ఒంగోలుపై ట్విస్ట్: వైసీపీలోకి మాగుంట, శిద్దాపై చంద్రబాబు ఒత్తిడి

First Published Mar 12, 2019, 2:50 PM IST

ఎంపీ సీట్లకు పోటీ చేయాలని ఇద్దరు  మంత్రులను చంద్రబాబునాయుడు కోరారు. అయితే ఈ ప్రతిపాదనపై మంత్రులు అంతగా ఆసక్తిని చూపడం లేదు.
 

ఎంపీ సీట్లకు పోటీ చేయాలని ఇద్దరు మంత్రులను చంద్రబాబునాయుడు కోరారు. అయితే ఈ ప్రతిపాదనపై మంత్రులు అంతగా ఆసక్తిని చూపడం లేదు.ఒంగోలు పార్లమెంట్ స్థానం నుండి గత ఎన్నికల్లో మాగుంట శ్రీనివాసులు రెడ్డి టీడీపీ అభ్యర్ధిగా పోటీ చేసి ఓటమి పాలయ్యాడు. ఆ తర్వాత మాగుంట శ్రీనివాసులు రెడ్డికి చంద్రబాబునాయుడు ఎమ్మెల్సీ పదవి ఇచ్చారు.
undefined
మరోసారి ఒంగోలు నుండి ఎంపీ స్థానానికి పోటీ చేయాలని చంద్రబాబునాయుడు మాగుంట శ్రీనివాసులు రెడ్డిని కోరారు. అయితే మాగుంట మాత్రం ఒంగోలు నుండి ఎంపీగా పోటీ చేసేందుకు సిద్దంగా లేరు. మాగుంట శ్రీనివాసులు రెడ్డి ఏకంగా పార్టీ మారాలని నిర్ణయం తీసుకొన్నారు. ఈ నెల 13వ తేదీన మాగుంట శ్రీనివాసులు రెడ్డి టీడీపీని వీడి వైసీపీలో చేరనున్నారు.
undefined
దరిమిలా ఒంగోలు నుండి మంత్రి శిద్దా రాఘవరావును బరిలోకి దింపాలని చంద్రబాబునాయుడు యోచిస్తున్నారు. గత ఎన్నికల్లో దర్శి నుండి శిద్దా రాఘవరావు పోటీ చేసి విజయం సాధించారు. చంద్రబాబునాయుడు మంత్రివర్గంలో శిద్దా రాఘవరావుకు చోటు దక్కింది.
undefined
ఇదిలా ఉంటే విశాఖ జిల్లాలోని భీమిలి నుండి గత ఎన్నికల్లో పోటీ చేసి విజయం సాధించిన గంటా శ్రీనివాసరావును కూడ విశాఖ నుండి ఎంపీ గా బరిలోకి దింపాలని బాబు ప్లాన్ చేస్తున్నారు.
undefined
ఇప్పటికే అనకాపల్లి నుండి బీసీ సామాజికవర్గానికి చెందిన వారిని ఎంపిక చేసినందున విశాఖ నుండి కాపు సామాజిక వర్గానికి చెందిన వారికి టిక్కెట్టును కేటాయించాలని బాబు భావిస్తున్నారు.
undefined
ఇదే విషయమై గంటా శ్రీనివాసరావుతో చంద్రబాబునాయుడు ప్రస్తావించారు. అయితే ఆలోచించి నిర్ణయం చెబుతానని గంటా బాబుకు చెప్పారు. ఈ లోపుగానే సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ పేరు కూడ తెరమీదికి వచ్చింది.
undefined
లక్ష్మీనారాయణ టీడీపీలో చేరే అవకాశం ఉందని చెబుతున్నారు. మంగళవారం నాడు సాయంత్రానికి లక్ష్మీనారాయణ టీడీపీలో చేరే విషయమై స్పష్టత ఇచ్చే అవకాశం ఉందని సమాచారం. లక్ష్మీనారాయణ టీడీపీలో చేరితే భీమిలి నుండి అసెంబ్లీకి పోటీ చేసే ఛాన్స్ ఉంది. భీమిలి నుండి లక్ష్మీనారాయణ పోటీ చేస్తే విశాఖపట్టణం నుండి ఎంపీ స్థానానికి గంటా శ్రీనివాసరావు పోటీ చేసే ఛాన్స్ ఉంది.
undefined
ఇదిలా ఉంటే మంత్రి ఆదినారాయణరెడ్డి కడప నుండి ఎంపీగా బరిలోకి దిగుతున్నారు. తాను ప్రాతినిథ్యం వహిస్తున్న జమ్మలమడుగు నుండి మాజీ మంత్రి రామ సుబ్బారెడ్డి బరిలోకి దిగుతున్నారు. నర్సరావుపేట ఎంపీ స్థానం నుండి కోడెల శివప్రసాదరావును పోటీ చేయాలని బాబు కోరారు. కానీ, ఈ స్థానం నుండి పోటీకి కోడెల శివప్రసాదరావు పోటీకి విముఖత చూపుతున్నారు.
undefined
click me!