చిన్న అనుమానం వచ్చినా సమాచారం ఇవ్వాలి: దస్తగిరితో సీబీఐ అధికారులు

First Published | Apr 25, 2023, 6:25 PM IST

పులివెందులలో  దస్తగిరి  నివాసాన్ని సీబీఐ అధికారులు  ఇవాళ  పరిశీలించారు.  దస్తగిరి ఇంటి వద్ద భద్రతను  సీబీఐ అధికారులు పరిశీలించారు. 

వైఎస్ వివేకా హత్య కేసు

వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో   అఫ్రూవర్ గా మారిన  దస్తగిరి  ఇంటికి  మంగళవారంనాడు  సీబీఐ  అధికారులు  చేరుకున్నారు. దస్తగిరి  ఇంటి వద్ద  భద్రతను  సీబీఐ అధికారులు  పరిశీలించారు. దస్తగిరితో సీబీఐ అధికారులు మాట్లాడారు.   వైఎస్ వివేకానందరెడ్డి  హత్య కేసు విచారణ  కీలక దశ చేరుకున్నందున  జాగ్రత్తగా ఉండాలని సీబీఐ అధికారులు  దస్తగిరికి  సూచించారు.  

వైఎస్ వివేకా హత్య కేసు

ఏదైనా సమస్య ఉంటే వెంటనే  సమాచారం ఇవ్వాలని సీబీఐ అధికారులు దస్తగిరిని కోరారు.  ఏ చిన్న అనుమానం వచ్చినా కూడా  తమకు తెలపాలని  సీబీఐ  అధికారులు  దస్తగిరికి చెప్పారు. 
రెండు మూడు రోజులుగా సీబీఐ అధికారులు  పులివెందులలోనే మకాం వేశారు. 
 


వైఎస్ వివేకా హత్య కేసు

ఈ నెల  23న  వైఎస్ వివేకానందరెడ్డి  ఇంటిని  సీబీఐ అధికారులుపరిశీలించారు. అంతేకాదు  వైఎస్ అవినాష్ రెడ్డి ఇంటిని కూడా  సీబీఊ అధికారులు  పరిశీలించారు. వైఎస్ వివేకానందరెడ్డి  హత్య  కేసు విచారణ కీలక దశకు చేరుకుంది. ఈ కేసుకుసంబంధించి సీబీఐ అధికారులు  కీలక సమాచారాన్ని  సేకరిస్తున్నారు.అంతేకాదు  ఈ సమాచారానికి సంబంధించిన  ఆధారాలను  కూడా  సేకరించే పనిలో సీబీఐ  అధికారులున్నారు. 

వైఎస్ వివేకా హత్య కేసు

వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో  నిందితుడిగా  ఉన్న దస్తగిరి సీబీఐకి అఫ్రూవర్ గా  మారాడు.  2021 ఆగస్టు 30న దస్తగిరి  కన్ఫెన్షన్ స్టేట్ మెంట్  ఇచ్చారు. ఈ స్టేట్ మెంట్ లో  కీలక అంశాలను వెల్లడించారు. బెంగుళూరు ల్యాండ్ సెటిల్ మెంట్  విషయమై  హత్య జరిగిందని  దస్తగిరి  స్టేట్ మెంట్  ఇచ్చారు.    ఈ విషయమై  కుట్ర విషయాలను కూడా  దస్తగిరి  సీబీఐకి వివరించారు. ఈ స్టేట మెంట్ ఆధారంగా సీబీఐ విచారణ సాగిస్తుంది. ఈ విషయమై కొన్ని ఆధారాలను  సీబీఐ  సేకరించింది. 

వైఎస్ వివేకా హత్య కేసు

మరో వైపు  ఈ కేసులో  వైఎస్ భాస్కర్ రెడ్డి,  నివాసంలో  నిందితులు  ఉన్నారని సీబీఐ ఆరోపిస్తుంది . 
సీబీఐ ఆరోపణలను  వైఎస్ భాస్కర్ రెడ్డి, ఆయన తనయుడు  వైఎస్ అవినాష్ రెడ్డిలు తోసిపుచ్చుతున్నారు. 

వైఎస్ వివేకా హత్య కేసు

ఈ కేసులో అన్ని కోణాల్లో  సీబీఐ అధికారులు విచారణ జరుపుతున్నారు. వైఎస్ వివేకానందరెడ్డి  అల్లుడు, కూతురు వైఎస్ సునీతారెడ్డిలను కూడా సీబీఐ అధికారులు విచారించారు.

Latest Videos

click me!