వృశ్చిక రాశి
వృశ్చిక రాశివారు నీటి మూలకం అయినందున, విషయాలను వ్యక్తిగతంగా తీసుకుంటారు. ప్రతి విషయాన్ని ఎక్కువగా ఆలోచిస్తారు. ఆ ఆలోచనలు కూడా పాజిటివ్ గా ఉండవు. ఎక్కువగా నెగిటివ్ గురించే ఆలోచిస్తారు. అంతేకాక, వారి భావోద్వేగం చాలా తీవ్రంగా ఉంటుంది, అది సులభంగా ఇతరులకు ప్రసారం చేయబడుతుంది. వారు అబ్సెసివ్, వారి భావోద్వేగాలను అధిగమించడానికి కష్టంగా ఉంటారు. క్లిష్ట పరిస్థితులను ఎదుర్కోలేకపోవడమే దీనికి కారణం. దానికి తోడు జీవితంలో ఎంత మంచి పనులు జరిగినా కష్టాలన్నీ తమకే వస్తాయని వారు భావిస్తూ ఉంటారు.