ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బిజెపి అధ్యక్షుడి మార్పు విషయంలో పార్టీ అధినాయకత్వం లెక్కలు వేరుగా ఉండవచ్చు. కానీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి మాత్రం ఊరట లభించినట్లే. ఏపీ బిజెపి అధ్యక్షుడిగా కన్నా లక్ష్మినారాయణ స్థానంలో సోము వీర్రాజు నియమితులయ్యారు.
undefined
కన్నా లక్ష్మినారాయణ నుంచి వైఎస్ జగన్ తీవ్రమైన వ్యతిరేకత ఎదుర్కున్నారు. పలు విషయాల్లో జగన్ ను ఇరకాటంలో పెట్టడానికి ప్రయత్నించారు. తీవ్రమైన ప్రతిపక్ష నేతగా ఆయన ముందుకు రావడానికి ఆయన అలా దూకుడుగా వ్యవహరించి ఉండవచ్చు.
undefined
కన్నా లక్ష్మీనారాయణ దూకుడును వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ ఎంపీ విజయసాయి రెడ్డి మరో రకంగా వ్యాఖ్యానించారు. కన్నా లక్ష్మీనారాయణ కూడా టీడీపీ అధినేత చంద్రబాబు గూటి పక్షి అని ఆయన అభివర్ణించారు. టీడీపీ గూటి పక్షుల వల్ల బిజెపికి నష్టం జరుగుతుందని కూడా ఆయన అన్నారు.
undefined
విజయసాయి రెడ్డి మాటలను దృష్టిలో పెట్టుుకునే కన్నా లక్ష్మీనారాయణను తప్పించినట్లు వ్యాఖ్యలు కూడా వినిపిస్తున్నాయి. ఢిల్లీలో తనకున్న పరిచయాలతో విజయసాయి రెడ్డి పని కానిచ్చేశారనే వ్యాఖ్యలు కూడా వినిపించాయి. అయితే, అందులో వాస్తవం ఉందని చెప్పలేం. బిజెపికి తన లెక్కలు తనకు ఉన్నాయి.
undefined
అంతేకాకుండా, కన్నా లక్ష్మినారాయణపై భూకబ్జా ఆరోపణలు వచ్చాయి. విశాఖపట్నంలో ఆయన భూమిని కబ్జా చేశారనే ఆరోపణలు వచ్చాయి. ఆ ఆరోపణలను కన్నా లక్ష్మినారాయణ తీవ్రంగానే ఖండించారు. అప్పటి నుంచే జగన్ ప్రభుత్వంపై ఆయన దూకుడుగా వ్యవహరిస్తూ వచ్చారని అంటారు.
undefined
అయితే, కన్నా లక్ష్మినారాయణ కాంగ్రెసు పార్టీకి రాజీనామా చేసి బిజెపిలో చేరారు. తీవ్రమైన ఒత్తిడి మధ్య ఆయనను బిజెపి అధ్యక్షుడిగా నియమించినట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. అయితే, సిద్ధాంత బలం లేని నాయకుల వల్ల అంతగా ప్రయోజనం ఉండదని బిజెపి అధినాయకత్వం భావించినట్లు తెలుస్తోంది. ఆర్ఎస్ఎస్ నుంచి ఎదిగి సోము వీర్రాజును అందుకే బిజెపి అధ్యక్షుడిగా నియమించినట్లు చెబుతున్నారు.
undefined
అయితే, సోము వీర్రాజు వైఎస్ జగన్ కు అనుకూలంగా వ్యవహరిస్తారని చెప్పడానికి వీలేమీ లేదు. అయితే, ఓ పద్ధతి ప్రకారం జగన్ ప్రభుత్వం మీద విమర్శలు సంధించాలనే ఉద్దేశంతోనే ఆయనను బిజెపి చీఫ్ గా నియమించినట్లు చెబుతున్నారు. అంతేకాకుండా చంద్రబాబుకు బిజెపి అనుకూలంగా ఉందనే అభిప్రాయాన్ని తుడిచిపెట్టే ఉద్దేశం కూడా ఈ మార్పులో ఉన్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వం తప్పులను సహించేది లేదని, తప్పులను ఎత్తి చూపుతామని సోము వీర్రాజు చెప్పారు.
undefined