగుతున్నది జరుగుతున్నది
ధనస్సు (మూల 1 2 3 4 పూ.షాడ 1 2 3 4, ఉ.షాడ 1):
మాసం అన్ని విధాలుగా బాగుంటుంది. ధన ధాన్య లాభాలు పొందగలరు. ఇష్టమైన పని సాధించుకుంటారు. ప్రత్యర్థులపై పే చేయ సాధిస్తారు. మిత్రుల ఆదరణ అభిమానాలు పొందగలరు. సంతాన అభివృద్ధి కలుగుతుంది. పెద్దల అండదండలు లభిస్తాయి. ఆరోగ్యం సామాన్యంగా ఉంటుంది. సమాజము నందు ఉన్నత స్థితి ఏర్పడుతుంది. రవి గ్రహ సంచారం వలన అనవసరమైన ప్రయాణాలు చేయవలసి వస్తుంది. ప్రయాణమునందు అవరోధాలు ఇబ్బందులు ఏర్పడతాయి. కుటుంబం నందు ప్రతికూలత వాతావరణం. జీవిత భాగస్వామితోటి అకారణ కలహాలు. కుజ గ్రహ సంచారం వలన బంధుమిత్రులతోటి వివాదాలు ఏర్పడగలవు. కొద్దిపాటి ఆర్థిక ఇబ్బందులు ఏర్పడతాయి. అన్నదమ్ముల తోటి విరోధం. అనుకోని సంఘటనలు ఎదురవుతాయి. వాహన ప్రయాణాల యందు జాగ్రత్త అవసరము. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. వివాహాది శుభ కార్యక్రమాల యందు ఆచితూచి అడుగులు వేయవలెను. ఈ మాసం ఈ రాశి వారు రుద్రార్చన శివ స్తోత్రం పారాయణ చేయండి శుభ ఫలితాలు పొందండి.
మకరం (ఉ.షాడ 2 3 4, శ్రవణం 1 2 3 4, ధనిష్ట 1 2):
బంధువుల ఆదరణ అభిమానాల పొందగలరు. ఉద్యోగమందు అధికార అభివృద్ధి కలుగుతుంది. కుటుంబ సభ్యులతో కలిసి విందు వినోదయాత్రలు చేస్తారు. చేయి వ్యవహారము యందు మిత్రుల యొక్క సహాయ సహకారాలు లభిస్తాయి. వృత్తి వ్యాపారాలు లాభసాటికా జరుగును. ఆర్థికంగా బాగుంటుంది. కీలకమైన సమస్యలు పరిష్కారమగును. కుటుంబ సౌఖ్యం లభిస్తుంది. సంతాన అభివృద్ధి కలుగుతుంది. అనుకున్న పనులు అనుకున్నట్లుగా సాధిస్తారు. గృహమునందు ఆనందకరమైనవాతావరణం. నూతన వస్తు వాహనాది కొనుగోలు చేస్తారు.కుటుంబం నందు మాట పట్టింపులు పెరుగును. నూతన వ్యవహారాలు కలిసి వస్తాయి. శుభకార్యక్రమాల ఆలోచనలు చేస్తారు. కొన్ని సమస్యల యందు చిక్కుకొని ఇబ్బంది పడతారు. సంతాన అభివృద్ధిలోకి వస్తుంది. పెద్దల యొక్క ఆదరభిమానాలు చేయు వ్యవహారములు బుద్ధి కుశలత పెరిగి పనులన్నీ సక్రమంగా జరుగును. మా సాంతంలో అనవసరమైన ప్రయాణాలు చేయవలసి వచ్చును. కుటుంబం నందు చికాకులుగా ఉండును. ఈ మాసం ఈ రాశి వారు రుద్రాభిషేకం శివార్చన చేయండి శుభ ఫలితాలు పొందండి. (ఏలినాటి శని జరుగుతున్నది)
కుంభం (ధనిష్ఠ 3 4, శతభిషం 1 2 3 4, పూ.భాద్ర 1 2 3):
స్థాన చలనం .ఒక ప్రణాళికతో ఖర్చు చేయవలెను. అనుకోని ప్రయాణాలు చేయవలసి వస్తుంది.వ్యాపారంలో అనుకూలంగా ఉండడం. ఆరోగ్యం బాగుంటుంది. తలపెట్టిన వ్యవహారములు విజయం చేకూరుతుంది. ఉద్యోగం నందు అధికారుల ఒత్తిడి తగ్గి ప్రశాంతత లభిస్తుంది. నూతన వస్తు వాహనాది కొనుగోలు చేస్తారు. కీలకమైన సమస్యలు పరిష్కారం లభిస్తుంది. సంతానము నందు విరోధాలు ఏర్పడగలరు. చేయు వ్యవహారముల యందు కోపాన్ని తగ్గించుకుని వ్యవహరించవలెను. మానసిక శాంతి శారీరక బలహీనత ఏర్పడను.బంధుమిత్రులతోటి అకారణంగా విరోధాలు రావచ్చు. భూ గృహ నిర్మాణ పనులు మందగించును. ఉద్యోగ పరమైన అభివృద్ధి అధికారులతోటి సత్సంబంధాలు మెరుగుపడతాయి. సమాజము నందు గౌరవ మర్యాదలు పెరుగును. ప్రయాణాలు లాభిస్తాయి. ఈ రాశి వారికి ( ఏలినాటి శని జరుగుతున్నది) ఈ మాసం ఏ రాశి వారు శివ స్తోత్రం , శని స్తోత్రం పారాయణ చేయండి శుభ ఫలితాలు పొందండి.
మీనం(పూ.భాద్ర 4, ఉ.భాద్ర 1 2 3 4, రేవ
అవసరానికి సరిపడా ఆదాయం లభించును. చేయ పని యందు శారీరక శ్రమ పెరిగి శారీరక మానసిక అలసటలు ఏర్పడగలవు. వృత్తి వ్యాపారములు సంతృప్తికరంగా ఉండును. ఆరోగ్యం బాగుంటుంది. మిత్రుల యొక్క సహాయ సహకార తోటి కొన్ని సమస్యలు తీరగలవు. కోపాన్ని తగ్గించుకొని వ్యవహరించాలి లేదా అవమానములు కలగవచ్చు. చిన్నపాటి ఆరోగ్య సమస్యలు ఏర్పడగలవు. మనసునందు ఆందోళనగా ఉండను. బంధుమిత్రులతోటి అకారణంగా మనస్పర్ధలు ఏర్పడగలవు. చేయు పనులు యందు మూర్ఖపు పట్టుదల వదిలి చేసినట్లయితే పనులు సజావుగా సాగును. ప్రయాణమునందు అనుకోని సమస్యలు ఎదురవుతాయి. శత్రు బాధలు పెరుగును. ఉద్యోగవనందు పని ఒత్తిడి అధికంగా ఉంటుంది. ఇతరుల యొక్క వ్యవహారంయందు దూరంగా ఉండండి. గృహమునందు శుభ కార్యక్రమాలు వాయిదా పడును. అనవసరమైన ఆలోచనలకు దూరంగా ఉండవలెను. కుటుంబవనందు ప్రతికూలత వాతావరణం.ఈ రాశి వారికి (ఏలినాటి శని) ప్రారంభమైనది. ఈ మాసం ఏ రాశి వారు ఆదిత్య హృదయం సుబ్రహ్మణ్య స్తోత్రం పారాయణ చేయండి శుభ ఫలితాలు పొందండి.