వైసిపిలోకి రాయపాటి, వంగా గీత: సొంత గూటికి ఎస్పీవై రెడ్డి, బుట్టా రేణుక

First Published Mar 15, 2019, 4:22 PM IST

అమరావతి: ఎన్నికల షెడ్యూల్ విడుదలవ్వడం, అధికార తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీలు తొలివిడత అభ్యర్థులను ఖరారు చెయ్యడం, వైసీపీ ఫస్ట్ లిస్ట్ రెడీ చేసి పెండింగ్ పెట్టడంతో ఇప్పటి వరకు స్తబ్ధుగా ఉన్న నేతలతోపాటు టీడీపీలోని అసంతృప్తులు పలువురు వైసీపీలో చేరేందుకు క్యూ కడుతున్నా

అమరావతి: ఎన్నికల షెడ్యూల్ విడుదలవ్వడం, అధికార తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీలు తొలివిడత అభ్యర్థులను ఖరారు చెయ్యడం, వైసీపీ ఫస్ట్ లిస్ట్ రెడీ చేసి పెండింగ్ పెట్టడంతో ఇప్పటి వరకు స్తబ్ధుగా ఉన్న నేతలతోపాటు టీడీపీలోని అసంతృప్తులు పలువురు వైసీపీలో చేరేందుకు క్యూ కడుతున్నారు
undefined
ఎన్నికల షెడ్యూల్ విడుదలకు ముందు నుంచి అధికార పార్టీ నుంచి తెలుగుదేశంలోకి, తెలుగుదేశం పార్టీ నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వలసలు జోరుగా సాగాయి. అయితే ఎన్నికల షెడ్యూల్ విడుదలైన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి రాజకీయ ఉద్దండులు క్యూ కడుతున్నారు.
undefined
ఇప్పటికే అటు టీడీపీ, కాంగ్రెస్ పార్టీల నుంచి భారీ స్థాయిలో వలసలు రావడంతో ఆ పార్టీలో సందడి నెలకొంది. తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీ, మాజీ ఎంపీ మాగుంట శ్రీనివాసుల రెడ్డి తన పదవికి గురువారం సాయంత్రం రాజీనామా చేశారు. ఆయన త్వరలోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నానని స్పష్టం చేశారు.
undefined
అంతేకాదు తాను ఒంగోలు పార్లమెంట్ కు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చెయ్యనున్నట్లు పరోక్షంగా ప్రెస్మీట్ పెట్టి మరీ ప్రకటించేశారు. ఇకపోతే టీడీపీ సీనియర్ నేత నరసరావుపేట ఎంపీ రాయపాటి సాంబశివరావు సైతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.
undefined
గత కొంతకాలంగా తెలుగుదేశం పార్టీపై అసంతృప్తితో రగిలిపోతున్న రాయపాటి సాంబశివరావు తెలుగుదేశం పార్టీని వీడాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. గత కొద్ది రోజులుగా తమ కుటుంబానికి రెండు టికెట్ల ఇవ్వాలని చంద్రబాబు నాయుడును కోరుతున్నారు.
undefined
తనకు నరసరావుపేట పార్లమెంట్ టికెట్ తోపాటు తనయుడు రంగబాబుకు సత్తెనపల్లి అసెంబ్లీ టికెట్ ఇవ్వాలని కోరారు. పలు దఫాలుగా చంద్రబాబు నాయుడును కలిసి విజ్ఞప్తి చేసినప్పటికీ చంద్రబాబు నాయుడు మాత్రం హామీ ఇవ్వలేదని తెలుస్తోంది. అయితే గురువారం తనయుడుతో కలిసి చంద్రబాబును కలిశారు రాయపాటి.
undefined
అయితే ఆ భేటీలో కూడా చంద్రబాబు నాయుడు హామీ ఇవ్వకపోవడంతో రాయపాటి సాంబశివరావు అలకపాన్పు ఎక్కారు. తనకంటే సరైన అభ్యర్థులను తీసుకురాగలిగితే తెచ్చుకోండంటూ ఆగ్రహంతో ఊగిపోతూ బయటకు వచ్చేశారు. టికెట్ ఇవ్వకపోతే పక్కపార్టీవైపు చూడాల్సి వస్తోందంటూ పార్టీ మారతానంటూ ఇండైరెక్ట్ గా చెప్పేసి వెళ్లిపోయారు.
undefined
రాయపాటి పార్టీ మారతారన్న అనుమానంతో చంద్రబాబు పార్టీ కీలక నేతలను రంగంలోకి దింపింది. టీడీపీ ఎంపీ సుజనా చౌదరి, ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వరప్రసాద్ లను రాయబారానికి పంపింది. అంతేకాదు టీడీపీ జనరల్ సెక్రటరీ నారా లోకేష్ సైతం రాయపాటి సాంబశివరావుకు ఫోన్ చేసి పార్టీ వీడొద్దంటూ హామీ ఇచ్చారు.
undefined
నరసరావుపేట పార్లమెంట్ టికెట్ ఇస్తామంటూ హామీ కూడా ఇచ్చారని తెలుస్తోంది. అయినప్పటికీ రాయపాటి మనసు మార్చుకోలేదని తెలుస్తోంది. ఆయన పార్టీ వీడతారంటూ ప్రచారం జోరుగా సాగుతోంది.
undefined
ఇకపోతే ఉత్తరాంధ్రకు చెందిన కీలక నేత మాజీమంత్రి కొణతాల రామకృష్ణ సైతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఇటీవలే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడును కలిసిన కొణతాల ఈనెల 17న తెలుగుదేశం పార్టీలో చేరబోతున్నట్లు స్పష్టం చేశారు. ఆయన అనకాపల్లి సీటు అడిగినట్లు తెలుస్తోంది. అందుకు చంద్రబాబు నాయుడు సైతం సరే అన్నట్లు ప్రచారం కూడా జరిగింది.
undefined
అయితే అనకాపల్లి ఎంపీ అభ్యర్థిగా అడారి ఆనంద్‌ను చంద్రబాబు నాయుడు ఫైనల్ చేశారంటూ ప్రచారం జరుగుతోంది. కొణతాల రామకృష్ణ అనకాపల్లి ఎంపీ స్థానం నుండి పోటీ చెయ్యాలని భావిస్తున్న కొణతాల రామకృష్ణకు ఈ పరిణామం కాస్త ఇబ్బందికరంగా మారినట్లు తెలుస్తోంది.
undefined
అనకాపల్లి అభ్యర్థి ఎంపిక విషయంలో కనీసం తనను సంప్రదించి ఉంటే కనీసం తనకు గుర్తింపు ఇచ్చినట్లుగా భావించేవాడినని ఆయన భావిస్తున్నారు. చంద్రబాబు వ్యవహారంతో విసుగుచెందిన కొణతాల తెలుగుదేశం పార్టీకి గుడ్ బై చెప్పాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.
undefined
అంతేకాదు మరోవైపు అనకాపల్లి పార్లమెంట్ అభ్యర్థిగా వంగవీటి రాధాకృష్ణ పేరును పరిశీలిస్తున్నట్లు వార్తలు రావడంతో ఆయన అలకబూనినట్లు తెలుస్తోంది. అంతేకాదు తెలుగుదేశం పార్టీకి పెద్ద దిక్కుగా విశాఖపట్నం జిల్లాలో మంత్రి గంటా శ్రీనివాసరావు వ్యవహరిస్తున్నారని తెలియడంతో ఆయన వెనక్కితగ్గినట్లు తెలుస్తోంది.
undefined
అనకాపల్లి పార్లమెంట్ అభ్యర్థిగా వంగవీటి రాధాకృష్ణ పేరును పరిశీలనకు తెచ్చింది గంటా శ్రీనివాసరావేనని తెలియడంతో కొణతాల రామకృష్ణ ఇక పార్టీ వీడటం మంచిదని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.
undefined
అటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోని కీలక నేతలతో సంబంధాలు ఉన్న కొణతాల రామకృష్ణ వెంటనే వారితో టచ్ లోకి వెళ్లినట్లు తెలుస్తోంది. అయితే వైసీపీ అధిష్టానం అనకాపల్లి పార్లమెంట్ టికెట్ ఇచ్చేందుకు అంగీకారం తెలిపినట్లు సమాచారం.
undefined
అయితే కొణతాల రామకృష్ణ తన అనుచరుడు గండి బాబ్జీకి పెందుర్తి టికెట్ ఇవ్వాలని షరతులు పెట్టినట్లు తెలుస్తోంది. అయితే ఆ అంశంపై జగన్ తో చర్చించి నిర్ణయం తీసుకుంటామని చెప్పినట్లు సమాచారం.
undefined
మరోవైపు మాజీ రాజ్యసభ సభ్యురాలు వంగాగీత సైతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. తెలుగుదేశం పార్టీలో కీలక పదవులు చేపట్టిన ఆమె మెగాస్టార్ చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీలో చేరిపోయారు.
undefined
2009లో ప్రజారాజ్యం పార్టీ తరపున పిఠాపురం నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలుపొందారు. ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసిన తర్వాత ఆమె కాస్త స్తబ్ధుగా ఉన్నారు. 2014 ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీ నుంచి పిఠాపురం టికెట్ ఆశించి భంగపడ్డారు. ఆనాటి నుంచి ఆమె రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు.
undefined
అయితే 2019 ఎన్నికల్లో పోటీ చెయ్యాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఆమె జనసేన పార్టీలో చేరతారంటూ ప్రచారం జరుగింది. కానీ ఆమె వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.
undefined
మరోవైపు కర్నూలు ఎంపీ బుట్టా రేణుక సైతం సొంత గూటికి చేరాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. 2014 ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా కర్నూలు పార్లమెంట్ కు పోటీ చేసి గెలుపొందిన బుట్టా రేణుక ఆ పార్టీకి గుడ్ బై చెప్పి టీడీపీకి అనుబంధంగా కొనసాగుతూ వచ్చారు. అయితే 2019 ఎన్నికల్లో మళ్లీ తిరిగి కర్నూలు పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేద్దామని భావించిన ఆమెకు చంద్రబాబు నాయుడు హ్యాండ్ ఇచ్చారు.
undefined
కేంద్ర మాజీమంత్రి కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డిని టీడీపీలోకి ఆహ్వానించి బుట్టా రేణుక టికెట్ ఆయనకి ఇచ్చేశారు. బుట్టా రేణుకకు ఎమ్మెల్యేగా పోటీ చెయ్యాలని టికెట్ ఇస్తానంటూ చెప్పుకొచ్చారు. తొలుత ఎమ్మిగనూరు అసెంబ్లీ టికెట్ ఇస్తానని చెప్పుకొచ్చారు.
undefined
అయితే సిట్టింగ్ ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వర్ రెడ్డి తన నియోజకవర్గం జోలికి రావొద్దంటూ చెప్పడంతో చంద్రబాబు నాయుడు వేరే నియోజకవర్గం ఇస్తానంటూ బుట్టాకు చెప్పుకొచ్చారు. ఆదోని నుంచి పోటీ చెయ్యాలని సూచించారు.
undefined
ఆదోని టికెట్ అయినా ఇస్తారని ఆశించిన ఆమెకు ఆ టికెట్ కూడా ఇవ్వకుండా హ్యాండ్ ఇచ్చారు. ఆ టికెట్ ను పార్టీ సీనియర్ నేత మీనాక్షినాయుడుకే కట్టబెట్టారు చంద్రబాబు. దీంతో తీవ్ర ఆగ్రహంతో ఉన్న బుట్టా రేణుక వైసీపీలో చేరాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిర్ణయంపై ఆమె వేచి చూస్తున్నట్లు సమాచారం.
undefined
మరోవైపు నంద్యాల ఎంపీ ఎస్పీ వై రెడ్డి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నట్లు ప్రచారం జరుగుతుంది. గత ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున నంద్యాల పార్లమెంట్ నియోజవర్గం నుంచి పోటీ చేసి గెలుపొందిన ఆయన అనంతరం తెలుగుదేశం పార్టీలో చేరిపోయారు.
undefined
2019 ఎన్నికల్లో తాను లేదా తన కుటుంబం నుంచి ఎవరినైనా బరిలోకి దించాలని భావించారు. అయితే టికెట్లు ఇచ్చేందుకు చంద్రబాబు నాయుడు ససేమిరా అనడంతో ఆయన తెలుగుదేశం పార్టీకి గుడ్ బై చెప్పాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.
undefined
అధికార తెలుగుదేశం పార్టీ 126 మంది అభ్యర్థులను ప్రకటించడం, జనసేన పార్టీ 36 మందిని ప్రకటించడం, వైసీపీ అభ్యర్థులను ఎంపిక చేసినప్పటికీ ప్రకటనను పెండింగ్ లో పెట్టింది. అభ్యర్థుల ప్రకటనకు ముహూర్తాన్ని కూడా ప్రకటించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనూహ్యంగా వాయిదా వేసింది. ఆ వాయిదా వెనుక అసలు కారణం వలసలు మరింత ఉన్నాయన్న అనుమానంతోనేనని ప్రచారం కూడా జరిగింది
undefined
click me!