వైఎస్ సునీతారెడ్డి
ఉమ్మడి కడప జిల్లాలోని ప్రొద్దుటూరులో వైఎస్ సునీతా రెడ్డి పోస్టర్లు కలకలం రేపుతున్నాయి. రాజకీయాల్లోకి ప్రవేశిస్తున్న వైఎస్ సునీతారెడ్డికి స్వాగతం అంటూ పోస్టర్లు వెలిశాయి. ఈ పోస్టర్లపై టీడీపీ చీఫ్ చంద్రబాబునాయుడు ఫోటోలు కూడా ఉన్నాయి
వైఎస్ సునీతారెడ్డి
వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో వైఎస్ సునీతారెడ్డి టీడీపీతో కుమ్మక్కైందని కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి గతంలో ఆరోపణలు చేశారు.
వైఎస్ సునీతారెడ్డి
ప్రొద్దుటూరులోని పలు సెంటర్లలో ఈ పోస్టర్లు వేశారు. వైఎస్ సునీతారెడ్డి,ఆమె భర్త రాజశేఖర్ రెడ్డి, లోకేష్, టీడీపీకి చెందిన స్థానిక నేతల ఫోటోలను కూడా ఈ పోస్టర్లలో ఉన్నాయి. బెంగుళూరులో ఈ పోస్టర్లు ముద్రించినట్టుగా ఉంది.
వైఎస్ సునీతారెడ్డి
వైఎస్ వివేకానందరెడ్డి హత్య జరిగిన కొంతకాలం వరకు వైఎస్ సునీతారెడ్డి తనతో మంచిగానే ఉందని కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి ఇటీవల మీడియా సమావేశంలో ప్రకటించారు. టీడీపీ నేతలు చెప్పినట్టుగానే వైఎస్ సునీతారెడ్డి ఆరోపణలు చేస్తున్నారని వైఎస్ అవినాష్ రెడ్డి ఆరోపించారు.
వైఎస్ సునీతారెడ్డి
వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు దర్యాప్తు కీలక దశకు చేరుకుంది. ఈ హత్య కేసు విచారణను ఈ ఏడాది జూన్ 30 లోపుగా పూర్తి చేయాలని సుప్రీంకోర్టు నిన్న ఆదేశాలు జారీ చేసింది.
వైఎస్ సునీతారెడ్డి
ఈ తరుణంలో వైఎస్ సునీతారెడ్డి రాజకీయాల్లోకి వస్తున్నందుకు స్వాగతం అంటూ పోస్టర్లు అంటించడం చర్చకు దారితీసింది. వైఎస్ సునీతారెడ్డి రాజకీయాల్లోకి వస్తున్నారా లేదా అనే విషయమై ఇంకా స్పష్టత రాలేదు. ఈ విషయమై ఆమె ఇప్పటివరకు ఎలాంటి ప్రకటన చేయలేదు.