దాడి, కొణతాలకు జగన్ షాక్: టీడీపీ వైపు కొణతాల

First Published Mar 18, 2019, 11:45 AM IST

 ఉత్తరాంధ్రలో సీనియర్‌ నేతలుగా ముద్రపడిన కొణతాల రామకృష్ణ, దాడి వీరభద్రరావులకు వైసీపీ టిక్కెట్లు కేటాయించలేదు. 2014 ఎన్నికల తర్వాత వీరిద్దరూ కూడ వైసీపీకి దూరమయ్యారు. 
 

ఉత్తరాంధ్రలో సీనియర్‌ నేతలుగా ముద్రపడిన కొణతాల రామకృష్ణ, దాడి వీరభద్రరావులకు వైసీపీ టిక్కెట్లు కేటాయించలేదు. 2014 ఎన్నికల తర్వాత వీరిద్దరూ కూడ వైసీపీకి దూరమయ్యారు.
undefined
దాడి వీరభద్రరావు టీడీపీలో చేరాలని చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. జనసేనలో చేరాలని పవన్ కోరారు. కానీ, ఆయన చేరలేదు. 15 రోజుల క్రితం వదరకు కూడ దాడి వీరభద్రరావు తటస్థంగా ఉన్నారు. ఇటీవలనే ఆయన తన ఇద్దరు కొడుకులతో కలిసి వైసీపీలో చేరారు.
undefined
ఉత్తరాంధ్ర సమస్యలపై కొణతాల రామకృష్ణ కార్యక్రమాలు నిర్వహించారు. దాడి వీరభద్రరావు తన ఇద్దరు కొడుకులతో కలిసి ఇటీవలనే వైసీపీలో చేరారు. కొణతాల రామకృష్ణ మాత్రం వైసీపీ కండువా కప్పుకోకుండానే తిరుగుముఖం పట్టారు. అయితే వీరిద్దరికి కూడ వైసీపీ చీఫ్ జగన్ టిక్కెట్లను కేటాయించలేదు.
undefined
మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ టీడీపీలో చేరుతారని కొంతకాలంగా ప్రచారం సాగుతోంది. ఇటీవలనే కొణతాల రామకృష్ణ రెండు దఫాలు ఏపీ సీఎం చంద్రబాబునాయుడుతో భేటీ అయ్యారు. ఈ నెల 17వ తేదీన కొణతాల టీడీపీలో చేరడానికి ముహుర్తం కూడ ఖరారు చేసుకొన్నారని అప్పట్లో ప్రచారం సాగింది.
undefined
అయితే అదే సమయంలో చంద్రబాబునాయుడు అనకాపల్లి ఎంపీ టిక్కెట్టును ఆడారి ఆనంద్‌కు కేటాయించారు. ఈ విషయమై తనకు మాట మాత్రం కూడ చెప్పకపోవడంపై కొణతాల రామకృష్ణ అసంతృప్తికి గురయ్యాడు. ఇదే సమయంలో వైసీపీ నుండి కొణతాలకు ఆఫర్ వచ్చినట్టుగా ప్రచారం సాగింది.
undefined
ఈ నెల 16వ తేదీన కొణతాల రామకృష్ణ జగన్‌తో భేటీ అయిన తర్వాత వైసీపీ కండువా కప్పుకోకుండానే వెళ్లిపోయారు. కొణతాల వైసీపీలో చేరలేదని ఆయన ప్రకటించారు. కొణతాల కంటే ముందే దాడి వీరభద్రరావు తన ఇద్దరు కొడుకులతో కలిసి వైసీపీలో చేరారు.
undefined
దాడి కుటుంబానికి అనకాపల్లి ఎంపీ సీటు లేదా అనకాపల్లి అసెంబ్లీ సీటు ఇస్తామని వైసీపీ నాయకత్వం హామీ ఇచ్చినట్టుగా ప్రచారం సాగింది. దాడితో పాటు ఆయన కొడుకుల కూడ వైసీపీ లిస్ట్‌లో చోటు దక్కలేదు.ఎన్నికల తర్వాత దాడి వీరభద్రరావు కుటుంబంలో ఒకరికి నామినేటేడ్ పదవిని ఇచ్చే అవకాశం ఉందని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
undefined
కొణతాల మాత్రం తనపై విధించిన సస్పెన్షన్‌ను ఎత్తివేస్తే సరిపోతోందని జగన్‌ వద్ద చెప్పినట్టు ప్రచారం సాగుతోంది. కండువా కప్పుకోకుండానే కొణతాల వెళ్లిపోయారు. ఈ కారణంగానే అనకాపల్లి ఎంపీ సీటును డాక్టర్ సత్యవతికి కేటాయించినట్టుగా చెబుతున్నారు.
undefined
మరోవైపు విశాఖ సిటీలో పార్టీని కాపాడుకొన్న వారికి కాకుండా కొత్తగా పార్టీలో చేరిన వారికి టిక్కెట్లు కేటాయించడంపై వైసీపీ నేతలు నిరసనలకు దిగారు. వంశీకృష్ణ వర్గీయులు విశాఖలో ఆందోళనకు దిగిన విషయం తెలిసిందే.
undefined
ఇదిలా ఉంటే సోమవారం నాడు మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ చంద్రబాబుతో భేటీ అయ్యారు. కొణతాల టీడీపీ తీర్థం పుచ్చుకొంటారా అనే విషయమై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది.
undefined
click me!