ఏపీ అసెంబ్లీలో చంద్రబాబు రికార్డు ఇదీ...

First Published May 24, 2019, 11:47 AM IST

 ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీలో ప్రతిపక్షనేత పదవిని తీసుకొంటే చంద్రబాబునాయుడు మరో కొత్త రికార్డును సృష్టించే అవకాశాలు ఉన్నాయి.
 

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2004 నుండి 2009 వరకు ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా చంద్రబాబునాయుడు కొనసాగారు. 2004 ఎన్నికల్లో వైఎస్ఆర్ సీఎంగా ఉన్నారు. 2009 ఎన్నికల్లో వైఎస్ఆర్ రెండోసారి సీఎం అయ్యారు. సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన కొద్ది రోజుల్లోనే వైఎస్ఆర్ మృతి చెందాడు. ఆ తర్వాత రోశయ్య, కిరణ్ కుమార్ రెడ్డిలు ముఖ్యమంత్రులుగా కొనసాగారు.
undefined
2019 ఎన్నికల్లో వైసీపీ చీఫ్ వైఎస్ జగన్ సీఎంగా ఎన్నికయ్యారు. ఈ ఎన్నికల్లో టీడీపీ ఘోర పరాజయం పాలైంది. కేవలం 23 స్థానాల్లో టీడీపీ విజయం సాధించింది. ఈ దఫా ప్రతిపక్ష నేత పదవిని చంద్రబాబు స్వీకరిస్తారా... లేదా టీడీపీకి చెందిన మరో ఎమ్మెల్యేకు కట్టబెడతారా అనేది తేలాల్సి ఉంది.
undefined
undefined
ఒకవేళ చంద్రబాబునాయుడు విపక్ష పదవిని తీసుకొంటే వైఎస్ఆర్‌, ఆయన తనయుడు సీఎంలుగా కొనసాగిన సమయాల్లో చంద్రబాబునాయుడు విపక్షనేతగా కొనసాగినట్టుగా రికార్డు సృష్టిస్తారు.
undefined
చంద్రబాబునాయుడు తనయుడు నారా లోకేష్ మంగళగిరి నుండి పోటీ చేసి ఓటమి పాలయ్యాడు. శ్రీకాకుళం జిల్లా టెక్కలి నుండి అచ్చెన్నాయుడు విజయం సాధించారు. అచ్చెన్నాయుడు వైఎస్ జగన్‌పై తీవ్ర విమర్శలు గుప్పించేవారు.
undefined
ఈ దఫా మరోసారి ఆయన అసెంబ్లీలో అడుగుపెట్టారు. చంద్రబాబునాయుడు ఈ పదవిని తీసుకోకపోతే అచ్చెన్నాయుడుకు ఈ పదవిని ఇస్తారా... అనే చర్చ కూడ లేకపోలేదు. అయితే ఈ విషయమై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది.
undefined
click me!