మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ ఏ పార్టీలో చేరుతారనేది ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది. ఈ నెల 17వ తేదీన కొణతాల రామకృష్ణ టీడీపీలో చేరుతారని ప్రచారం సాగిన నేపథ్యంలో గురువారం నాడు వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది.

28
. కొణతాల వైసీపీలో చేరేందుకు నిర్ణయం తీసుకొన్నారనే ప్రచారం సాగింది. అయితే రెండు రోజుల్లో తాను ఏ పార్టీలో చేరే విషయాన్ని ప్రకటించనున్నట్టుగా కొణతాల రామకృష్ణ గురువారం రాత్రి ప్రకటించారు.

38
వారం రోజుల క్రితం ఏపీ సీఎం చంద్రబాబునాయుడుతో మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ భేటీ అయ్యారు. తన అనుచరులతో కలిసి కొణతాల టీడీపీలో చేరేందుకు రంగం సిద్దమైనట్టు సమాచారం

48
ఈ సమయంలోనే అనకాపల్లి ఎంపీ స్థానానికి చంద్రబాబునాయుడు అడారి ఆనంద్‌ను అభ్యర్ధిగా ఫైనల్ చేసినట్టుగా సమాచారం. కొణతాల రామకృష్ణ అనకాపల్లి ఎంపీ స్థానం నుండి పోటీ విషయమై టీడీపీ నాయకత్వానికి సమాచారం ఇవ్వని కారణంగా ఈ స్థానానికి ఆనంద్ పేరును టీడీపీ ఫైనల్ చేసిందని అంటున్నారు.

58
రాష్ట్రంలోని 25 ఎంపీ స్థానాలకు చంద్రబాబునాయుడు ఇవాళ అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉంది. అయితే అనకాపల్లి ఎంపీ స్థానంలో అభ్యర్ధిని ఫైనల్ చేసే విషయంలో తనకు ఒక్క మాట కూడ చెప్పని కారణంగా కొణతాల రామకృష్ణ మనస్తాపానికి గురైనట్టు ఆయన అనుచరులు చెబుతున్నారు. దీంతోనే ఆయన వైసీపీ వైపు మొగ్గు చూపినట్టుగా చెబుతున్నారు.

68
గురువారం నాడు కొణతాల రామకృష్ణ అనుచరులతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశం తర్వాత ఏ పార్టీలో చేరాలనే దానిపై రెండు రోజుల్లో ప్రకటించనున్నట్టు కొణతాల తేల్చి చెప్పారు. అంతేకాదు ఎంపీ స్థానం నుండి పోటీకి దిగుతానని కూడ ఆయన వ్యాఖ్యలు చేశారు.

78
కొణతాల రామకృష్ణతో గురువారం నాడు వైసీపీ నేతలు చర్చించినట్టు ప్రచారం సాగుతోంది. కొణతాల రామకృష్ణ వైసీపీలో చేరితే అనకాపల్లి ఎంపీ టిక్కెట్టు ఇస్తామని హామీ ఇచ్చినట్టు సమాచారం. తన అనుచరుడు గండీ బాబ్జీకి పెందుర్తి టిక్కెట్టు కూడ ఇవ్వాలని కొణతాల కోరినట్టు సమాచారం.

88
గత ఎన్నికల సమయంలో కూడ కొణతాల రామకృష్ణ శుక్రవారం నాడు జగన్‌తో భేటీ అయిన తర్వాత వైసీపీలో చేరిక విషయమై ప్రకటన చేసేవారని ఆయన వర్గీయులు చెబుతున్నారు.అయితే వైఎస్ వివేకానందరెడ్డి మృతితో శుక్రవారం నాడు వైసీపీలో చేరికలు వాయిదా పడ్డాయి.