కేసీఆర్, జగన్ మధ్య లింక్: అక్కడ స్వరూపానందేంద్ర, ఇక్కడ చినజీయర్ స్వామి

First Published Mar 3, 2019, 11:14 AM IST

తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావుకు, వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి మధ్య లింక్స్ బలంగానే ఏర్పడినట్లు కనిపిస్తున్నాయి. చంద్రబాబుకు రిటర్న్ గిఫ్ట్ ఇవ్వడానికి అవసరమైన ఏర్పాట్లను కేసీఆర్ చేసినట్లు భావిస్తున్నారు.

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని ఓడించడానికి తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావుకు, వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి మధ్య లింక్స్ బలంగానే ఏర్పడినట్లు కనిపిస్తున్నాయి. చంద్రబాబుకు రిటర్న్ గిఫ్ట్ ఇవ్వడానికి అవసరమైన ఏర్పాట్లను కేసీఆర్ చేసినట్లు భావిస్తున్నారు.
undefined
వైఎస్ జగన్ శనివారం ఢిల్లీ నుంచి వస్తూనే చినజీయర్ స్వామిని కలిసి ఆయన ఆశీస్సులు తీసుకున్నారు. కేసీఆర్ కు చినజీయర్ స్వామి అత్యంత సన్నిహితుడనే విషయం అందరికీ తెలిసిందే. చినజీయర్ స్వామి ఆశీస్సులు తీసుకోవడం ద్వారా వచ్చే ఎన్నికల్లో విజయం సాధిస్తామని జగన్ నమ్మకమై ఉండవచ్చు. కానీ కేసీఆర్ కు, జగన్ కు మధ్య ఉన్న లింక్ ను ఇది బయటపెడుతుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు
undefined
మరోవైపు విశాఖపట్నంలోని శారదాపీఠం అధిపతి స్వరూపానందేంద్ర కూడా జగన్ కు, కేసీఆర్ కు సన్నిహితులే. వారిద్దరు కూడా స్వరూపానందేంద్ర ఆశీస్సులు తీసుకుంటూ ఉంటారు. ఈ విషయం అందరికీ తెలిసిందే. పైగా, చంద్రబాబును ఓడిస్తానని స్వరూపానందేంద్ర బహిరంగంగా ప్రకటన కూడా చేశారు
undefined
తెలంగాణలో చినజీయర్ స్వామి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్వరూపానందేంద్ర స్వామి చంద్రబాబుకు వ్యతిరేకంగా పనిచేస్తారని భావిస్తున్నారు. కేసీఆర్ కు, జగన్ కు మధ్య వారధిగా వారిద్దరు పనిచేస్తున్నారనే భావన ప్రజల్లో కూడా బలపడింది
undefined
click me!