రాయల తెలంగాణ
రాయలసీమ ఉద్యమంపై ఆ ప్రాంతానికి చెందిన నేతలు కొంత కాలంగా కార్యాచరణను సిద్దం చేస్తున్నారు. అయితే తాజాగా రాయల తెలంగాణ అంశాన్ని మాజీ మంత్రి జేసీ దివాకర్ రెడ్డి తెరమీదికి తీసుకువచ్చారు. ఈ విషయమై వేసవి తర్వాత కార్యాచరణను సిద్దం చేయనున్నట్టుగా జేసీ దివాకర్ రెడ్డి ప్రకటించారు.గ్రేటర్ రాయలసీమా, రాయల తెలంగాణలో దేనికి ప్రజల మద్దతు ఎక్కువగా ఉంటే దానికే కట్టుబడి ఉంటామని గంగుల ప్రతాప్ రెడ్డి చెప్పారు.
రాయల తెలంగాణ
రాష్ట్ర విభజనతర్వాత రాయలసీమ ఉద్యమంపై కొందరు సీనియర్ రాజకీయ నేతలు ప్రయత్నాలు ప్రారంభించారు. గతంలో కూడా రాయలసీమ సమస్యలపై పోరాటం చేసిన నేతలు మరోసారి ఈ అంశంపై కార్యాచరణను సిద్దం చేస్తున్నారు. ఈ విషయమై సభలు, సమావేశాలు నిర్వహిస్తున్నారు. నిన్న కర్నూల్ లో రాయలసీమ కర్తవ్య దీక్షను నిర్వహించారు. ఈ దీక్షలో పలు పార్టీలకు చెందిన రాయలసీమ నేతలు పాల్గొన్నారు.
రాయల తెలంగాణ
ఈ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ ఎంపీ గంగుల ప్రతాప్ రెడ్డి గ్రేటర్ రాయలసీమ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. చిత్తూరు, ప్రకాశం జిల్లాలతో కలుపుకొని గ్రేటర్ రాలయసీమను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.
రాయల తెలంగాణ
అయితే ఇదే సమావేశంలో పాల్గొన్న మాజీ మంత్రి జేసీ దివాకర్ రెడ్డి రాయల తెలంగాణ డిమాండ్ ను లేవనెత్తారు. రాష్ట్ర విభజన సమయంలో రాయల తెలంగాణ డిమాండ్ ను జేసీ దివాకర్ రెడ్డి లేవనెత్తిన విషయం తెలిసిందే.
రాయల తెలంగాణ
రాయల తెలంగాణకు చాలామంది మద్దతు ఉందని జేసీ దివాకర్ రెడ్డి ప్రకటించారు. ఈ విషయమై తాను చాలా మందితో మాట్లాడానని జేసీ దివాకర్ రెడ్డి ప్రకటించారు. రాయలతెలంగాణ చేస్తేనే నీటి సమస్య పరిష్కారం అవుతుందన్నారు. రాయలసీమలోని రెండు జిల్లాలను తెలంగాణలో కలపడాన్ని ఎవరూ వ్యతిరేకించరని ఆయన చెప్పారు.
రాయల తెలంగాణ
జేసీ దివాకర్ రెడ్డి చేసిన రాయల తెలంగాణ ప్రతిపాదనపై గంగుల ప్రతాప్ రెడ్డి స్పందించారు. గ్రేటర్ రాయలసీమ, రాయల తెలంగాణలలో దేనికి ప్రజలు మద్దతిస్తారో తాము కూడా అదే డిమాండ్ ను సమర్ధిస్తామని గంగుల ప్రతాప్ రెడ్డి ప్రకటించారు.
రాయల తెలంగాణ
రాయల తెలంగాఱ వ్యాఖ్యలపై తెలంగాణ మంత్రి జగదీష్ రెడ్డి స్పందించారు. పాలకుల్లో చిత్తశుద్ది లోపించడం వల్లే ఈ తరహా డిమాండ్లు వస్తాయన్నారు. కేసీఆర్ నాయకత్వాన్ని ఏపీ ప్రజలు కోరుకుంటున్నారని జగదీష్ రెడ్డి అభిప్రాయపడ్డారు. అభివృద్ది సాధించే నాయకత్వాన్ని ఎన్నుకోవాలని ఆయన కోరారు.