గౌరు చరిత ఎఫెక్ట్: కార్యకర్తలతో ఏరాసు భేటీ, ఎస్పీవై, గంగుల అసంతృప్తి

First Published Mar 10, 2019, 2:19 PM IST

కర్నూల్ జిల్లాలో  కీలకమైన టీడీపీ నేతలు పార్టీ నాయకత్వంపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారు.

కర్నూల్ జిల్లాలో కీలకమైన టీడీపీ నేతలు పార్టీ నాయకత్వంపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారు.తమ అనుచరులతో సమావేశాలను నిర్వహిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ టిక్కెట్ల విషయంలో చంద్రబాబునాయుడు స్పష్టత ఇవ్వని కారణంగా ముగ్గురు నేతలు అసంతృప్తితో ఉన్నారు.
undefined
కర్నూల్ జిల్లాలోని పాణ్యం నుండి గత అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్ధిగా పోటీ చేసిన మాజీ మంత్రి ఏరాసు ప్రతాప్ రెడ్డి చంద్రబాబు తీరుపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారు.పాణ్యం నుండి వైసీపీ నుండి టీడీపీలో చేరిన గౌరు చరితారెడ్డికి టిక్కెట్టు ఇవ్వాలని బాబు నిర్ణయం తీసుకొన్నారు. గౌరు చరితా రెడ్డి, ఆమె భర్త వెంకట్ రెడ్డి శనివారం నాడు చంద్రబాబునాయుడు సమక్షంలో టీడీపీలో చేరారు.ఈ కార్యక్రమంలో ఏరాసు ప్రతాప్ రెడ్డి పాల్గొనలేదు.
undefined
గత ఎన్నికల్లో ఏరాసు ప్రతాప్ రెడ్డి మూడో స్థానంలో నిలిచారు. ఇదిలా ఉంటే 2009 ఎన్నికల్లో శ్రీశైలం నుండి ఏరాసు ప్రతాప్ రెడ్డి కాంగ్రెస్ అభ్యర్ధిగా విజయం సాధించారు. 2014 ఎన్నికల ముందు ఆయన కాంగ్రెస్ పార్టీ నుండి టీడీపీలో చేరారు.
undefined
అయితే గౌరు దంపతులు వైసీపీ నుండి టీడీపీలో చేరడంతో ఏరాసుకు టిక్కెట్టు దక్కకుండా పోయింది. దీంతో ఆదివారం నాడు ఆయన కార్యకర్తలతో సమావేశమయ్యారు. సోమవారం నాడు చంద్రబాబుతో ఏరాసు ప్రతాప్ రెడ్డి భేటీ కానున్నారు. పార్టీ మారాలనే విషయం తనకు లేదని ఏరాసు ప్రతాప్ రెడ్డి ప్రకటించారు.
undefined
మరోవైపు నంద్యాల ఎంపీ ఎస్పీవై రెడ్డి కూడ ఇవాళ తన అనుచరులతో సమావేశమయ్యారు. నంద్యాల ఎంపీ స్థానం నుండి టీడీపీ టిక్కెట్టు విషయాన్ని ఫైనల్ చేయలేదు. ఎస్పీవై రెడ్డి అనారోగ్యం కారణంగా తాను పోటీకి దూరమైతే తన కూతురు లేదా అల్లుడికి టిక్కెట్టు ఇవ్వాలని ఎస్పీవై రెడ్డి డిమాండ్ చేస్తున్నారు. అయితే ఈ స్థానం నుండి మాండ్ర శివానందరెడ్డికి టిక్కెట్టును ఇవ్వాలని టీడీపీ నాయకత్వం భావిస్తోంది.టిక్కెట్టును ఇవ్వకపోతే పార్టీ మారేందుకు కూడ వెనుకాడబోమని ఎస్పీవై రెడ్డి టీడీపీ నాయకత్వానికి తేల్చి చెప్పినట్టు ప్రచారం సాగుతోంది.
undefined
రెండేళ్ల క్రితం జరిగిన నంద్యాల అసెంబ్లీ ఎన్నికల సమయంలో కూడ తన అల్లుడికి టిక్కెట్టు ఇవ్వాలని ఎస్పీవై రెడ్డి డిమాండ్ చేసిన విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే నంద్యాల అసెంబ్లీ ఉప ఎన్నికల సమయంలో టీడీపీలో చేరిన మాజీ ఎంపీ గంగుల ప్రతాప్ రెడ్డి కూడ టీడీపీ నాయకత్వం పట్ల అసంతృప్తితో ఉన్నారని సమాచారం. నంద్యాల ఎంపీ స్థానాన్ని గంగుల ప్రతాప్ రెడ్డి ఆశిస్తున్నట్టు ప్రచారం సాగుతోంది. అయితే నంద్యాల ఎంపీ టిక్కెట్టు విషయమై చంద్రబాబునాయుడు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు
undefined
click me!