పవన్ కల్యాణ్ 'మాయ'జాలం: జగన్ కు కౌంటర్, కేసీఆర్ లాగే చంద్రబాబు

First Published Mar 16, 2019, 4:30 PM IST

అమరావతి: జనసేన అధినేత పవన్ కల్యాణ్ అనూహ్యంగా బిఎస్పీ అధినేత మాయావతితో దోస్తీ కట్టడం చాలా మందిని ఆశ్చర్యపరిచే ఉంటుంది. కానీ, పకడ్బందీ వ్యూహంలో భాగంగానే ఆయన మాయావతిని కలిసి పొత్తు పెట్టుకున్నట్లు అర్థమవుతోంది. పొత్తు పెట్టుకోవడానికి ఎపిలో మాయావతి బలం ఎంత ప్రశ్న రావచ్చు. కానీ, అదే ఫలితాలను తారుమారు చేయవచ్చు కూడా.

అమరావతి: జనసేన అధినేత పవన్ కల్యాణ్ అనూహ్యంగా బిఎస్పీ అధినేత మాయావతితో దోస్తీ కట్టడం చాలా మందిని ఆశ్చర్యపరిచే ఉంటుంది. కానీ, పకడ్బందీ వ్యూహంలో భాగంగానే ఆయన మాయావతిని కలిసి పొత్తు పెట్టుకున్నట్లు అర్థమవుతోంది. పొత్తు పెట్టుకోవడానికి ఎపిలో మాయావతి బలం ఎంత ప్రశ్న రావచ్చు. కానీ, అదే ఫలితాలను తారుమారు చేయవచ్చు కూడా.
undefined
గత కొంత కాలంగా పవన్ కల్యాణ్ తెలుగుదేశం పార్టీ అధినేత, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిపై, ఆయన తనయుడు నారా లోకేష్ పై విమర్శలు చేయడం లేదు. కొన్నాళ్ల క్రితం వారిద్దరినీ పవన్ కల్యాణ్ ఉతికి ఆరేసినట్లే చేశారు. కానీ అకస్మాత్తుగా తన మాటల దాడిని ఆపేశారు.
undefined
ఇటీవల రాజమండ్రి సభలో ప్రధానంగా వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ప్రధానంగా టార్గెట్ చేశారు. ఆయన తీవ్రమైన విమర్శలు చేశారు. కానీ, చంద్రబాబును, నారా లోకేష్ ను పల్లెత్తు మాట కూడా అనలేదు. దీన్నిబట్టి ఆయన వైఎస్ జగన్మోహన్ రెడ్డిని మాత్రమే టార్గెట్ చేసుకున్నారని అర్థమవుతోంది
undefined
ప్రస్తుతానికైతే పవన్ కల్యాణ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశాలు లేవనే అంచనానే కొనసాగుతోంది. ఈ స్థితిలో రాజకీయంగా ప్రధాన ప్రత్యర్థిగా భావిస్తున్న వైఎస్ జగన్ విజయావకాశాలను దెబ్బ తీయడమే లక్ష్యంగా పవన్ పనిచేస్తున్నట్లు రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు.
undefined
మాయావతి బిఎస్పీకి ఎపిలో దళితుల మద్దతు లభిస్తుంది. దళితులు ప్రస్తుతం వైఎస్సార్ కాంగ్రెసు వైపు ఉన్నారనే అంచనా ఉంది. దళితుల్లో చీలిక తేవడానికి లేదా మొత్తంగా దళితుల ఓట్లను తన వైపు తిప్పుకుని జగన్ దెబ్బ తీయడం పవన్ కల్యాణ్ బిఎస్పీతో పొత్తు పెట్టుకోవడంలోని ఎత్తుగడగా భావిస్తున్నారు.
undefined
మాయావతితో పొత్తు వల్ల జగన్ ఓట్లు చీలిపోయి జనసేనకు పడితే, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి విజయావకాశాలు పెరుగుతాయని అంచనా వేస్తున్నారు తెలంగాణలో తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు అనుసరించిన వ్యూహమే ఇది
undefined
చంద్రబాబు వ్యూహం కూడా కేసీఆర్ వ్యూహంలాగే కనిపిస్తోంది. తెలంగాణలో బిఎల్ఎఫ్, బిజెపిలు విడిగా పోటీ చేయడం వల్ల ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోయింది. ఇప్పుడు పవన్ కల్యాణ్ తో వామపక్షాలు, బిఎస్పీ పొత్తు పెట్టుకోవడం వల్ల చంద్రబాబుకు ఎపిలో కేసీఆర్ కు తెలంగాణలో జరిగిన మేలే జరుగుతుందని భావిస్తున్నారు
undefined
click me!