వాస్తు శాస్త్రంలో మనిషి జీవితానికి సంబంధించిన అన్ని సమస్యల గురించి ప్రస్తావించారు. వాస్తు శాస్త్ర నియమాలను పాటిస్తే మన జీవితంలో సంతోషం, శాంతి నెలకొంటాయి. అందుకే మన ఇంట్లో వాస్త ప్రకారమే ప్రతి వస్తువును పెట్టాలి. లేదంటే ఇంట్లో నెగెటివ్ ఎనర్జీ ఏర్పడి జీవితంలో మీరు ఎన్నో సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. వాస్తు శాస్త్రం ప్రకారం.. ఇంటి మెట్ల కింద కొన్ని వస్తువులను పెట్టకూడదు. ఎందుకంటే ఇది వాస్తు లోపాలకు దారితీస్తుంది. అలాగే దీనివల్ల మీరు పేదరికాన్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది. అందుకే మెట్ల కింద ఎలాంటి వస్తువులను పెట్టకూడదో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.
వాస్తు ప్రకారం.. మన ఇంటి మెట్ల కింద వంటగది, మరుగుదొడ్లు, గుడి ఉండకూడదు. ఎందుకంటే దీనివల్ల కుటుంబం మొత్తం ఎన్నో సమస్యలను ఎదుర్కోవల్సి వస్తుంది. వీటితో పాటుగా స్టోర్ రూమ్ ను కూడా నిర్మించకూడదు.
మీ ఇంట్లో ఆర్థిక పరిస్థితి బాగాలేదా? అయితే దానికి కారణం మెట్ల కింద ఉంచిన బూట్లు, చెప్పులే కారణమని వాస్తు శాస్త్రం చెబుతోంది. వాస్తు శాస్త్రం ప్రకారం.. మెట్ల కింద చెప్పులను, బూట్లను పెట్టకూడదు. అందుకే మర్చిపోయి కూడా ఈ తప్పును మాత్రం చేయకండి.
వాస్తు శాస్త్రం ప్రకారం.. మెట్ల కింద ఎప్పుడూ ఖాళీ ప్లేస్ ఉండేలా చూసుకోవాలి. మెట్ల కింద ఖాళీ స్థలం ఉండటం వల్ల పిల్లలు ఉన్నత విద్యను అభ్యసిస్తారని జ్యోతిష్యులు చెబుతున్నారు. అలాగే మెట్లు ఎప్పుడూ శుభ్రంగా ఉండాలి. మెట్లు మురికిగా ఉంటే ఇంట్లో ఇంట్లోకి నెగిటివీ వస్తుందని నమ్ముతారు.
మెట్ల సరైన దిశ
వాస్తు శాస్త్రం ప్రకారం.. మెట్లు నిర్మించడానికి నైరుతి దిశ అనుకూలంగా ఉంటుంది. మెట్లు వేరే దిశలో ఉండకుండా జాగ్రత్త పడాలి. ఎందుకంటే ఇది ఇంటి యజమానికి ఆర్థిక నష్టాన్ని కలిగిస్తుందని నమ్ముతారు.