ఏపీలో ఇసుక కొరత తీవ్రమైన రాజకీయ దుమారాన్ని రేపుతోంది. ప్రతిపక్షాలు తీవ్రస్ధాయిలో ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నాయి. అటు ఇసుక కొరత కారణంగా భవన నిర్మాణ కార్మికులు ఉపాది లేక తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ప్రభుత్వం ఈ విషయంపై నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తుందని కార్మికులు మండిపడుతున్నారు. కొంత మంది కార్మకులు అత్మహత్యకు పాల్పడుతున్న ప్రభుత్వం ఈ విషయంపై చర్యలు తీసుకోకపోవడం లేదిని ప్రతిసక్షాలు విమర్శిస్తున్నాయి. వినూత్న రీతిలో తమ నిరసనలు తెలుపుతూ ప్రభుత్వ వైఖరిని ఎండగడతున్నాయి. ఆంధ్ర ప్రదేశ్ లో నెలకొన్న ఇసుక కొరత కారణంగా నిర్మాణరంగం మొత్తం స్తంభించింది. దీంతో ఈ రంగంపైనే ఆధారపడ్డ కార్మికులు రోడ్డునపడ్డారు.