కొన్నిసార్లు మనం కానిది.. అయినట్టుగా ప్రొజెక్ట్ అవుతుంటాం. అందులో ముఖ్యంగా అహంకారులుగా ముద్రపడడం ఎవ్వరికీ ఇష్టం ఉండదు. కానీ తమ ప్రమేయం లేకుండా అలా జరిగిపోతుంది. ఇదంతా రాశుల ప్రభావమేనట.
కొంతమంది తాము ఇతరుల కంటే ఎక్కువ అని భావిస్తారు. స్వార్థంగా ఉంటారు.. అయితే, నిజానికి వారు అలా కాకపోయినా, ఇతరుల దృష్టిలో అలా ట్రీట్ చేయబడతారు. తరచుగా అలాగే తీర్పు ఇవ్వబడుతుంటారు. అలాంటి నాలుగు రాశిచక్రం ఉన్న వ్యక్తుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. వీరు అహంకారులుగా, స్వార్థపరులుగా అపఖ్యాతి పొందుతుంటారు. మరి మీరూ వారిలో ఒకరేమో చూడండి..
25
సింహరాశి (leo)
ఈ రాశివారు తమను తాము బాగా ప్రేమిస్తారు. దీంతో self obsessive అని అపఖ్యాతి పాలవుతుంటారు. సింహరాశి వారు సెల్ప్ సెంటర్డ్ గా ఉంటారు. అది వీరిలో రహస్యంగా ఉంటారు. అయితే ఇది నిజానికి వారి స్వభావం కాదు.. వీరు ఇతరులందరి కంటే గొప్పవారు. అందుకే సింహరాశి వారితో మాట్లాడేప్పుడు పైపైన కనిపించేది చూసి మోసపోకుండా.. కాస్త శ్రద్ధగా గమనించాలి. వీరు అందరూ తమలాగే ఉండాలని కోరుకుంటారు. అయితే వీరు బైటికి చాలా అహంకారంగా కనిపిస్తారు. కానీ.. వీరి స్నేహితుల జాబితా పెద్దదిగా ఉంటుంది. దీనికి కారణం వారి ఆకర్షణీయమైన వ్యక్తిత్వమే.
35
Sagittarius
ధనుస్సు (Sagittarius)
ధనుస్సు రాశివారు..ప్రతిదానికీ కేంద్రంగా ఉంటారు. ప్రపంచంఅంతా వారి చుట్టే తిరుగుతుంది. ఈ రాశివారు చాలా నార్సిసిస్టిక్‌గా ఉంటారు. తమలోని లోపాలను కూడా రొమాంటిసైజ్ చేస్తారు. వీరి చమత్కారమైన వ్యక్తిత్వం అందరికీ నచ్చుతుందని, చుట్టుపక్కల వారందరూ వీరితో ప్రేమలో పడతారని ధనుస్సు రాశివారు ఘాడంగా నమ్ముతారు. వారి మనోహరమైన వ్యక్తిత్వమే వారిని అయిష్టం నుంచి కాపాడుతుంది.
45
Taurus
వృషభం (Taurus)
వృషభ రాశివారు దురభిమానులు. అహంకారులుగా ప్రసిద్ధి చెందారు. వృషభరాశివారు self absorbedగా ఉంటారు. బాగా ఆంబీషియస్ గా ఉంటారు. ఇదే కొన్నిసార్లు ఇతరుల్ని అపోహ పడేల చేస్తుంది. తమను పక్కనపెట్టేస్తున్నారనే భావనను కలిగేలా చేస్తుంది. తమతో సరిగా ఉండడం లేదన్న ఫీలింగ్ కలిగిస్తుంది. అయితే, వృషభరాశివారు ఎప్పుడూ రాజీపడరు. కారణం తాము ఎల్లప్పుడూ సరైనవాళ్లమేనని భావించడమే.
55
Aries
మేషం (Aries)
మేష రాశిలో జన్మించిన వ్యక్తులు తమ గురించి మాత్రమే ఆలోచించే ధోరణిని కలిగి ఉంటారు. వారు చాలా సున్నితత్వం కలిగినవారు.. సెల్ఫ్ సెంటర్డ్ కావచ్చు. అయితే భావోద్వేగ పూరితమైన పరిస్థితుల్లో ఎలా హ్యాండిల్ చేయాలో.. ఇతరులతో ఎలా మెలగాలో వీరికి తెలియాదు. దీంతో వారు అహంకారికులుగా గుర్తించబడతారు. అయితే, ఒకవేళ వీరి సహాయం కావాలని కనుక ఒక్కమాట చెబితే చాలు..వెంటనే వాలిపోయి పూర్తి సహాయసహకారాలు అందిస్తారు.