ఏపీలో టీడీపీ అగ్రనేతల వారసుల ఓటమి

First Published May 27, 2019, 1:35 PM IST

 టీడీపీ అగ్రనేతల వారసులు ఈ ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు.వైసీపీ ప్రభంజనంతో  టీడీపీకి గట్టి పట్టున్న అసెంబ్లీ నియోజకవర్గాల్లో కూడ ఆ పార్టీ అభ్యర్థులు ఓటమి పాలయ్యారు.తొలిసారిగా ఎన్నికల్లో పోటీ చేసిన వారిలో ఎక్కువ మంది ఓటమి పాలయ్యారు.
 

టీడీపీ చీఫ్ చంద్రబాబునాయుడు తనయుడు నారా లోకేష్ మంగళగిరి అసెంబ్లీ స్థానం నుండి 2019 ఎన్నికల్లో తొలిసారిగా పోటీ చేసి ఓటమి పాలయ్యాడు వైసీపీ అభ్యర్ధి ఆళ్ల రామకృష్ణారెడ్డి చేతిలో లోకేష్ ఓటమి పాలయ్యాడు.
undefined
మాజీ మంత్రి గౌతు శ్యాం సుందర్ శివాజీ కూతురు గౌతు శిరీష ఈ దఫా పలాస నుండి పోటీ చేశారు. టీడీపీ శ్రీకాకుళం జిల్లా అధ్యక్షురాలిగా శిరీష పనిచేస్తున్నారు. శిరీష తొలిసారిగా పలాస నుండి పోటీ చేసి ఓడిపోయారు. పార్టీ అధ్యక్షురాలిగా జిల్లాలోని పార్టీ నేతలను సమన్వయం చేయడంలో శిరీషపై చంద్రబాబునాయుడు ప్రశంసలు కురిపించారు. తొలిసారిగా ఆమె పలాస అసెంబ్లీ నుండి పోటీ చేసి ఓడిపోయారు.
undefined
కర్నూల్ జిల్లా పత్తికొండ అసెంబ్లీ స్థానం నుండి కేఈ కృష్ణమూర్తి తనయుడు కేఈ శ్యాంబాబు తొలిసారిగా పోటీ చేసి ఓటమి పాలయ్యాడు. ఈ దఫా కేఈ కృష్ణమూర్తి పోటీ చేయలేదు. పత్తికొండ నుండి తనయుడు శ్యాంబాబుకు టిక్కెట్టు ఇప్పించారు. కానీ,ఈ ఎన్నికల్లో శ్యాంబాబుపై చెరుకుపాడు నారాయణరెడ్డి భార్య శ్రీదేవి విజయం సాధించారు.
undefined
కర్నూల్ జిల్లా ఆళ్లగడ్డ అసెంబ్లీ స్థానం నుండి పోటీ చేసిన మంత్రి భూమా అఖిలప్రియ ఓటమి పాలయ్యారు. గత ఎన్నికల్లో భూమా అఖిలప్రియ వైసీపీ అభ్యర్ధిగా పోటీ చేసి విజయం సాధించారు. ఆ తర్వాత ఆమె టీడీపీలో చేరారు. ఈ దఫా టీడీపీ అభ్యర్ధిగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు గంగుల ప్రభాకర్ రెడ్డి తనయుడు బ్రిజేంద్రనాథ్ రెడ్డి చేతిలో భూమా అఖిలప్రియ ఓటమి చెందారు. భూమా నాగిరెడ్డి , శోభా నాగిరెడ్డి దంపతుల కూతురే అఖిలప్రియ
undefined
నంద్యాల ఉప ఎన్నికల్లో టీడీపీ అభ్యర్ధిగా గెలిచిన భూమా బ్రహ్మనందరెడ్డి ఇదే స్థానం నుండి టీడీపీ అభ్యర్ధిగా పోటీ చేసి ఓటమి పాలయ్యాడు. భూమా నాగిరెడ్డి సోదరుడు వీర శేఖర్ రెడ్డి తనయుడే భూమా బ్రహ్మనందరెడ్డి. భూమా కుటుంబం నుండి పోటీ చేసిన ఇద్దరు ఈ దఫా ఓటమి పాలయ్యారు.
undefined
అనంతపురం జిల్లా రాఫ్తాడు అసెంబ్లీ నియోజకవర్గం నుండి టీడీపీ అభ్యర్ధిగా తొలిసారి పరిటాల శ్రీరామ్ పోటీ చేసి ఓటమి పాలయ్యాడు. గతంలో ఇదే అసెంబ్లీ స్థాం నుండి పరిటాల సునీత టీడీపీ అభ్యర్ధిగా విజయం సాధించారు.
undefined
చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి అసెంబ్లీ స్థానం నుండి మాజీ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి తనయుడు బొజ్జల సుధీర్ రెడ్డి టీడీపీ అభ్యర్ధిగా పోటీ చేసి ఓటమి పాలయ్యాడు. ఈ నియోజకర్గం నుండి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి వరుసగా విజయం సాధిస్తున్నారు.
undefined
చిత్తూరు జిల్లాలోని నగరి అసెంబ్లీ స్థానం నుండి దివంగత గాలి ముద్దుకృష్ణమనాయుడు తనయుడు గాలి భానుప్రకాష్ పోటీ చేసి ఓటమి పాలయ్యాడు. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఈ స్థానం నుండి గాలి ముద్దుకృష్ణమనాయుడు పోటీ చేసి ఓటమి పాలయ్యాడు.ముద్దుకృష్ణమనాయుడుపై రోజా విజయం సాధించారు.
undefined
అరకు అసెంబ్లీ స్థానం నుండి టీడీపీ అభ్యర్ధిగా పోటీ చేసిన కిడారి సర్వేశ్వరరావు ఓటమి పాలయ్యాడు. గత ఎన్నికల్లో కిడారి సర్వేశ్వరరావు వైసీపీ అభ్యర్ధిగా పోటీ చేసి విజయం సాధించారు. ఆ తర్వాత ఆయన టీడీపీలో చేరారు. గత ఏడాది సర్వేశ్వరరావును మావోయిస్టులు చంపారు. దీంతో శ్రవణ్‌ను బాబు తన కేబినెట్‌లోకి తీసుకొన్నారు. శ్రవణ్ ఓటమి పాలయ్యారు.
undefined
మాజీ మంత్రి కిమిడి మృణాళిని తనయుడు నాగార్జున తొలిసారిగా ఎన్నికల బరిలోకి దిగారు. నాగార్జున వైసీపీ చేతిలో ఓటమి పాలయ్యారు.మృణాళినికి బదులుగా నాగార్జునకు చంద్రబాబు టిక్కెట్టు కేటాయించారు.
undefined
కృష్ణా జిల్లా గుడివాడ అసెంబ్లీ స్థానం నుండి టీడీపీ అభ్యర్ధిగా దేవినేని అవినాష్ పోటీ చేసి ఓడిపోయాడు. దివంగత మాజీ మంత్రి దేవినేని నెహ్రు తనయుడే దేవినేని అవినాష్. దేవినేని అవినాష్ కొడాలి నాని చేతిలో ఓడిపోయాడు.
undefined
విజయవాడ పశ్చిమ అసెంబ్లీ స్థానం నుండి మాజీ ఎమ్మెల్యే జలీల్ ఖాన్ కూతురు షబానా ఖతూన్ పోటీ చేసి ఓడిపోయారు. జలీల్ ఖాన్ కు బదులుగా ఖతూన్ ఈ స్థానం నుండి పోటీ చేశారు.
undefined
దివంగత మాజీ కేంద్ర మంత్రి ఎర్రన్నాయుడు తనయుడు రామ్మోహన్ నాయుడు శ్రీకాకుళం నుండి మరోసారి ఎంపీగా విజయం సాధించారు. గత ఎన్నికల్లో కూడ రామ్మోహన్ నాయుడు పోటీ చేసి నెగ్గారు. ఎర్రన్నాయుడు కూతురు ఆదిరెడ్డి భవానీ కూడ రాజమండ్రి సిటీ అసెంబ్లీ స్థానంలో విజయం సాధించారు.
undefined
మాజీ మంత్రి జేసీ దివాకర్ రెడ్డి తనయుడు జేసీ పవన్ కుమార్ రెడ్డి అనంతపురం ఎంపీ స్థానం నుండి పోటీ చేసి ఓటమి పాలయ్యాడు. తాడిపత్రి అసెంబ్లీ స్థానం నుండి జేసీ ప్రభాకర్ రెడ్డి తనయుడు అస్మిత్ రెడ్డి పోటీ చేసి ఓడిపోయాడు. పవన్ కుమార్ రెడ్డి, అస్మిత్‌లు తొలిసారి ఎమ్మెల్యేగా, ఎంపీ స్థానాలకు పోటీ చేశారు.
undefined
click me!