వైఎస్ షర్మిల కాంగ్రెస్ లో చేరడం.. ఏపీలో వైసీపీ గల్లంతు ఖాయం.. ఆదినారాయణరెడ్డి

Published : Jun 26, 2023, 08:54 AM IST

కడప : వైయస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైయస్ షర్మిలపై మాజీ మంత్రి బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఆదినారాయణ రెడ్డి ఊహగానాలు చేశారు. కడపలో ఆదివారం విలేకరులతో మాట్లాడుతూ  ఆదినారాయణరెడ్డి  వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరడం ఖాయమని చెప్పుకొచ్చారు. 

PREV
15
వైఎస్ షర్మిల కాంగ్రెస్ లో చేరడం.. ఏపీలో వైసీపీ గల్లంతు ఖాయం.. ఆదినారాయణరెడ్డి

కడప : వైయస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైయస్ షర్మిలపై మాజీ మంత్రి బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఆదినారాయణ రెడ్డి ఊహగానాలు చేశారు. కడపలో ఆదివారం విలేకరులతో మాట్లాడుతూ  ఆదినారాయణరెడ్డి  వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరడం ఖాయమని చెప్పుకొచ్చారు. 

25

కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత  వైఎస్ షర్మిల ఆంధ్రప్రదేశ్లోనూ తిరగడానికి నిర్ణయించుకున్నారు. షర్మిల, తన తల్లి  విజయమ్మ, కాంగ్రెస్ అధిష్టానం సోనియాగాంధీ, రాహుల్ గాంధీ వీరంతా కలిసి ఏపీలో తిరుగుతారు. అలా తిరిగితే ఏపీలో వైసీపీ గల్లంతవుతుంది’  అని  ఆదినారాయణ రెడ్డి అభిప్రాయపడ్డారు. 

35

‘కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి కరోనా సమయంలో రూ.1100 కోట్లు సాయం అందించింది. కానీ, సీఎం జగన్ మాత్రం ఒక్క పైసా కూడా ఖర్చు చేయలేదు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి 35లక్షల ఇళ్లు కేటాయించింది. కానీ, జగన్ 35వేలు మాత్రమే నిర్మించారు. తనకోసం మాత్రం ఆయన  ఐదు ప్యాలెస్ లు కట్టుకున్నారు. 

45

వీరితోపాటు రాష్ట్రంలో ఉన్న రిటైర్డ్ ఉద్యోగులు, ఉద్యోగులు,  నిరుద్యోగుల పరిస్థితి అతిదారణంగా మారింది. టీచర్లకు ఇంగ్లీష్ మీడియంలో బోధన చేయడంలో శిక్షణ ఇవ్వలేదు. కానీ ఇంగ్లీష్ మీడియం ప్రారంభించారు. దీంతో వారి పరిస్థితి దారుణంగా తయారయింది.

55

విశ్వేశ్వర్ రెడ్డికి  స్మార్ట్ మీటర్ల పేరుతో రూ.92వేల కోట్లు కట్టబెట్టారు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లోనూ సర్వనాశనం చేశారని ఆదినారాయణ రెడ్డి ఆరోపణలు గుర్తించారు. బిజెపి పార్టీ నుంచి ఆంధ్రప్రదేశ్ లో ఎవరూ బయటకు వెళ్ళరని.. పార్టీ బలోపేతానికి కృషి చేస్తున్నామని చెప్పారు. 
 
Read more Photos on
click me!

Recommended Stories