చంద్రబాబు ఆపరేషన్: రోజా, కొడాలి నాని సహా ఆరుగురు టార్గెట్

First Published Mar 2, 2019, 7:00 PM IST

విజయవాడ: రాజకీయ పార్టీలు ఏవైనా తమ పార్టీ అభ్యర్థులను గెలుపించుకోవడమే ప్రధాన లక్ష్యంగా పావులు కదపడం సహజం. సొంత పార్టీ అభ్యర్థులు గెలవడమే లక్ష్యంగా వ్యూహాలు కదపడం సహజం. కానీ ఏపీ రాజకీయాల్లో సీన్ రివర్స్ అవుతోంది. అధికార తెలుగుదేశం పార్టీ తమ అభ్యర్థులను గెలిపించుకునే దానికంటే ప్రత్యర్థి పార్టీ అభ్యర్థులను ఓడించడమే లక్ష్యంగా పావులు కదుపుతోంది. 

ఈ నేపథ్యంలో నారా లోకేష్ భీమిలి నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారంటూ ఊహాగానాలు వినిపిస్తున్నాయి. భీమిలి నియోజకవర్గం ఏర్పడిన తర్వాత 9సార్లు అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. ఆ ఎన్నికల్లో 6సార్లు తెలుగుదేశం పార్టీ విజయం సాధించింది. 2014 ఎన్నికల్లో కూడా తెలుగుదేశం పార్టీ గెలిచింది.
undefined
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కీలకంగా ఉన్న ఆరుగురు ఎమ్మెల్యేలను టార్గెట్ చేసిన తెలుగుదేశం పార్టీ వారిని ఎట్టి పరిస్థితుల్లో ఓడించాలనే కంకణం కట్టుకుంది. ఆ అభ్యర్థుల ఓటమిపైనే తెలుగుదేశం పార్టీ ప్రత్యేకంగా గురిపెట్టింది. ప్రతిపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో బలమైన నాయకులు కొడాలి నాని, రోజా, బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, అనిల్ కుమార్ యాదవ్, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి.
undefined
ఈ ఆరుగురు ఎమ్మెల్యేలు అధికార తెలుగుదేశం పార్టీపై విరుచుకుపడతారు. అసెంబ్లీలో అన్ని అంశాలపై అధికార పార్టీని ఇరుకున పెట్టగల సమర్థవంతమైన నాయకులు. అసెంబ్లీ సమావేశాల్లో మీడియా పాయింట్ దగ్గరకు వీరు వచ్చారంటే అధికార పార్టీ దుమ్ముదులపకుండా వదలరు. అంతేకాదు వీరికి మాస్ ఫాలోయింగ్ విపరీతంగా ఉందని చెప్పాలి.
undefined
తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేగా గెలుపొంది అసెంబ్లీలో అడుగుపెట్టిన ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. గుడివాడ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి వరుసగా గెలుపొందుతూ తన నియోజకవర్గాన్నే ఇంటిపేరుగా మార్చేసుకున్నారు. కొడాలి నాని కంటే గుడివాడ నానిగానే గుర్తింపు పొందారు.
undefined
undefined
చంద్రబాబు నాయుడు వద్ద రాజకీయ శిష్యరికం చేసిన కొడాలి నాని ఆయనను తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ఇటీవలే గుడ్డలూడదీసి కొడతారు, నీ అంతు చూస్తా అంటూ చంద్రబాబుపై విరుచుకుపడ్డారు. తనదగ్గర రాజకీయ ఓనమాలు నేర్చుకున్న నాని తన పక్కలో బళ్లెంలా తయారవ్వడంపై చంద్రబాబు ఆగ్రహంతో రగిలిపోతున్నారు.
undefined
వచ్చే ఎన్నికల్లో గుడివాడ నానిని ఓడించేందుకు బలమైన అభ్యర్థులను బరిలోకి దింపాలని ఆలోచిస్తున్నారు. ప్రస్తుత నియోజకవర్గ ఇంచార్జ్ రావి వెంకటేశ్వరరావును బరిలోకి దించాలని చూస్తున్నారు. ఒకవేళ రావివెంకటేశ్వరరావు గనుక వెనకడుగు వేస్తే యువనేత దేవినేని అవినాష్ లను బరిలోకి దించాలని చంద్రబాబు నాయుడు కసరత్తు చేస్తున్నారు.
undefined
మరోవైపు నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజాను ఎలాగైనా ఓడించాలని పట్టుదలతో ఉన్నారు చంద్రబాబు నాయుడు. గాలి ముద్దుకృష్ణమ నాయుడు తనయుడు గాలి భాను ప్రకాశ్ ను బరిలోకి దించాలని చూస్తున్నారు. ఎలా అయినా రోజాను ఓడించాలని లోకేష్ మంచి కసితో ఉన్నారు.
undefined
రోజా గన్నేరు పప్పు, ముద్దపప్పు అంటూ లోకేష్ పై తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో రోజా నోటికి తాళం వెయ్యాలంటే ఆమెను ఓడించడమే లక్ష్యమంటూ చంద్రబాబు, లోకేష్ లు గట్టి నిర్ణయంతో ఉన్నారట.
undefined
మరో ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి. చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గం ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఈయనకు చంద్రగిరి నియోజకవర్గంలో మంచి పట్టుంది. రాబోయే ఎన్నికల్లో ఆయనను ఓడించాలని చంద్రబాబు వ్యూహాలు రచిస్తున్నారు. ఇప్పటికే టీడీపీ జిల్లా అధ్యక్షుడు పులివర్తి నానిని అక్కడ అభ్యర్థిగా ప్రకటించారు కూడా. ఇప్పటికే పులివర్తి నాని ఎన్నికల ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు.
undefined
ఇకపోతే ఇటీవలే చంద్రగిరి నియోజకవర్గంలో టీడీపీ, వైసీపీల మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. వైసీపీ నేతల అరెస్టుతో ఆనియోజకవర్గంలో అలజడి రేగింది. దీంతో టీడీపీ కావాలనే అధికారాన్ని అడ్డుపెట్టుకుని తనపై తప్పుడు కేసులు పెట్టి వేధింపులకు పాల్పడుతోందని ఆరోపిస్తున్నారు.
undefined
మరోవైపు పీఏసీ చైర్మన్ బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో క్రియాశీలక నేత బుగ్గన. వైఎస్ జగన్ కు అండగా నిలుస్తున్నారు. కర్నూలు జిల్లా డోన్ నియోజకవర్గం నుంచి గెలుపొందిన ఈయన ప్రస్తుతం పీఏసీ చైర్మన్ గా వ్యవహరిస్తున్నారు.
undefined
అన్ని సబ్జెక్టులపై అనర్గళంగా మాట్లాడగల దమ్మున్న నేత. ఈయనను ఎలాగైనా ఓడించాలని మంచి కసితో ఉంది తెలుగుదేశం పార్టీ. ఇదే నియోజకవర్గం నుంచి డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి సోదరుడు కేఈ ప్రతాప్ ని బరిలోకి దించుతోంది.
undefined
వైసీపీలో మరో కీలక నేత అనిల్ కుమార్ యాదవ్. నెల్లూరు సిటీ ఎమ్మెల్యే అయిన అనిల్ కుమార్ యాదవ్ మంచి ఫాలోయింగ్ ఉన్న నేత. క్లాస్, మాస్ పబ్లిక్ విపరీతంగా ఆదరిస్తారు. వైఎస్ జగన్ కు సైనికుడులా నిత్యం ఆయన వెంటే ఉంటారు. నెల్లూరు సిటీ నియోజకవర్గంలో ఆయనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు.
undefined
రాజకీయ నాయకులను ఇమిటేట్ చేస్తూ అందర్నీ ఆడేసుకుంటారు. ఇటీవలే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను ఇమిటేట్ చేస్తూ సోషల్ మీడియాలో విపరీతమైన ట్రెండ్ సెట్ చేసుకున్నారు.
undefined
ఈయనను ఎట్టి పరిస్థితుల్లో ఓడించాలని అధికార తెలుగుదేశం పార్టీ వ్యూహరచన చేస్తోంది. అనిల్ కుమార్ ని ఓడించడమే లక్ష్యంగా ఏకంగా మంత్రి నారాయణను బరిలోకి దించుతోంది. నారాయణ సైతం ఈ గెలుపును ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు.
undefined
ఇదే నెల్లూరు నియోజకవర్గానికి చెందిన కీలక నేత కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి. అధికార పార్టీపై దుమ్మెత్తిపొయ్యడంలో సిద్ధహస్తుడు శ్రీధర్ రెడ్డి. అధికార పార్టీని అసెంబ్లీలోనూ, నియోజకవర్గంలోనూ ఇరుకున పెట్టడంలో ముందు వరుసలో ఉంటారు. అధికార పార్టీ తమ సమస్యలను పట్టించుకోకపోతే ప్రత్యక్షంగా నిరసనకు దిగుతారు.
undefined
ఇటీవలే ఒక డ్రైనేజ్ పై వంతెన నిర్మాణం విషయంలో ఏకంగా డ్రైనేజీలోనే దీక్షకు దిగారు. దీంతో అల్లంత దూరాన ఉన్న ప్రభుత్వం ఆయన డిమాండ్ ను నెరవేర్చేందుకు ఆయన దగ్గరకు చేరుకుంది అంటే ఆయన ప్రతాపం ఏంటో ఇట్టే అర్థం చేసుకోవచ్చు.
undefined
ఈ ముగ్గురు వైఎస్ జగన్ కు సైన్యంలా నిలుస్తున్నారు. నిత్యం తెలుగుదేశం పార్టీపైనా, చంద్రబాబు, లోకేష్ లపై తీవ్ర విమర్శలు చేస్తూ తిట్టని తిట్టు తిట్టకుండా తిడుతున్నారు. అందువల్ల వీరి నోటికి తాళం వేస్తే వైసీపీ వాయిస్ బయటకు రాదని తెలుగుదేశం పార్టీ ప్లాన్. ఈ నేపథ్యంలో వారి ఓటమే లక్ష్యంగా చంద్రబాబు అండ్ కో వ్యూహాలకు పదునుపెడుతున్నారు.
undefined
click me!