మూడు రాజధానులు: వై‌ఎస్ జగన్ కు 'ప్రత్యేక'చిక్కులు, బి‌జే‌పి అస్త్రం అదే...

First Published Jan 4, 2020, 11:35 AM IST

ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ప్రస్తుతం రాజధాని చుట్టే తిరుగుతున్నాయి. అసెంబ్లీ శీతాకాల సమావేశాల చివరి రోజున ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ కి మూడు రాజధానులు రావొచ్చు అని  ఏ ముహూర్తాన అన్నాడో...అది మొదలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయాలు ఒక్కసారిగా ఊపందుకున్నాయి.

ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ప్రస్తుతం రాజధాని చుట్టే తిరుగుతున్నాయి. అసెంబ్లీ శీతాకాల సమావేశాల చివరి రోజున ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ కి మూడు రాజధానులు రావొచ్చు అని ఏ ముహూర్తాన అన్నాడో...అది మొదలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయాలు ఒక్కసారిగా ఊపందుకున్నాయి.
undefined
ఈ రాజధానుల అంశాన్ని అస్త్రంగా చేసుకొని రాజకీయాలు చేయాలని విపక్షాలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. కానీ జగన్ తీసుకున్న ఈ నిర్ణయం ఇప్పుడు జగన్ కంచుకోటైన రాయలసీమ ప్రాంతమే అతని చెతిలొనుంచి జారిపోయే ప్రమాదం కూడా లేకపోలేదు.
undefined
రాయలసీమ ప్రాంత విద్యార్థులు, మేధావులు, లాయర్లు అందరూ కూడా కర్నూల్ లో హై కోర్ట్ ను కోరుకుంటున్నారు కాబట్టి అక్కడ హై కోర్టును గనుక ఏర్పాటు చేస్తే... అయిపోతుందని భావించాడు జగన్ మోహన్ రెడ్డి. కాకపోతే అమరావతలోనే రాజధాని ఉంది ఉంటే, అప్పుడు కర్నూల్ లో హైకోర్టు ఏర్పాటు చేసి ఉంటే రాయలసీమ ప్రాంతం వారు ఒప్పుకునేవారు. అప్పుడు జగన్ ఇమేజ్ రాయలసీమలో అమాంతం పెరిగేది. అతని కోట మరింత బలపడేది.
undefined
కాకపోతే ఎప్పుడైతే విశాఖపట్నాన్ని కార్యనిర్వాహక రాజధానిగా ప్రకటించారో రాయలసీమ వాసులు సైతం తీవ్రమైన నిరసనలకు దిగుతున్నారు. వారి నిరసనల్లో వారి ఆకాంక్షలు కూడా లేకపోలేదు. రాయలసీమకు ఒక హై కోర్టు ఇస్తే అక్కడకు వెళ్ళేది కొన్ని వందల మంది లాయర్ల కుటుంబాలు, పదుల సంఖ్యలో జడ్జిల కుటుంబాలు.
undefined
అంతే తప్ప అక్కడ ప్రజలెవరూ సెటిల్ అవ్వరు. కేసులు ఉన్నప్పుడు అక్కడకు ఆ సదరు కేసుకు సంబంధించిన వ్యక్తులు వచ్చి పోతుంటారు తప్ప వారు అక్కడ స్థిర నివాసాన్ని మాత్రం ఏర్పాటు చేసుకోరు కదా.
undefined
ఈ లెక్కన అక్కడ లాభపడేది ఎవరన్నా ఉన్నారంటే అది ఖచ్చితంగా ఓయో, మేక్ మై ట్రిప్ వంటి హోటల్ బుకింగ్ సైట్లే తప్ప అక్కడి స్థానికులకు పెద్దగా ఒరిగేది మాత్రం ఏమి ఉండదు.
undefined
ఇక రాయలసీమలో మాత్రమే హై కోర్టు కాకుండా... ఈ హై కోర్టుకు అమరావతిలో, విశాఖపట్నంలో మల్లి బెంచులు కూడా ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. ఈ నేపథ్యంలో అన్ని కేసులు కూడా అప్పుడు కర్నూల్ వరకు రావు. ఇలాంటి పరిస్థితుల్లో రాయలసీమ ప్రాంత వాసులకు హై కోర్టు ఇచ్చినా పెద్దగా ఒరిగేది ఏమి లేదు.
undefined
విశాఖపట్నం కార్యనిర్వాహక రాజధానిగా గనుక కొనసాగితే... ఇప్పటికే పూర్తి స్థాయిలో అభివృద్ధి చెందిన విశాఖపట్నంలో అభివృద్ధి మరింతగా కేంద్రీకృతమవుతుంది. అమరావతిలో అభివృద్ధంతా కేంద్రీకృతమవుతుందని ఏ విధంగా అప్పటి ప్రతిపక్షం వైసీపీ గగ్గోలు పెట్టిందో... ఇప్పుడు విశాఖపట్నం వల్ల కూడా అలానే అభివృద్ధి కేంద్రీకృతమవుతుంది. రెండు సందర్భాల్లోనూ.. తాము నష్టపోయామనే భావన మాత్రం సీమ ప్రజలను వెంటాడుతుంది.
undefined
ఈ పరిస్థితుల నేపథ్యంలో రాయలసీమలో రెండో రాజధానిని ఏర్పాటు అయినా చేయండి, లేదంటే ప్రత్యేక రాష్ట్ర ఉద్యమానికి తెరతీస్తామని ఇప్పటికే రాయలసీమ ప్రాంత నాయకులు లేఖాస్త్రాలు సంధిస్తున్నారు. ఈ లేఖలతో పాటుగానే తాజాగా చోటుచేసుకున్న ఒక రెండు సంఘటనలను కూడా మనం పరిగణలోకి తీసుకుంటే రాయలసీమలోని రాజకీయ సమీకరణాలను మనం మరింతబాగా అర్థం చేసుకునే వీలుంటుంది.
undefined
తాజాగా మంత్రాలయం నుంచి టీడీపీ తరుఫున ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయిన తిక్క రెడ్డి మాట్లాడుతూ... తాము విశాఖపట్నానికి వెళ్లాలంటే రెండు రోజుల సమయం పడుతుందని, అందుకు బదులుగా తమను కర్ణాటకలో విలీనం చేయమని కోరాడు. నేడు మరో టీడీపీ నేత, మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి మాట్లాడుతూ...తిరుపతిని రాజధానిగా చేయండి, లేదా చిత్తూరు జిల్లాను తమిళనాడులో కానీ, కర్ణాటకలో కానీ కలిపేయండంటూ కొత్త ప్రొపోజల్ పెట్టాడు.
undefined
వీరికంటే రెండు రోజుల ముందు ఎంపీ టీజీ వెంకటేష్ కూడా ఇలానే ధ్వనించే మాట మాట్లాడాడు. విశాఖను రాజధానిగా చేసి, దాన్ని మరింతగా అభివృద్ధి చేస్తే ఆ తరువాత హైదరాబాద్ నుండి వెళ్లగొట్టినట్టు మళ్ళీ సీమ ప్రజలను అక్కడి నుండి వెళ్ళగొడతారు అని మాట్లాడాడు.
undefined
ఇలా వీరందరి మాటలను బట్టి చూస్తుంటే... రాయలసీమ ప్రాంతానికి అన్యాయం జరుగుతుందనే ఒక భావనను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. ఈ అన్ని పరిస్థితుల నేపథ్యంలో అసలు సందిగ్ధత నెలకొంది బీజేపీ వైఖరి గురించి. ఒక నేతేమో సపోర్ట్ చేస్తుందంటాడు, ఇంకొకరేమో లేదు అంటారు. అసలు బీజేపీ ఎం చేయబోతుందనేది అసలు ప్రశ్నగా మారింది.
undefined
ప్రస్తుతానికి బీజేపీ ముందు రెండు ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి జగన్ ముందరి కాళ్లకు బంధం వేసి, నయానో భయానో అమరావతినే రాజధానిగా కొనసాగించేలా చేసి, ఆ క్రెడిట్ తమదే అని చెప్పుకోవడం. కాకపోతే ఈ విధంగా చేసినా ఇప్పటికిప్పుడు బీజేపీకి వచ్చే లాభం పెద్దగా కనబడడం లేదు. ఒకవేళ ఆ పనిని బీజేపీ చేసినా...ఆ క్రెడిట్ అంతా టీడీపీ ఖాతాలోకి వెళ్లడం ఖాయం.
undefined
ఈ నేపథ్యంలో బీజేపీ జగన్ రాజధాని తరలింపు కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. ఒక్క సారి జగన్ గనుక రాజధానిని మారిస్తే అప్పుడు రాయలసీమ ప్రాంత నేతలకందరిని కలుపుకొని పోతు అక్కడ బలమైన శక్తిగా ఎదగాలని బీజేపీ భావిస్తుంది.
undefined
ఎలాగూ బీజేపీ చిన్న రాష్ట్రాలకు అనుకూలం కాబట్టి ప్రత్యేక రాయలసీమ ఉద్యమమో లేక గ్రేటర్ రాయలసీమ ఉద్యమమో ఏదో ఒకదానికి బీజేపీ మద్దతు పలికి ఆ దిశగా పావులు కదిపేందుకే అమితాసక్తి చూపెడుతూ ఉండొచ్చు.
undefined
click me!