టీడీపీ చీఫ్ చంద్రబాబునాయుడు చేసిన ప్రయోగం ఫలించలేదు. సుదీర్ఘకాలం పాటు ప్రత్యర్థులుగా ఉన్నవారిని పార్టీలో చేర్చుకొన్నారు. ప్రత్యర్థులే పార్టీలో చేరి పెత్తనం చేయడంతో పార్టీనే నమ్ముకొని పనిచేసిన నేతలు జీర్ణించుకోలేకపోయారు.
undefined
ఒకే ఒరలో రెండు కత్తులు ఇమడవు అనేది నానుడి. దీన్ని నిజం చేస్తూ కొందరు నేతలు పార్టీని వీడారు. పార్టీ అధినేత తీరు నచ్చక కొందరు, రాజకీయ భవిష్యత్తు కోసం మరికొందరు నేతలు టీడీపీకి గుడ్ బై చెప్పారు. దీంతో చంద్రబాబు ప్లాన్ వర్కవుట్ కాలేదు.
undefined
ఏపీ రాష్ట్రంలో టీడీపీ అధికారంలో ఉన్న సమయంలో చంద్రబాబునాయుడు పలు ప్రయోగాలు చేశారు. వైసీపీని దెబ్బతీసేందుకు చేసిన ప్రయత్నాలు టీడీపీకి పెద్దగా కలిసి రాలేదు. సుధీర్ఘకాలం పాటు టీడీపీకి వ్యతిరేకంగా పనిచేసిన వారిని పార్టీలోకి ఆహ్వానించారు. రాజకీయ అవసరాల రీత్యా తప్పదని కూడ పార్టీ నాయకులకు బాబు స్పష్టం చేశారు. కానీ ఈ ప్రయోగం పెద్దగా టీడీపీకి కలిసి రాలేదు.
undefined
ఏపీ రాష్ట్రంలో చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో 23 మంది వైసీపీ ఎమ్మెల్యేలను టీడీపీలో చేర్చుకొన్నారు. వైసీపీ నుండి టీడీపీలో చేర్చుకొన్నవారికి మంత్రి పదవులు కూడ కట్టబెట్టారు చంద్రబాబు.
undefined
కర్నూల్ జిల్లాలో మాజీ కేంద్ర మంత్రి కోట్ల సూర్యప్రకాష్ రెడ్డిని ఎన్నికల ముందు టీడీపీలో చేర్చుకొన్నారు. సూర్యప్రకాష్ రెడ్డిని టీడీపీలో చేర్చుకొనే ముందు మాజీ డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తితో టీడీపీ చీఫ్ చంద్రబాబునాయుడు సంప్రదింపులు జరిపారు.
undefined
కోట్ల సూర్యప్రకాష్ రెడ్డిని పార్టీలో చేర్చుకొనే సమయంలో కేఈ కృష్ణమూర్తి కుటుంబాన్ని ఒప్పించాడు. అయితే గత ఎన్నికల్లో కేఈ తనయుడు శ్యాంబాబు, కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి, కోట్ల సుజాతమ్మలు కూడ టీడీపీ టిక్కెట్టుపై పోటీ చేసి ఓటమి పాలయ్యారు. కోట్ల సూర్యప్రకాష్ రెడ్డికి ఎంపీ టిక్కెట్టు ఇవ్వడంతో అప్పుడు ఎంపీగా ఉన్న బుట్టా రేణుక వైసీపీలో చేరారు.కర్నూల్ అసెంబ్లీ టిక్కెట్టు దక్కకపోవడంతో ఎస్వీ మోహన్ రెడ్డి కూడ వైసీపీ గూటికి చేరారు.
undefined
ఇదే జిల్లాలో గౌరు వెంకట్ రెడ్డి కుటుంబం టీడీపీలో చేరింది. గౌరు వెంకట్ రెడ్డికి వైఎస్ రాజశేఖర్ రెడ్డికి అత్యంత సన్నిహితుడుగా పేరుంది. వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రతిపక్షనేతగా ఉన్న సమయంలో జైలులో ఉన్న గౌరు వెంకట్ రెడ్డిని కలవడంపై టీడీపీ తీవ్ర విమర్శలు చేసింది. గౌరు చరితకు గత ఎన్నికల్లో టీడీపీ టిక్కెట్టు ఇచ్చింది. గౌరు చరిత కూడ ఓటమి పాలైంది. ప్రస్తుతం గౌరు కుటుంబం టీడీపీలోనే ఉంది.
undefined
ఇదే జిల్లాలోని నంద్యాల మాజీ ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి కుటుంబం వైసీపీ నుండి టీడీపీలో చేరింది. అయితే అప్పట్లో భూమా నాగిరెడ్డి కుటుంబం టీడీపీలో చేరడాన్ని మాజీ మంత్రి శిల్పా మోహన్ రెడ్డి తీవ్రంగా వ్యతిరేకించారు. కానీ చంద్రబాబునాయుడు వారికి సర్ధిచెప్పారు.
undefined
భూమా నాగిరెడ్డి టీడీపీలో చేరిన కొంతకాలానికే మరణించారు. దీంతో భూమా నాగిరెడ్డి కూతురు అఖిలప్రియకు మంత్రివర్గంలో చోటు కల్పించారు చంద్రబాబు. నంద్యాల ఉప ఎన్నికల్లో భూమా బ్రహ్మనందరెడ్డికి టీడీపీ టిక్కెట్టు ఇచ్చింది. ఈ సమయంలో మాజీ మంత్రి శిల్పా మోహన్ రెడ్డి, శిల్పా చక్రపాణిరెడ్డిలు టీడీపీకి గుడ్ బై చెప్పారు. వైసీపీలో చేరారు.
undefined
గంగుల ప్రభాకర్ రెడ్డి టీడీపీకి గుడ్ బై చెప్పి వైసీపీలో చేరారు. గంగుల ప్రభాకర్ రెడ్డికి వైసీపీ ఎమ్మెల్సీ పదవి ఇచ్చింది. ప్రభాకర్ రెడ్డి తనయుడు ప్రస్తుతం ఆళ్లగడ్డ నుండి ఎమ్మెల్యేగా ప్రాతినిథ్యం వహిస్తున్నారు.
undefined
కడప జిల్లా జమ్మలమడులో ఆదినారాయణరెడ్డి, రామసుబ్బారెడ్డి కుటుంబాల మధ్య దశాబ్దాలుగా ఫ్యాక్షన్ గొడవలున్నాయి. ఆదినారాయణరెడ్డి కుటుంబం తొలుత కాంగ్రెస్ లో ఉండేది. ఆ తర్వాత వైసీపీలో చేరింది. రామసుబ్బారెడ్డి కుటుంబం తొలి నుండి టీడీపీలో ఉంది.
undefined
చంద్రబాబునాయుడు అధికారంలో ఉన్న సమయంలో ఆదినారాయణరెడ్డిని వైసీపీ నుండి టీడీపీలో చేరారు. ఆదినారాయణరెడ్డికి మంత్రి పదవి కూడ ఇచ్చాడు చంద్రబాబు. ఆదినారాయణరెడ్డిని టీడీపీలో చేర్చుకోవడంపై అప్పట్లో రామసుబ్బారెడ్డి తీవ్రంగా వ్యతిరేకించారు. ఎంపీ సీఎం రమేష్ ఆదినారాయణరెడ్డిని వైసీపీ నుండి టీడీపీలో చేర్పించడంలో కీలకపాత్ర పోషించారని రామసుబ్బారెడ్డి వర్గీయులు అప్పట్లో సీఎం రమేష్ పై దాడికి యత్నించారు.
undefined
రామసుబ్బారెడ్డికి ఎమ్మెల్సీ పదవి ఇచ్చారు. 2019 ఎన్నికల్లో కడప ఎంపీ స్థానం నుండి ఆదినారాయణ రెడ్డి, జమ్మలమడుగు నుండి రామసుబ్బారెడ్డి పోటీ చేశారు. కానీ, ఈ రెండు స్థానాల్లో టీడీపీ ఓటమి పాలైంది. ఎన్నికలయ్యాక ఆదినారాయణరెడ్డి బీజేపీ తీర్థం పుచ్చుకొన్నారు. రామసుబ్బారెడ్డి వైసీపీలో చేరారు. దీంతో జమ్మలమడుగులో టీడీపీకి నాయకుడు లేకుండా పోయారు. ఇద్దరు బలమైన నాయకులు పార్టీకి దూరమయ్యారు.
undefined
విజయనగరం జిల్లాలోని రాజ కుటుంబాల మధ్య తరతరాలుగా అంతరం ఉంది. బొబ్బిలి రాజులకు, విజయనగరం రాజులకు మధ్య పొసగదు. వైసీపీలో ఉన్న సుజయకృష్ణరంగారావు టీడీపీలో చేరారు. ఆ సమయంలో ఆశోక్ గజపతి రాజు కేంద్ర మంత్రిగా ఉన్నారు. సుజయ కృష్ణరంగారావుకు కేబినెట్ లో చోటు కల్పించారు బాబు.
undefined
గత ఏడాది జరిగిన ఎన్నికల్లో సుజయకృష్ణ రంగారావుతో పాటు ఆశోక్ గజపతి రాజు కూతురు, ఆశోక్ గజపతిరాజు కూడ ఓటమి పాలయ్యారు. ఓటమి పాలైన తర్వాత సుజయ కృష్ణరంగారావు పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. విశాఖలోనే ఆయన ఎక్కువగా ఉంటున్నారని తెలుస్తోంది.
undefined
ప్రకాశం జిల్లాలో కరణం బలరాం, గొట్టిపాటి రవికుమార్ కుటుంబాల మధ్య సుధీర్ఘ కాలంగా గొడవలున్నాయి. గొట్టిపాటి రవికుమార్ ను టీడీపీలో చేర్చుకోవడంపై కరణం బలరాం తీవ్రంగా వ్యతిరేకించారు. ఈ సమయంలో బలరాంకు ఎమ్మెల్సీ కూడ చంద్రబాబు ఇచ్చారు. పార్టీ కార్యక్రమంలో గొట్టిపాటి వర్గీయులపై కరణం బలరాం గొడవకు దిగారు.
undefined
గత ఎన్నికల సమయంలో చీరాల నుండి కరణం బలరాం పోటీ చేసి విజయం సాధించాడు. చీరాల నుండి పోటీ చేసిన ఆమంచి కృష్ణమోహన్ టీడీపీకి గుడ్ బై చెప్పి వైసీపీలో చేరారు. దీంతో చీరాల నుండి కరణం బలరాం టీడీపీ అభ్యర్ధిగా పోటీ చేసి విజయం సాధించారు. గత ఎన్నికల్లో ఇదే స్థానంలో ఆమంచి కృష్ణమోహన్ పై పోతుల సునీతకు చంద్రబాబు టిక్కెట్టు ఇచ్చారు. సునీతపై పోటీ చేసి విజయం సాధించి ఆమంచి కృష్ణమోహన్ ను పార్టీలో తీసుకోవడంపై సునీత అసంతృప్తితో ఉంది.
undefined
అయితే ఎన్నికల తర్వాత పోతుల సునీతకు చంద్రబాబునాయుడు ఎమ్మెల్సీ ఇచ్చాడు. పోతుల సునీత కూడ వైసీపీలో చేరారు. ఇటీవలనే కరణం బలరాం జగన్ కు జై కొట్టారు. కరణం బలరాం తనయుడు కరణం వెంకటేష్ వైసీపీ తీర్థం పుచ్చుకొన్నారు.
undefined
కృష్ణా జిల్లాలో వంగవీటి రాధా వైసీపీ నుండి టీడీపీలో చేరాడు. ఎన్నికలకు ముందు ఆయన వైసీపీని వీడారు. ఎన్నికలకు ఏడాదిన్నర ముందే దేవినేని అవినాష్ టీడీపీలో చేరారు. ఎన్నికలయ్యాక వంగవీటి రాధా టీడీపీకి దూరంగా ఉంటున్నారు. ఆయన జనసేనలో చేరుతారనే ప్రచారం సాగింది. కానీ, ఆయన ఆ పార్టీలో చేరలేదు.గత ఎన్నికల్లో గుడివాడ నుండి పోటీ చేసిన దేవినేని అవినాష్ టీడీపీని వీడి వైసీపీలో చేరాడు.
undefined