టీడీపీ చీఫ్ చంద్రబాబుకు చెక్ పెట్టేందుకు ఏపీ సీఎం వైఎస్ జగన్ దూకుడుగా వెళ్తున్నాడు.ప్రభుత్వానికి వ్యతిరేకంగా టీడీపీ చేపట్టే కార్యక్రమాల్లో ఆ పార్టీ నుండే మద్దతు లేదనే సంకేతాలు ఇచ్చేలా జగన్ వ్యూహత్మకంగా ముందుకు వెళ్తున్నాడు. ఇదే ప్లాన్ లో భాగంగా కీలకమైన సమయంలో ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేలు వైసీపీకి జై కొట్టేలా చేయడంలో జగన్ విజయం సాధించారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడ ఇదే రకంగా జగన్ వ్యవహరించారు. ఉమ్మడి ఏపీ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న సమయంలో తెలంగాణలో టిఆర్ఎస్ ఆంధ్ర ప్రాంతంలో వైసీపీ నుంచి తీవ్రమైన పోటీని చంద్రబాబు ఎదుర్కొన్నారు.
ఉమ్మడి రాష్ట్రంలో ప్రజల సమస్యలు తెలుసుకునేందుకు చంద్రబాబు నాయుడు ఆ సమయంలో పాదయాత్ర నిర్వహించారు ఈ పాదయాత్ర నిర్వహిస్తున్న సమయంలో తెలంగాణ ప్రాంతం నుండి టిడిపి కీలకమైన నేతలు ఎమ్మెల్యేలు టిఆర్ఎస్ పార్టీలో చేరారు.ఆంధ్ర, రాయలసీమ ప్రాంతానికి చెందిన టీడీపీ నేతలు, ఎమ్మెల్యేలు వైసీపీలో చేరారు.
పాదయాత్రతో పార్టీని బలోపేతం చేసుకొనేందుకు చంద్రబాబుకు ఉపయోగపడింది.పాదయాత్ర చేస్తున్న సమయంలోనే పార్టీని దెబ్బతీసేందుకు ఆ సమయంలో టీఆర్ఎస్, వైసీపీలు వ్యూహత్మకంగా వ్యవహరించాయి. పార్టీ పూర్తిగా దెబ్బతినకుండా క్యాడర్ లో మనోధైర్యం నింపేందుకు ఈ పాదయాత్ర ఉపయోగపడింది. ఆ సమయంలో అనుసరించిన వ్యూహన్ని ఇప్పుడు జగన్ ఏపీ రాష్ట్రంలో అమలు చేస్తున్నాడు.
విజయవాడలో ఇసుక కొరత ను నిరసిస్తూ ఏపీలో విజయవాడ కేంద్రంగా చంద్రబాబు నాయుడు చేపట్టిన దీక్ష చేపట్టాడు.అదే రోజున గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్ టీడీపీ చీఫ్ చంద్రబాబు నాయుడుకి వ్యతిరేకంగా గళం విప్పారు. ఏపీ సీఎం వైఎస్ జగన్ అనుకూలంగా మాట్లాడాడు.చంద్రబాబును, నారా లోకేష్ తీరును తీవ్రంగా తప్పుబట్టారు.
అమరావతిలోనే రాజధానిని కొనసాగించాలని రైతులు ఆందోళన చేస్తున్నారు.రైతుల ఆందోళన ఇవాళ్టికి 20వ రోజుకు చేరుకొంది. ఈ ఆందోళనలకు చంద్రబాబుతో పాటు ఆయన సతీమణి భువనేశ్వరీ కూడ మద్దతు తెలిపారు.రాజధాని ప్రాంతంలో ఇన్‌సైడర్ ట్రేడింగ్ జరిగిందని వైసీపీ నేతలు టీడీపీపై విమర్శలు గుప్పించారు. ఈ విమర్శకు టీడీపీ కూడ ధీటుగా సమాధానం చెప్పింది
రాజధాని ప్రాంతానికి చెందిన రైతుల ఆందోళనలు సాగుతున్న తరుణంలో గుంటూరు జిల్లాలో టీడీపీకి మరో షాక్ తగిలింది. గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే మద్దాల గిరి వైసీపీకి జై కొట్టారు. ఏపీ సీఎం వైఎస్ జగన్ ను కలిశారు. గిరి త్వరలోనే వైసీపీలో చేరే అవకాశం ఉంది.
చంద్రబాబునాయుడుకు స్వంత పార్టీలోనే మద్దతు లేదనే సంకేతాలు ఇచ్చే వ్యూహంతో జగన్ వ్యూహత్మకంగా ఆపరేషన్ ఆకర్ష్ ను ఉపయోగిస్తున్నాడు. ఈ వ్యూహంలో భాగంగానే అవసరమైన సమయంలోనే టీడీపీ నుండి వైసీపీలోకి ఎమ్మెల్యేలను ఆపరేషన్ ఆకర్ష్ మంత్రాన్ని అమలు చేస్తున్నారు.
అసెంబ్లీలో ఇప్పటికే గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ప్రత్యేక సీట్లో కూర్చున్నాడు.టీడీపీ నుండి వంశీ సస్పెన్షన్ కు గురయ్యాడు. తనకు ప్రత్యేక స్థానం కేటాయించాలని వంశీ కోరికను స్పీకర్ అంగీకరించి ప్రత్యేక స్థానాన్ని కేటాయించారు. గిరిపై పార్టీ సస్పెన్షన్ వేటు వేయలేదు. కానీ త్వరలో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో గిరి ఏ రకమైన వ్యూహన్ని అనుసరిస్తాడో చూడాలి.