జగన్ మాట విని ఉంటే...తప్పులో కాలేసిన వంగవీటి రాధా

First Published May 24, 2019, 5:34 PM IST

విజయవాడ: వంగవీటి ఫ్యామిలీ అంటే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రత్యేక గుర్తింపు ఉంది. రాజకీయ పార్టీలు సైతం వారికంటూ ప్రత్యేక గుర్తింపునిస్తాయి. అయితే ఈ ఎన్నికలు మాత్రం వంగవీటి రాధాకు వ్యతిరేక ఫలితాలు ఇచ్చాయి అని చెప్పాలి. 
 

విజయవాడ: వంగవీటి ఫ్యామిలీ అంటే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రత్యేక గుర్తింపు ఉంది. రాజకీయ పార్టీలు సైతం వారికంటూ ప్రత్యేక గుర్తింపునిస్తాయి. అయితే ఈ ఎన్నికలు మాత్రం వంగవీటి రాధాకు వ్యతిరేక ఫలితాలు ఇచ్చాయి అని చెప్పాలి.
undefined
వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కీలక స్థానంలో ఉన్న వంగవీటి రాధాకృష్ణ విజయవాడ సెంట్రల్ సీటు విషయంలో నెలకొన్న విభేదాల నేపథ్యంలో ఆయన పార్టీ వీడారు. విజయవాడ సెంట్రల్ సీటును ఆశించిన వంగవీటి రాధాను వైయస్ జగన్మోహన్ రెడ్డి విజయవాడ తూర్పు నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని ఆదేశించారు.
undefined
లేకపోతే మచిలీపట్నం లోక్ సభ నియోజకవర్గం నుంచి అయినా పోటీ చేయాలని జగన్ సూచించారు. అయితే అందుకు రాధాకృష్ణ ససేమిరా అన్నారు. విజయవాడ తూర్పు నియోజకవర్గం వైసీపీ గెలిచే అవకాశం ఉందని అందువల్ల అక్కడ నుంచి పోటీ చేయాలని కోరినా రాధా తిరస్కరించడంతో మల్లాది విష్ణును విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్తగా నియమించారు.
undefined
ఆనాటి నుంచి రాధా కొంతకాలం వైసీపీకి దూరంగా ఉన్నారు. ఆయన వైసీపీ వీడతారంటూ వార్తలు వచ్చిన నేపథ్యంలో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కీలక నేతలు ఆయనను పార్టీ వీడొద్దంటూ బుజ్జగింపులకు దిగాయి.
undefined
విజయసాయిరెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, బొత్స సత్యనారాయణ, కొడాలి నాని, శ్రీకాంత్ రెడ్డి, అంబటి రాంబాబులతోపాటు కీలక నేతలంతా వైసీపీని వీడొద్దంటూ కోరారు. కానీ వంగవీటీ రాధా మాత్రం వైసీపీకి గుడ్ బై చెప్పి సైకిలెక్కేశారు.
undefined
తెలుగుదేశం పార్టీలో చేరిన సందర్భంగా వంగవీటి రాధా వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డిపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. జగన్ వెన్నపోటు దారుడంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. నిలకడలేని వ్యక్తి జగన్ అని ఆయనతో చిక్కులు తప్పవంటూ చెప్పుకొచ్చారు.
undefined
అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు ఇచ్చే తీర్పుతో జగన్ వెన్నులో వణుకుపుట్టాలని అంతేకాకుండా ఆయన హైదరాబాద్ పారిపోవాలంటూ పిలుపునిచ్చారు. అంతేకాదు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీని రాష్ట్రంలో అధికారంలోకి రాకుండా చేస్తానంటూ శపథం పూనారు.
undefined
తెలుగుదేశం పార్టీ స్టార్ కాంపైనర్ గా రాష్ట్రమంతటా తిరిగి వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ జగన్ పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. జగన్ కు ఓటేయోద్దు అంటూ ప్రచారం చేశారు. వంగవీటి రంగా అభిమానులంతా ఈసారి తెలుగుదేశం పార్టీకి ఓటెయ్యాల్సిన అవసరం వచ్చిందని స్పష్టం చేశారు.
undefined
జగన్‌ అధికారంలోకి వస్తే తీవ్ర నష్టం కలుగుతుందన్నారు. జగన్ నియంతలా, అహంబావిలా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ఎంపీలను, ఎమ్మెల్యేలను ఎప్పుడు రాజీనామా చెయ్యమంటాడో, ఎప్పుడు రోడ్డెక్కమంటాడో, తాను ఎప్పుడు రోడ్డు ఎక్కి దిగుతాడో వారికే తెలియని పరిస్థితుల్లో వైసీపీ నేతలు ఉన్నారని స్పష్టం చేశారు.
undefined
రాబోయే ఎన్నికల్లో గెలిచాక కూడా అసెంబ్లీకి రానని చెప్తాడేమోనన్న భయం జనంలో ఉందన్నారు. ఇలా వైయస్ జగన్ పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు చంద్రబాబు మళ్లీ సీఎం కావాలంటూ యాగాలు సైతం చేశారు వంగవీటి రాధా. ఇదిలా ఉంటే తెలుగుదేశం పార్టీలో చేరిన సందర్భంగా వంగవీటి రాధాకృష్ణకు చంద్రబాబు సముచిత స్థానం కల్పిస్తామని హామీ ఇచ్చారు.
undefined
వంగవీటి రాధాను పార్టీలో చేరడం వల్ల కాపు సామాజిక వర్గం ఓట్లు పడతాయని ఆయన చేరికను పదేపదే ప్రస్తావించారు చంద్రబాబు. వంగవీటి రాధాకు ఎమ్మెల్సీ పదవి ఇస్తారంటూ ప్రచారం జరిగింది. కానీ చంద్రబాబు అవకాశం వచ్చినా కూడా రాధాకు ఎమ్మెల్సీ పదవి ఇవ్వలేదు.
undefined
ఆలస్యంగా పార్టీలోకి వచ్చిన ఉద్యోగ సంఘాల నేత అశోక్ బాబును ఎమ్మెల్సీ చేశారు. దీంతో వంగవీటి రాధా పరిస్థితి దయనీయంగా మారింది. ఎన్నికలు పూర్తయ్యాయి. టీడీపీ కేవలం 23 మంది ఎమ్మెల్యేలతోనే సరిపెట్టుకుంది. ఇప్పుడు వంగవీటి రాధాకు ఎమ్మెల్సీ ఇచ్చే అవకాశం కూడా లేని పరిస్థితి.
undefined
వద్ద క్యూ కట్టి ఉన్నారు. దీంతో తెలుగుదేశం పార్టీ తరపున ఈ ఐదేళ్లలో వంగవీటి రాధాకు ఏ పదవీ దక్కే అవకాశం లేదని ప్రచారం జరుగుతుంది. అదే వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉంటే సముచిత స్థానం కల్పించేవారని గుసగుసలు వినిపిస్తున్నాయి
undefined
మచిలీపట్నం ఎంపీగా పోటీచేసి ఉంటే ఈ వేవ్ లో రాధాకృష్ణ గెలిచేవారని చెప్పుకుంటున్నారు. ప్రస్తుతం మచిలీపట్నం ఎంపీగా వల్లభనేని బాలశౌరి గెలిచిన విషయం తెలిసిందే. ఇకపోతే విజయవాడ సెంట్రల్ సీటు నుంచి పోటీచేసిన మల్లాది విష్ణుసైతం స్వల్ప ఓట్ల తేడాతో గెలుపొందారు.
undefined
అయితే విజయవాడ తూర్పు మాత్రం వైసీపీ కోల్పోయింది. టీడీపీ అభ్యర్థి గద్దె రామ్మెహన్ గెలిచారు. అదే రాధా పోటీ చేసి ఉంటే అది కూడా వైసీపీ ఖాతాలోనే పడేదని సమాచారం. ఇకపోతే వంగవీటి రాధాకు మంచి స్నేహితులైన కొడాలి నాని గుడివాడ నుంచి గెలుపొందగా మరో మిత్రుడు వల్లభనేని వంశీమోహన్ సైతం గన్నవరం నుంచి గెలుపొందారు.
undefined
అదే రాధా వైసీపీలో ఉండిఉంటే ఖచ్చితంగా ఎమ్మెల్యే అయి ఉండేవారని చెవులు కొరుక్కుంటున్నారు. ఎమ్మెల్యేకాకపోయినా నామినేటెడ్ పదవి అయినా ఇచ్చేవారని కానీ రాధా తొందర పడ్డారని బెజవాడ వాసులు అభిప్రాయపడుతున్నారు.
undefined
వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండటంతో ఆయన భవిష్యత్ మరింత బాగుండేదని ఆయన అభిమానులు అభిప్రాయపడుతున్నారు. పోనీ వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి చేరుదామనుకున్న వైయస్ జగన్ ఛాన్స్ ఇచ్చే పరిస్థితి లేదని తెలుస్తోంది.
undefined
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సైతం తనను విమర్శించని రీతిలో రాధా విమర్శించారని సన్నిహితుల వద్ద జగన్ వాపోయారట. ఇలాంటి పరిస్థితుల్లో రాధాకు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ షట్టర్ క్లోజ్ చేసినట్లు తెలుస్తోంది. దీంతో ప్రస్తుతం వంగవీటి రాధా పరిస్థితి రెండింటికి చెడ్డ రేవడిలా తయారైందని వార్తలు వినిపిస్తున్నాయి.
undefined
click me!